Family conflict
-
కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..
గాంధారి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్ వసంత్‌రావు (48) కుమారుడు బాదావత్ సురేశ్ (27) హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్‌రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రేమ్‌దీప్ తెలిపారు. ఇవి కూడా చదవండి: కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం! -
భార్యకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. భర్త షాకింగ్ నిర్ణయం
సోంపేట(శ్రీకాకుళం జిల్లా): వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు, సాధారణ జీవితంలో కుంగుబాటు కలగలిపి ఓ వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. మామిడిపల్లి పంచాయతీ రాజాం గ్రామానికి చెందిన యలమంచి గోపాల్(27) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బారువ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం గ్రామానికి చెందిన యలమంచి బైరమ్మకు ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు విదేశాల్లో వలస కార్మికులుగా ఉన్నారు. మూడో కుమారుడు గోపాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాల్‌కు అదే గ్రామానికి చెందిన దుమ్ము చాందినితో 18 నెలల కిందట వివాహమైంది. అయితే ఆరు నెలల నుంచి దంపతుల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. గ్రామ పెద్దలు రెండు సార్లు సమావేశం నిర్వహించి ఇద్దరు దంపతులను కలపాలని చూశారు. ఈ నెల 6న మరోసారి సమావేశం నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. అయితే భార్యకు ఎంత చెప్పినా కాపురానికి రావడం లేదని కలత చెందిన గోపాల్ ఆదివారం సాయంత్రం పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లి వెంటనే హరిపురం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే గోపాల్ మృతితో రాజాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరుకు బారువ ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో.. -
తోటి కోడళ్ల వివాదం.. గ్రామాల మధ్య ఘర్షణ
చిత్తూరు, కేవీపల్లె : మండలంలోని నక్కలదిన్నెవడ్డిపల్లెలో రెండు కుటుంబాల వివాదం గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన ఎ.అంజి భార్య నిర్మల, ఏ.రాము భార్య చామంతి శనివారం తాగునీటి విషయమై గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దిన్నెవడ్డిపల్లెకు చెందిన నిర్మల బంధువులు నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకుని చామంతి కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం ముదిరి ఆదివారం తెల్లవారుజామున రెండు గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఓ వర్గానికి చెందిన బైకుకు నిప్పుపెట్టారు. మరో రెండు కార్లు, బైకును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకుని సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 31 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలహాలు పోస్ట్‌పోన్ చేయండి
