
మా నాన్న మంచోడు: పృథ్వీరాజ్ తనయుడు
తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ తెలిపారు.
విజయవాడ: తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. తన భార్యకు పృథ్వీరాజ్ నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సాయి శ్రీనివాస్ స్పందించారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని అన్నారు.
‘నన్ను, చెల్లిని మా నాన్న బాగా చూసుకుంటారు. ఆయన గురించి సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. వివాదాన్ని కోర్టులో పరిష్కరించుకుంటామ’ని సాయి శ్రీనివాస్ తెలిపారు. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆయన భార్య శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించడంతో భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.