false promises
-
విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
-
ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీలా అబద్దాలు చెప్పం: రాహుల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడుపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీలా తాము అబద్దపు వాగ్ధానాలు చేయబోమని ధ్వజమెత్తారు. 'ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పారాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్దాలు చెప్పం' అని రాహుల్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేదే చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా.. 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. చదవండి: ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త.. -
ఆర్భాటమే.. ఆచరణేదీ?
సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి పర్యటనంటే జిల్లా అభివృద్ధికి ఉపయోగమని ప్రజలు భావించడం సర్వసాధారణం. నాలుగున్నరేళ్లుగా తద్భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రావడం.. హామీల వర్షం కురిపించడం, ఆచరణలో చిత్తశుద్ధి చూపకపోవడం క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఇప్పటికీ దాదాపు 25 పర్యాయాలు పర్యటించారు. హామీల జాబితా పెరిగిపోవడం మినహా నిర్ధిష్టమైన అభివృద్ధి కన్పించలేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జూన్ 30న ఉక్కు పరిశ్రమను రెండునెలల్లో నెలకొల్పుతామని ప్రకటించారు. నాలుగు నెలల తర్వాత అక్టోబర్ 30న నెలలో శంకుస్థాపన చేస్తామని మరోమారు ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసింది. ఇప్పటికీ ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. తాజాగా మంగళవారం జ్ఞానభేరి కార్యక్రమానికి యోగివేమన యూనివర్శిటీకి హాజరవుతున్నారు. ఇప్పటికైనా ‘చేసేదే చెప్పాలని, చెప్పింది చేయాలని’ ప్రజానీకం నినదిస్తోంది. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నన్నాళ్లు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎన్నికలు సమీపించేకొద్ది తెలుగుతమ్ముళ్లతో నాటకం రచించారు. ఆమేరకు ‘ఉక్కుదీక్ష’ పేరిట రక్తి కట్టించారు. పార్లమెంటులో ఏనాడు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్రశ్నించని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌చే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కేంద్ర ప్రభుత్వానికి 2నెలల గడువు ఇస్తున్నాం. రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతాం..అని ’ఈ ఏడాది జూన్ 30న కడప గడపలో ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఉక్కుదీక్షకు గుర్తుగా సీఎం చేతుల మీదుగా పైలాన్ కూడా ఆవిష్కరించారు. ఆపై గట్టిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద స్వరంతో హెచ్చరికలు చేస్తూ మరీ వెల్లడించారు. ఆగస్టు 30నాటికే రెండు నెలల గడువు ముగిసింది. నాలుగునెలల తర్వాత ఆక్టోబర్ 30న ధర్మపోరాటదీక్ష పేరిట ప్రొద్దుటూరుకు హాజరైన సీఎం నెలలోపు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. తొలుత హామీ ఇచ్చిన తదుపరి 5నెలలు గడిచినా శంకుస్థాపన దిశగా అడుగులు పడడం లేదు. ఉక్కుదీక్ష పైలాన్ దిష్టిబొమ్మలా జిల్లా పరిషత్ ప్రాంగణంలో దర్శమిస్తోండడం విశేషం. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూపులు.. మూడున్నరేళ్లుగా జిల్లాలోని రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో రోవాన్ తుపాన్, ఆ వెంటనే మరో తుపాన్ ప్రభావం ధాటికి పంటలు పూర్తిగా కోల్పోయారు. తుపాన్ గాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేకోడూరులో స్వయంగా పరిశీలించారు. అప్పట్లో వెంటనే పరిహారం అందించి ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఆచరణలో ఇప్పటికీ కన్పించలేదు. వ్యవసాయ పంటలు దాదాపుగా 57,062 హెక్టార్లుల్లో దెబ్బతిన్నాయి. ఇందులో వేరుశనగ, వరి, పత్తి, ఉల్లి, పూలతోటలు ఉన్నాయి. వీటికి ఇన్పుట్ సబ్సిడీ రూ.55.8కోట్లు రావాల్సి ఉంది. ఉద్యాన పంటలు 4,293 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. వీటికి రూ.10.2కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2015 నుంచి ఇప్పటివరకూ రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదరుచూడడం మినహా ప్రభుత్వం మంజూరు చేసిన దాఖలాలు లేవు. 2014–18 కాలంలో వడ్డీలేని రుణాలు కింద దాదాపు రూ.10కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. లక్షలోపు రుణం తీసుకున్న తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణం వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. అలాగే 3వ విడత రుణమాఫీ మొత్తం జిల్లాకు రూ.248.5 కోట్లు రావాల్సి ఉండగా సగం మొత్తంతో సరిపెట్టారు, 4, 5విడతలు పెండింగ్‌లో ఉన్నాయి. పేరుకుపోయిన సీఎం హామీల జాబితా.. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్లతోటలను దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత వాటి ఊసే ఎత్తుకొలేదు. దేవాలయాలను కలుపుతూ ఫిలిగ్రామ్ టూరిస్టు సర్క్యూట్ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. కడప–చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ. ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు, ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం అంటూ సీఎం ఊరించారు. ఇవన్నీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన ప్రతి సందర్భంలో ప్రకటించిన హామీలు. ఉర్దూ యూనివర్శిటీ స్థానంలో హాజ్‌హౌస్ మాత్రమే కడపకు పరిమితమైంది. తక్కిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో కన్పించలేదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటీకే ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఇదే విషయం ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో యోగివేమన యూనివర్శిటీ ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ల బాధ్యులను సభ్యులను పోలీసులచే అరెస్టులు చేయించడం విశేషం. -
