Fake SI
-
కిలాడీ దేవసేన.. అమ్మకు క్యాన్సర్ అని చెప్పి ఫోన్, ఆపై
టీ.నగర్: కారైకుడిలో నకిలీ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి పురూరుకు చెందిన వడివుక్కరసి(33) మానగిరిలోని పాఠశాలలో తమిళ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈమె భర్త మురుగానందం. ఇతను మాజీ సైనికుడు. కొన్ని నెలల క్రితం వడివుక్కరసి సొంతపని నిమిత్తం తిరువాడానై వెళ్లి బస్సులో తిరిగివస్తుండగా పక్క సీట్లో కూర్చున్న మహిళ ఒకరు వడివుక్కరసితో మాటలు కలిపింది. తన పేరు దేవసేన అని, తెన్కాశి పోలీసు శాఖలో టెక్నికల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సెలవుపై వస్తున్నానని, తన సొంతవూరు దొండి అని పేర్కొంది. ఆ తర్వాత తరచుగా ఫోన్లో మాట్లాడడమే కాకుండా, కొన్ని సార్లు వడివుక్కరసి ఇంటికి వచ్చింది. ఒకరోజు వడివుక్కరసికి దేవసేన ఫోన్ చేసి తన అమ్మ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అర్జంటుగా రూ.50 కావాలని తెలిపింది. దీంతో వడివుక్కరసి దేవసేన బ్యాంకు ఖాతాకు రూ.50 వేలు పంపారు. ఆ తర్వాత దేవసేన నుంచి ఫోన్‌కాల్ రాలేదు. ఆమె నెంబరుకు ఫోన్ చేయగా సరిగా మాట్లాడలేదు. దీంతో అనుమానించిన వడివుక్కరసి, ఆమె భర్త దొండి చిరునామాలో విచారించగా ఆమె కారైకుడి కళనివాసల్‌లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో వడివుక్కరసి కారైకుడి నార్త్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం దేవసేన (20)ను అరెస్టు చేశారు. చదవండి: కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్ మాదిరిగానే -
సీఎం కేసీఆర్ గన్‌మెన్ అంటూ..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు. నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తాను సీఎం కేసీఆర్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాని చెప్పకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జౌట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబూతూ నిరుద్యోగ యువత దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. టాస్క్‌పోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
దర్జాగా తిరుగుతూ.. అడ్డంగా దొరికి..
సాక్షి, విజయవాడ: ఫేక్ ఐడీ సృష్టించి.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా తిరుగుతున్న నకిలీ ఎస్ఐకి భవానీపురం పోలీసులు అరదండాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఛానల్ లో కరెస్పాండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రెగ్యులర్ గా తిరిగే ప్రశాంత్ కి కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. చెక్ పోస్టుల వద్ద చెకింగ్ తప్పించుకొనేందుకు, టోల్ ప్లాజా వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు పోలీస్ అవతారం ఎత్తాడు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ గా ఫేక్ ఐడీ సృష్టించాడు. కారు నంబర్ ప్లేట్ కూడా మార్చేశాడు. AP 05 DP 5911 గా ఉన్న కార్ నంబర్ ను TS 08 DP 5911 గా మార్పు చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. ఆపిన చోటల్లా ఎస్ఐ ని అంటూ బిల్డప్ ఇచ్చి ఖాకీలకే కుచ్చుటోపీ పెట్టాడు. (24 రోజులు...12 హత్యలు!) ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి చెక్ పోస్టులు దాటుకొని వచ్చిన ప్రశాంత్ ని వాహన తనిఖీలు చేస్తున్న భవానీపురం పోలీసులు చెక్ చేశారు. ఐడీ కార్డు తేడా గా ఉండటంతో అదుపులోకి తీసుకొన్నారు. ఖాకీ మార్కు ట్రీట్ మెంట్ ఇవ్వటం తో నకిలీ ఎస్ఐ వాస్తవాలను వెళ్లగక్కాడు. ప్రశాంత్ కి గతం లో కూడా నేర ప్రవృత్తి ఉందా, పాత కేసులు ఉన్నాయా, ఎస్ఐ పేరు తో ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, అతను చెప్పిన కారణాలు ఎంతవరకు నిజం, అక్రమ దందా ఏమైనా చేస్తున్నాడా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 170 ,419 ,465 ,468 ,471 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
నమ్మించి.. దోచేశాడు!
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సబ్ ఇన్స్పెక్టర్ని అంటూ ఓ నకిలీ ఐడీ కార్డు... నాలుగు మాయ మాటలు... అవే పెట్టుబడిగా ఓ యువతిని నమ్మించి మోసగించిన నకిలీ ఎస్ఐపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.రూ.12.8లక్షలు దోచుకోవడంతోపాటు బంగారు ఆభరణాలూ తాకట్టు పెట్టేశాడని... నమ్మించి పెళ్లి చేసుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గవర కంచరపాలెంలో నివాసముంటున్న పైడి ధనలక్ష్మికి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. తాను ఎస్ఐని అని, ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నానని... గ్రూప్ – 1 పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని నమ్మించాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది జూన్ 19న నగరంలోని వన్‌టౌన్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో కులాంతర వివాహం చేసుకుని రిజిస్టర్ చేయించారు. అయినప్పటికీ పెళ్లి వ్యవహారమంతా బయటకు పొక్కకుండా, తన కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తన చదువుల కోసం డబ్బులు అవసరమంటూ ధనలక్ష్మి తండ్రి నుంచి పలుమార్లు డబ్బులు రామచంద్రరావు తీసుకున్నాడని.., తన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని మోసం చేశాడని, తమ పెళ్లి విషయం తెలిసిన రామచంద్రరావు తల్లి పైడి జయలక్ష్మి, ఆడపడుచు దేవిక కులం పేరుతో దూషించారని, గవర కంచరపాలెంలో పెద్ద మనుషులపంచాయితీలో కూడా తన కుటుంబాన్ని దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. నమ్మించి మోసానికి పాల్పడిన రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రామచంద్రరావును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్‌కు బదిలీ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నకిలీ మహిళా ఎస్ఐ అరెస్ట్
అన్నానగర్: నామక్కల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుని బెదిరించిన నకిలీ మహిళా ఎస్ఐని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా ఎరుమప్పట్టి సమీపం అలంగానత్తంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక్కడ నర్సుగా అనీస్ఫరిదా బేగం పనిచేస్తోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐ వేషంలో ఓ మహిళ స్కూటీపై అక్కడికి వచ్చింది. ఆమె నర్సు వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీద ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని బెదిరించింది. దీనిపై ఆస్పత్రి డాక్టర్ తిలకవతికి ఆమె సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న తిలకవతి ఎస్ఐని ఐడీ కార్డు చూపించాలని అడిగారు. ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానంతో తిలకవతి ఎరుమప్పట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ మాదైయన్ సంఘటన స్థలానికి వచ్చి ఆ మహిళను విచారించారు. మొహనూర్ నావలడియాన్ ఆలయ సమీపానికి చెందిన విమలాదేవి (40) అని, ఆమె భర్తను విడిచి జీవిస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆమె 8వ తరగతి వరకే చదివిందని, నకిలీ ఎస్ఐని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ మహిళా పోలీసుస్టేషన్‌కి విమలాదేవిని తీసుకెళ్లారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఎన్ఐఏ ఎస్సైనంటూ సెటిల్మెంట్లు
ఎటపాక: ఎస్సైనంటూ కొంతకాలంగా సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర నిఘా సంస్థ అయిన ఎన్ఐఏ ఎస్సైనని చెబుతూ బోయిన సురేష్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతాల్లో కొంతకాలంగా సెటిల్మెంట్లు చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇతను నకిలీ ఎస్సైగా తేలడంతో ఎటపాక పోలీసులు వలపన్ని బుధవారం అతడిని అరెస్టు చేశారు. కాగా, ఈ నకిలీ ఎస్సైకు సహకరించిన ఎటపాక ఎస్సై నాగరాజును వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
నకిలీ ఎస్సై.. 84 కేసులు..
రూ.57లక్షలు, మూడు కార్లు, 10 బైక్‌లు చోరీ ఎర్రుపాలెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కండిపాడు మండలం దామలూరుకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ, నకిలీ ఎస్సై ఐతం రవిశేఖర్‌ను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. ఎర్రుపాలెం వైరా ఏసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి విలేకరులకు నిందితుడి వివరాలు వెల్లడించారు. నింది తుడు రవిశేఖర్ ఎస్సై, విజిలెన్స్ ఆఫీసర్నని చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లోని దాదాపు 8 జిల్లాల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రా ల్లో 84 క్రిమినల్ కేసులున్నాయి. గత నెల 19న ఓ నేరంపై జగ్గయ్యపేట జైలులో ఉన్న డు రవిశేఖర్‌ను ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు తాడేపల్లి గూడెం కోర్టులో హాజరుపరిచి.. తిరిగి తీసుకొస్తున్న క్రమంలో వారి కస్టడీ నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధిలో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ ఘటనలో అక్కడి ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా.. రవిశేఖర్ ఈనెల 17న రాత్రి ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న ఓ లారీ ఆఫీసుకు వచ్చా డు. లారీల్లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని.. కేసులు లేకుండా చేయాలంటే రూ.20వేలు ఇవ్వాలని లారీ యజమాని మొగిలి అప్పారావును డిమాండ్ చేశాడు. అప్పటికప్పుడు బెదిరించి రూ.5 వేల నగదు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అప్పారావు పోలీసులకు చేరవేయడంతో ఎస్సై ఆంజనేయులు, సిబ్బందితో వచ్చి నిందితుడు రవిశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో నకిలీ ఎస్సై?
ఎర్రుపాలెం: ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఏ.కొండూరు ఎస్సైనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నట్లు తెలిసింది. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దామలూరు గ్రామానికి చెందిన ఐతం రవి శేఖర్ తాను ఎస్సై నని చెప్పుకుంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి వచ్చాడు. తాను కృష్ణా జిల్లా ఏ.కొండూరు ఎస్సైనని, దొంగల సమాచారం కోసం సివిల్ డ్రస్‌లో తిరుగుతున్నామని, తనకు సహకరిం చాలని నమ్మబలికాడు. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో రాత్రి ఆశ్రయం పొందాడు. అప్పటికే గ్రామంలో కొందరిని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై జె.ఆంజనేయులు, సిబ్బంది మాటు వేసి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మధిర సీఐ శ్రీధర్ ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి.. నిందితుడిని ఖమ్మం సీసీఎస్‌కు తరలించినట్లు సమాచారం.