Fake stamp case
-
టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
నకిలీ దందాకు చెక్..13 మంది అరెస్టు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరుగుతున్న నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ ఆధార్, డాక్యుమెంట్స్, స్టాంప్స్ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. కోర్టులనే మోసం చేస్తూ న్యాయవాదుల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 150కిపైగా కేసులలో నకిలీ ప్రతాలను న్యాయవాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నలుగురైదుగురు న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసలలో నకిలీ దందా సాగిస్తున్నట్లు, గంజాయి కేసులో పూచీకత్తులకు 20 వేలు, రోడ్డు ప్రమాద కేసులో 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టులను మోసం చేసి నిందితులను రక్షించారని, ఇతర రాష్ట్రాల నిందితులకు పూచీకత్తు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించారు. ఈ వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా సాగుతోందన్నారు. గత భూదందా కేసులో రికార్డులు తారుమారుపై ఈ ముఠా పాత్ర ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నమని తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిలో ఒక రౌడీషీటర్ ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. -
శశికళ జైలులో ఉన్నారా? క్వార్టర్స్లోనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గ నాయకురాలు శశికళ జైలులో కాకుండా అధికారులకు లంచం ఇచ్చి సమీపంలోని క్వార్టర్స్‌లో ఉండేవారని అప్పట్లో తనకు సమాచారం అందిందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూపా మౌద్గిల్ ఇటీవల ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఆరోపణ రుజువైన పక్షంలో శశికళకు అదనపు శిక్ష పడే అవకాశం ఉంది. శశికళతోపాటు నకిలీ స్టాంపుల కేసు సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గి జైలు అధికారులకు లంచం ఇచ్చి దర్జా జీవితాన్ని గడిపారని సమాచారం. జైలు అధికారుల మీద రూప చేసిన ఆరోపణలపై వినయ్‌కుమార్ దర్యాప్తు జరుపుతున్నారు. రూ.2 కోట్ల హవాలా లావాదేవీలపై ఆయన విచారణలో ఆధారాలు లభించినట్లు సమాచారం. తొలి నివేదికను వినయ్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.