ప్రభుత్వ బూటకపు వాగ్దానాలపై ఫేస్బుక్ కీడుస్తా: షబ్బీర్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు వాగ్దానాలను ఫేస్బుక్లో పెట్టి ప్రజల్లో ఎండగడతానని శాసనమండలి ఉప పక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరుల మాట్లాడారు. ముఖ్యమంత్రి తనను చెల్లని నోటు గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన 101 ప్రధాన వాగ్దానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్తానని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని, దళితుడికి సీఎం చేసానని పదేపదే ప్రకటించిన కేసీఆర్ చివరకు తనే సీఎం పీఠం కూర్చున్నాడని దుయ్యబట్టారు. -
బూటకపు హామీలివ్వలేదు: జగన్
- అధికారం కోసం బాబు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని అబద్ధాలాడారు - ఆ హామీని ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మడం వల్లే ఆయనకు అధికారం.. - చంద్రబాబు బండారం బయటపడే సమయం దగ్గరపడింది - చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి - ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి... ఈ ఐదేళ్లలో కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే అవకాశముంది.. - ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా జిల్లా స్థాయి నాయకులు సైతం వెళ్లి అండగా నిలవాలి సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘తెలంగాణ విడిపోక ముందు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ రైతుల రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. ఒక్క మన రాష్ర్టంలోనే అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలల్లా ఇచ్చారు. రూ.87 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానని అబద్దాలాడారు. రాష్ర్టంలో కోటీ 30 లక్షల మంది మనకు ఓటు వేస్తే.. టీడీపీకి కోటీ ముప్పై ఐదున్నర లక్షల మంది ఓట్లు వేశారు. మనం చెప్పిన మాటల కంటే చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను కేవలం ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మారు. అందువలనే ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘సీఎం స్థానంలో ఒకసారి కూర్చుంటే కనీసం 30 ఏళ్ల పాటు ప్రజలకు మేలు చేయాలన్నదే నా తపన. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టే బాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాను’’ అని చెప్పారు. రాజమండ్రిలో పార్టీ సమీక్షల సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోనూ పోరాటం.. ‘‘రుణ మాఫీ అబద్ధం ఆడి ఉంటే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వాడిని. అయితే మూడు నెలల్లోనే రాష్ర్ట ప్రజలే కాదు.. ఆచరణ సాధ్యం కాని ఆ హామీలు ఎందుకిచ్చారంటూ మీరు కూడా నన్ను తిట్టేవారు. ఆ పని చేయలేకనే నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను. మనం గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేసింది ఒక్క చంద్రబాబుతోనే కాదు. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోకూడా పోరాటం చేశాం. బాబును సీఎం చేయాలని వీరంతా సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల రుణమాఫీ ఒక్క బాబు వల్లే సాధ్యమని ‘ఈనాడు’లో బ్యానర్ కథనం రాస్తారు. ఇప్పుడు అదే ‘ఈనాడు’ పేపర్లో నాలుగు రోజుల క్రితం చూస్తే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ర్టంలో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వస్తోందని, పైగాా విభజనకు ముందు ఈ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏ విధంగా అమలు చేయగలరనే సందేహాలు ప్రజల్లో కలిగేలా కథనాలు రాస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలుద్దాం.. ఈ నెలలోనే చంద్రబాబు బండారం బయట పడుతుంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ అమలవుతుందో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. ఒక్క రుణమాఫీయే కాదు.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయగలడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి. ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి. ఈ సమయంలో నాయకులపైనే కాదు.. కార్యకర్తలపై కూడా కేసులు పెట్టవచ్చు. వేధింపులకు గురిచేయవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై ఇటువంటి దాడులు జరిగినా ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలోని నాయకులే కాదు.. జిల్లా మొత్తం అక్కడకు వెళ్లి ఆ కార్యకర్తకు అండగా నిలవాలి.. మరోసారి అలాంటి దాడులు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం.. ఇకపై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ కమిటీలను వేయడమే కాకుండా నిరంతరం వాటి పనితీరును మెరుగుపర్చేందుకు కృషి చే స్తాం. అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ గ్రామస్థాయిలో చర్చించి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేస్తాం.’’ -
'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టిన ఒకరోజు గడవకముందే రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విపక్ష బీజేపీ, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పార్టీలు బూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్ముతామని లేదా హెయిర్ కటింగ్ చేస్తామని హామీలు గుప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వారి మార్కెటింగ్ బాగుందని, ప్రతిదాన్ని తమ అనుకూలంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు కొత్త ఓటర్లపై వల వేస్తున్నారన్నారు. బూటకపు వాగ్దానాలకు మోసపోవద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 నిమిషాల పాటు సాగిన రాహుల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమీప భవిష్యత్‌లో పార్టీ, జాతి ఎదుర్కొనే సవాళ్ల గురించి ప్రస్తావించారు.