కరోనాకు రెండో దశ, మూడో దశఅని దశలు ఉన్నాయి. ప్రస్తుతం సంసారాలు కూడా రెండో దశకు చేరుకుంటున్నాయి. లాక్డౌన్ సందర్భంగా వచ్చిన విరామం మొదట సరదాగా ఉన్నా శృతి మించిన ఖాళీ సమయం ఒకరి లోపాలు మరొకరు ఎంచే స్థితికి కొన్ని ఇళ్లల్లో తీసుకెళ్లింది. గతంలో గొడవ జరిగితే కాసేపు బయట గడిపి చల్లార్చుకునేవారు. ఇప్పుడు ఇల్లు దాటని పరిస్థితిలో గొడవ అంతు తేల్చాలని అనుకోవచ్చు. కాని కలహాలు పోస్ట్‌పోన్ చేయండి. ప్రాణాలు ముఖ్యమని తలవండి. నిపుణులు చెప్తున్నది అదే. ‘మీరు అంట్లు కడగండి చాలు. కాఫీ, వంట నేను చూస్తాను’ ‘నాకు అంట్లు పెట్టకు. కాఫీ నేను చేస్తా’ ‘మీరు సరిగ్గా పెట్టరండీ. నాకు డబుల్ వర్క్ అవుతుంది’‘అంటే? నీకు వచ్చా? పెళ్లయిన కొత్తలో మా అమ్మ కదా నీకు నేర్పింది’ ‘ఆ... నా మీద మీకు చాలా నేర్పింది’ ‘మీనా...!’ ఇది మొదటి గొడవ. ‘పిల్లలు అలా తొమ్మిదీ పది దాకా నిద్రపోతే ఎలాగండీ. వాళ్లకు నా భయం లేదు. మీ భయం లేకపోతే ఎలా?’ ‘పడుకోనీ. వాళ్లు మాత్రం ఏం చేస్తారు. రాత్రంతా గేమ్స్ ఆడినట్టున్నారు.’‘మీరిలా వెనకేసుకొస్తే పని ఎవరు చేస్తారు? వాళ్లు కూడా పనిలో సాయం చేయాలి కదా’ ‘నువ్వు కదా గారం చేశావు. నేనా చేశాను’‘ఏం చెప్పినా ఎదురొస్తారు కదా. ఈ లాక్డౌన్ నా చావుకొచ్చింది’‘నీ విసుగు చూస్తుంటే చచ్చేలా ఉన్నాను’ఇది రెండో గొడవ. మీనాక్షికి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా ఉంది. ఉద్వేగం తన్నుకొకొస్తోంది. కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. చేస్తున్న చాకిరికి ప్రతిఫలం ఇదా అనిపిస్తోంది. ఎక్కడికైనా వెళ్లి కాస్త ఊపిరి పీల్చుకుందామని ఉంది. కాని ఎక్కడికి వెళ్లేట్టు? ఇల్లు కదలడానికి లేదు. అదే ఇల్లు. అదే హాలు. అవే బెడ్రూమ్స్. అదే కిచెన్. అనుక్షణం కంటి ముందు భర్త, ఇద్దరు పిల్లలు. తప్పు వారిదో తనదో తెలియకుండా ఉంది. ప్రపంచంతోపాటు దేశాన్ని కూడా కరోనా కబళించడం మొదలైంది. ప్రధాని మొదట ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్నారు. ఆ ఆదివారం ఇంట్లో అందరూ కదలకుండా ఉండిపోయారు. సరదాగా వొండుకుని తిన్నారు. సాయంత్రం పళ్లేలు మోగించారు. అయితే ఆ మరుసటి రోజే లాక్డౌన్ ముప్పు నెత్తిన పడింది. మీనాక్షి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. పిల్లలు ఒకరు బి.టెక్ ఫస్ట్ ఇయర్, మరొకరు ఫైనలియర్. లాక్‌డౌన్‌తో భార్యాభర్తలిద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ పడింది. పిల్లలలిద్దరికీ కాలేజీలు మూతపడ్డాయి. మామూలు దినచర్యలో అయితే నలుగురూ ఉదయం లేస్తే ఎవరి పనుల మీద వారెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరుకుంటారు. తినడం, టీవీ చూడటం, కాసేపు కబుర్లు... అంతకుమించి పెద్ద పెద్ద సంభాషణలకు, చర్చలకు తావుండదు. ఏవైనా చిన్న చిన్న ఫిర్యాదులున్నా అవి నీటి బుడగల్లా ఒకటి రెండు క్షణాల్లో తేలిపోయేవి. మీనాక్షి భర్తకు చాదస్తమే అయితే ఆ చాదస్తం ప్రదర్శించడానికి టైమ్ ఉండేది కాదు. లాక్డౌన్ తర్వాత చాలారోజులకు నలుగురూ కలిసి గడిపే పరిస్థితి వచ్చింది. మొదటి నాలుగైదు రోజులు చాలా హుషారుగా అనిపించింది. కరోనా భయంతో తలుపులు మూసుకుని ఉండాల్సి రావడంతో కబుర్లు నడిచాయి. గేమ్స్ ఆడారు. అమేజాన్‌లోనో నెట్‌ఫ్లిక్స్‌లోనో సినిమాలు