
ఫేస్‌బుక్‌లో జిల్లా
జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు జిల్లా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో ‘వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్’ పేరుతో ఖాతా తెరిచారు. ఈ మేరకు హోం పేజీలో రాష్ట్రప్రభుత్వ చిహ్నంతో పాటు సీఎం కేసీఆర్, పాకాల సరస్సు ఫొటోలు పొందుపరిచారు.
ఈ ఖాతాలో ఎప్పటికప్పుడు జిల్లాలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనల వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న పనులు, అమలవుతున్న పథకాల వివరాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫేస్‌బుక్ ఖాతా తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.