రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు వాగ్దానాలను ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రజల్లో ఎండగడతానని శాసనమండలి ఉప పక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్ అలీ హెచ్చరించారు.
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు వాగ్దానాలను ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రజల్లో ఎండగడతానని శాసనమండలి ఉప పక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరుల మాట్లాడారు. ముఖ్యమంత్రి తనను చెల్లని నోటు గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన 101 ప్రధాన వాగ్దానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్తానని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని, దళితుడికి సీఎం చేసానని పదేపదే ప్రకటించిన కేసీఆర్ చివరకు తనే సీఎం పీఠం కూర్చున్నాడని దుయ్యబట్టారు.