చూశారు. భర్త తన ఆఫీసు పని లాప్టాప్లో చేసుకునేవాడు. కాని మీనాక్షి తన ఆఫీస్‌పనితో పాటు ఇంటి పని కూడా చేయాల్సి వచ్చింది. కాని ఆ పనికి కూడా ఆమె సంతోషపడింది. నలుగురూ కలిసి తినడం, నలుగురూ కళ్ల ముందర ఉండటం బాగా అనిపించింది. కాని మెల్లగా పరిస్థితి మారింది. ‘ఉద్యోగం కోసం బయటకెళతాను గాబట్టి సరిపోయింది. రోజంతా నిన్ను చూస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది’ అన్నాడు భర్త. ‘అంత పాపం ఏం చేశాను’ అంది మీనాక్షి. ‘నీకు పని మీద శ్రద్ధ లేదు. ఇంటి మీద శ్రద్ధలేదు. అన్నీ కుదురుగా చేసుకుందామనే ధ్యాస లేదు. ఏదో వొండి నా మొహాన పిల్లల ముఖాన పడేసి ఆఫీసుకెళ్లడమో, లాప్టాప్ ముందు కూలబడటమో చేద్దామనుకుంటుంటావ్. ఉద్యోగం చేసే పిల్ల వద్దురా అని అప్పుడే మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆ మాట విలువ తెలిసొస్తోంది’ ‘నెల నెలా నా జీతం తీసుకుంటారుగా. అప్పుడు తెలిసి రాలేదా?’ మీనాక్షి చురకేసింది. అంతకు ముందు ఇలాంటి గొడవొస్తే ఎలాగోలా సద్దుమణిగేది. ఇప్పుడు మనిషి ఎదురుగా ఉండే సరికి వేరే పనేమీ లేకపోయేసరికి గొడవ పెరిగిపోతూ ఉంది. పిల్లలు ఎంత అనుభవ శూన్యంగా, ఉద్వేగాలు పట్టనివారుగా ఉంటున్నారో ఇప్పుడే అర్థమవుతోంది. తల్లిదండ్రుల కలహాలను తగ్గించడం, సర్దిచెప్పడం కూడా వారికి రావడం లేదు. ఇలాగే అయితే ఇంకొన్నాళ్లకు ఏమవుతుందో అని మీనాకు భయం వేసింది. ఒక ఫ్రెండ్‌తో గోడు వెళ్లబోసుకుంటే సైకియాట్రిస్ట్‌తో ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పింది. ‘కరోనా భయం కూడా మీ కలహాలకు లేదన్నమాట’ అన్నాడు సైకియాట్రిస్ట్ ఆమె ఉద్వేగాన్ని తేలిక చేయడానికి నవ్వుతూ. ‘డాక్టర్’... ‘చూడండి. ఇప్పుడు మనకు కొత్త జీవన విధానం వచ్చింది. కలిసి ఉండాలి... కాని దూరం దూరంగా ఉండాలి... అదే ఈ జీవన విధానం. మీ భర్తతో మీరు కలసి ఉండండి... కాని ఆయన ఫిర్యాదులతో, పితూరీలతో, అభ్యంతరాలతో దూరంగా ఉండండి. ఆయన కూడా మీ గురించి అదే చేయాలి. మీతో దగ్గరగా మీ కంప్లయింట్స్‌తో దూరంగా ఉండాలి. ఏవైనా కంప్లయింట్లు ఉంటే వాటి సంగతి తర్వాత చూసుకోవాలి. అంతవరకూ మీ కలహాలు పోస్ట్‌పోన్ చేసుకోండి. ఇప్పుడు అలకలు, పుట్టింటికి వెళ్లడాలు, భర్త బయటకువెళ్లి హాస్టల్లో చేరడాలు కుదరవు. కరోనాకు విరుగుడుగా చేతులు కడుక్కున్నట్టుగా బాధించే ఉద్వేగాలను మనసు నుంచి కడిగేసుకోవడమే ఇప్పుడు కావలసింది. మీ భర్తతో మాట్లాడించండి. ఆయనకూ ఇదే చెబుతాను. ఇక పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం, వారు ఈ ఖాళీ సమయంలో కొట్టుకుపోకుండా చదువుపై దృష్టి మళ్లించడం మీ ఇద్దరూ కలిసి చేయవలసిన పని. అది మర్చిపోకండి’ అన్నాడు సైకియాట్రిస్ట్. ఆ తర్వాత భర్తతో కూడా మాట్లాడాడు.ఇప్పుడు ఆ ఇంటికి బయటి ప్రమాదాన్ని ఎదుర్కోగల లోపలి ఐకమత్యం వచ్చింది. బయట ఒక జీవన్మరణ సమస్య ఉంది. ఆ సమస్య ముందు కాపురంలో కలహం కొంచెం చిన్న సమస్య. బయటి సమస్యకు విరుగుడులేదు. లోపలి సమస్యను అర్థం చేసుకుంటే విరుగుడు ఉంది. ముందు మనమంతా ప్రాణాలను కాపాడుకోవాలి.ఇంటిని ఆరోగ్యవంతం చేసుకోవాలి. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
బంధువులే అతన్ని చంపేశారు ..
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి) : భీమవరంలో మాయమై బిక్కవోలులో శవంగా కనిపించిన ఆర్ఎంపీ డాక్టర్ మామిడిశెట్టి నర్సింహమూర్తి (36) కేసు మిస్టరీ వీడింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆయన్ను బావమరుదులు, బంధువుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు శ్రీనివాససెంటర్‌లో నివాసం ఉంటున్న మామిడిశెట్టి స్వప్న మంజరి ఈనెల 7న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త నర్సింహమూర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తేదీన దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, దూనబోయిన లక్ష్మీనారాయణరావులతో కలిసి బయటకు వెళ్లినట్లు అప్పటి నుంచి తన భర్త సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని తీసుకువెళ్లిన వారిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు వివరాలను నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జరిగింది ఇదీ.. మామిడిశెట్టి నర్సింహమూర్తి భీమవరం శ్రీనివాస సెంటర్లో ఆర్ఎంపీ డాక్టర్‌గా శివప్రియ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్నాడు. 15 ఏళ్ల క్రితం రాజరాజేశ్వరి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆమె తన భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి తిరిగి వస్తుండేది. ఈ నేపథ్యంలో నర్సింహమూర్తి స్వప్నమంజరి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆరేళ్ల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ముగ్గురు ఆడ పిల్లలు, రెండవ భార్యతో కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి వెళుతుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాజరాజేశ్వరి కనిపించకపోవడంతో ఆమె సోదరులు దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, లక్ష్మీనారాయణలు దాచి వేసి ఉంటారని వారితో పలుమార్లు నర్సింహమూర్తి గొడవపడ్డాడు. తమ సోదరి ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి బావ నర్సింహమూర్తి కారణమని లక్ష్మీనర్సింహరావు భావించి కక్ష్య పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం హత్య లక్ష్మీనర్సింహరావు అతని సోదరుడు లక్ష్మీనారాయణ మేనల్లుడు మల్లుల నాగశివ, తోడల్లుడు కట్టా కృష్ణమూర్తి, దూరపు బంధువు కంద్రేకుల మోహన నాగేంధ్రరరావులతో కలిసి నర్సింహమూర్తి హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 4న రాజరాజేశ్వరి పిఠాపురంలో ఉన్నట్లు ఆచూకీ తెలిసిందని బావను నమ్మించి కారులో తీసుకువెళ్లారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో బిక్కవోలు–సామర్లకోట కెనాల్ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కారును ఆపి మధ్యలో కూర్చొన్న నర్సింహమూర్తి మెడచుట్టూ స్కార్ఫ్‌తో గట్టిగా ముడిపెట్టి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డును ఆనుకుని ఉన్న కాలువలో పడేశారు. 11న ఆచూకీ లభ్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 11న లక్ష్మీనర్సింహరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం విషయాన్ని అతను అంగీకరించి మృతదేహాన్ని చూపించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలిన నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీఎస్పీ కె.నాగేశ్వరరావు, కేసు దర్యాప్తు చేసిన సీఐ పి.చంద్రశేఖరరావును సహకరించిన సిబ్బందని అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై డి.హరికృష్ణ పాల్గొన్నారు. -
చేతబడి అనుమానంతో..దంతాలను పీకేసేందుకు ప్రయత్నం
తూర్పుగోదావరి , తుని రూరల్: తుని మండలం తేటగుంట గ్రామంలో చేతబడి చేశారన్న అనుమానంతో ఓ కుటుంబంపై మరో కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన ఇది. ఈ మేరకు తుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తుండడంతో బాధితులు పాత్రికేయులను ఆశ్రయించారు. గురువారం తుని ఏరియా ఆస్పత్రిలో వారు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. తేటగుంట గ్రామానికి చెందిన గురజా వెంకట్రావు నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజాలాగే బుధవారం వృత్తి ముగించుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా సమీపంలో నివాసం ఉంటున్న కోన నాగేశ్వరరావు, కోన పెదకాపు, కోన సోమేశ్వరరావు, కోన శ్రీను, మహిళలైన కోన గవర్రాజు, కోన చంటమ్మ, కోన ఆనందం, రాణియ్యమ్మ (రాణి)లు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కర్రలు, చెప్పులతో గురజా వెంకట్రావుపై దాడి చేశారు. చేతబడి చేస్తావా అంటూ అతడి దంతాలు, పళ్లను పీకే ప్రయత్నం చేయగా తీవ్ర రక్తస్రావమైంది. చేతబడి అనుమానంతోనే.. రెండు నెలల క్రితం కోన కుసుమ కాకినాడలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరిందని, లో బీపీతో ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. నాటి నుంచి అనుమానంతో ఉన్న వీరందరూ ఆకస్మికంగా ముకుమ్మడిగా దాడికి పాల్పడ్డారన్నారు. తమతోపాటు ప్రసవానికి ఇంటికి వచ్చిన తమ కుమార్తె నిండు గర్భిణి రజనీపైనా వారు దాడి చేశారని వాపోయారు. తీవ్రంగా గాయపడిన తామిద్దరం వైద్యానికి ఆస్పత్రిలో చేరామన్నారు. కేసు నమోదులో తాత్సారం తీవ్ర గాయాలతో ఉన్న తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు బేరసారాలు జరిపేందుకు ఆస్పత్రికి వచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఎవరివల్లనైనా పొరపాటు జరుగుతుందని, కేసు పెట్టకుండా ఉంటే రూ.30 వేల వరకు ఇస్తామన్నా అంగీకరించలేదని, దాడికి పాల్పడిన అందరికీ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 24 గంటలైనా కేసు నమోదు చేయలేదని బాధితురాలు కుమారి తెలిపారు. మరోవైపు బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కె.సుధాకర్ గురువారం సాయంత్రం తెలిపారు. -
మా నాన్న మంచోడు: పృథ్వీరాజ్ తనయుడు
విజయవాడ: తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. తన భార్యకు పృథ్వీరాజ్ నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సాయి శ్రీనివాస్ స్పందించారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని అన్నారు. ‘నన్ను, చెల్లిని మా నాన్న బాగా చూసుకుంటారు. ఆయన గురించి సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. వివాదాన్ని కోర్టులో పరిష్కరించుకుంటామ’ని సాయి శ్రీనివాస్ తెలిపారు. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆయన భార్య శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించడంతో భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. -
విశాఖలో తల్లీ తనయుడి అనుమానాస్పద మృతి
⇒ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో కాలిబూడిదైన వైనం ⇒ కుమారుడు అమెరికాకు బయల్దేరాల్సి ఉండగా దుర్ఘటన డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం): కుటుంబ కలహాలో.. మరే కారణమో తెలియదు గానీ తల్లి, కుమారుడు మంటల్లో కాలి బూడిద య్యారు. కుమారుడు మరో గంటలో అమెరి కాకు పయనమవ్వాల్సిన ఉండగా ఈ దుర్ఘటన జరగడం అందరినీ నివ్వెరపరి చింది. విశాఖపట్నం డాబాగార్డెన్స్ లలితా కాలనీలోని విష్ణుకిరీటి అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో న్యాయవాది కంచుబోయన భాగ్యలక్ష్మి(67) నివసిస్తున్నారు. భర్త డాక్టర్ రామారావుతో విభేదాల కారణంగా ఆమె 20 ఏళ్లనుంచి విడిగా ఉంటున్నారు. రామారావు తగరపువలసలో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఫణిమహేష్(40) తన భార్యతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం వీరికి పాప పుట్టింది. ఎనిమిది రోజుల కిందట ఫణిమహేష్ విశాఖపట్నం వచ్చాడు. శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యాడు. లగేజీ సిద్ధం చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఆటో కూడా పిలిచారు. ఇంతలో తల్లీకొడుకుల మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇంటిలో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో అపార్ట్మెంట్ వాచ్‌మన్ అప్రమత్తమయ్యాడు. తలుపుకు తాళం వేసి ఉండడంతో మిగిలిన అపార్టుమెంట్‌వాసులకు సమాచారమిచ్చాడు. వారంతా వచ్చి తాళం విరగ్గొట్టి చూసే సరికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద భాగ్యలక్ష్మి మృతదేహం కాలి బూడిదై కనిపించింది. లోపల దేవుడి గదిలో ఫణిమహేష్ కూడా కాలి బూడిదై కనిపించాడు. అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భాగ్యలక్ష్మి, ఫణిమహేష్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం కింగ్‌జార్జి హాస్పిటల్(కేజీహెచ్)కు తరలించారు. కుటుంబంలో కలహాలు ఉన్నాయని, తాను ఒంటరినయ్యానన్న మానసిక వేదనతో భాగ్యలక్ష్మి ఆత్మాహుతి చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. తల్లిని రక్షించే యత్నంలో ఫణిమహేష్ కూడా కాలిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వాచ్‌మన్‌తో భాగ్యలక్ష్మి కిరోసిన్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. తన భార్య, కుమారుడు చనిపోయారన్న సమాచారం అందుకున్న భాగ్యలక్ష్మి భర్తకు డాక్టర్ రామారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.