గ్రామానికి చెందిన ఓ ఇంట్లో రాత్రి ఆశ్రయం పొందాడు. అప్పటికే గ్రామంలో కొందరిని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై జె.ఆంజనేయులు, సిబ్బంది మాటు వేసి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మధిర సీఐ శ్రీధర్ ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి.. నిందితుడిని ఖమ్మం సీసీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
పోలీసుల అదుపులో నకిలీ ఎస్సై?
Published Sun, Jun 18 2017 1:30 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
ఎర్రుపాలెం: ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఏ.కొండూరు ఎస్సైనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నట్లు తెలిసింది. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దామలూరు గ్రామానికి చెందిన ఐతం రవి శేఖర్ తాను ఎస్సై నని చెప్పుకుంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి వచ్చాడు. తాను కృష్ణా జిల్లా ఏ.కొండూరు ఎస్సైనని, దొంగల సమాచారం కోసం సివిల్ డ్రస్‌లో తిరుగుతున్నామని, తనకు సహకరిం చాలని నమ్మబలికాడు.

Advertisement
Advertisement