అరెస్టయిన నకిలీ ఎస్‌ఐ విమలాదేవి
అన్నానగర్: నామక్కల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుని బెదిరించిన నకిలీ మహిళా ఎస్‌ఐని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా ఎరుమప్పట్టి సమీపం అలంగానత్తంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక్కడ నర్సుగా అనీస్‌ఫరిదా బేగం పనిచేస్తోంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఎస్‌ఐ వేషంలో ఓ మహిళ స్కూటీపై అక్కడికి వచ్చింది. ఆమె నర్సు వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీద ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని బెదిరించింది. దీనిపై ఆస్పత్రి డాక్టర్ తిలకవతికి ఆమె సమాచారం అందించింది.
వెంటనే అక్కడికి చేరుకున్న తిలకవతి ఎస్‌ఐని ఐడీ కార్డు చూపించాలని అడిగారు. ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానంతో తిలకవతి ఎరుమప్పట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ మాదైయన్ సంఘటన స్థలానికి వచ్చి ఆ మహిళను విచారించారు. మొహనూర్ నావలడియాన్ ఆలయ సమీపానికి చెందిన విమలాదేవి (40) అని, ఆమె భర్తను విడిచి జీవిస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆమె 8వ తరగతి వరకే చదివిందని, నకిలీ ఎస్‌ఐని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ మహిళా పోలీసుస్టేషన్‌కి విమలాదేవిని తీసుకెళ్లారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment