
శశికళ జైలులో ఉన్నారా? క్వార్టర్స్‌లోనా?
శశికళతోపాటు నకిలీ స్టాంపుల కేసు సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గి జైలు అధికారులకు లంచం ఇచ్చి దర్జా జీవితాన్ని గడిపారని సమాచారం. జైలు అధికారుల మీద రూప చేసిన ఆరోపణలపై వినయ్‌కుమార్ దర్యాప్తు జరుపుతున్నారు. రూ.2 కోట్ల హవాలా లావాదేవీలపై ఆయన విచారణలో ఆధారాలు లభించినట్లు సమాచారం. తొలి నివేదికను వినయ్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.