family governance
-
Sri Lanka: అప్పుల కుప్ప శ్రీలంక.. అంతా రాజపక్సల మాయ!
శ్రీలంకలో సంక్షోభం మొదలై నెల దాటుతోంది. ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోందే తప్ప చల్లారడం లేదు. రాజపక్స కుటుంబమంతా రాజీనామా చేయాలని నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఒక్క డిమాండ్‌తోనే నిరసనకారులు రోజుల తరబడి అధ్యక్ష భవనం ఎదుట బైఠాయిస్తున్నారు. అరెస్టులకు, లాఠీ దెబ్బలకు వెరవకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా రాజపక్స వంశాన్ని ఆరాధించిన జనం ఇప్పడు ఆ పేరు చెబితేనే ఎందుకు మండిపడుతున్నారు? అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని దశాబ్దాల కిందట మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలు ఇప్పటికీ అక్షర సత్యమని శ్రీలంక రాజకీయాలు నిరూపిస్తున్నాయి. రాజపక్స కుటుంబీకుల బంధుప్రీతి, అవినీతి దేశాన్ని ఆర్థికంగా దిగజార్చడమే గాక ప్రజల్లో ఆ కుటుంబంపై ఏహ్యభావం ఏర్పడింది. రాజపక్సలు దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారాన్ని గుప్పిట పట్టి ఉంటూ చక్రం తిప్పుతున్నారు. వారి పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) 1948 ఫిబ్రవరిలో శ్రీలంకకు స్వాతంత్య్రం రావడానికి ముందే పుట్టింది. దాని వ్యవస్థాపకుడు డాన్ అల్విన్ రాజపక్స పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి రాజకీయాల్లో ఆ కుటుంబ ప్రస్థానం మొదలైంది. అల్విన్ కుమారులైన ప్రధాని మహింద, అధ్యక్షుడు గొటబయ, చమిల్, బాసిల్ సోదరులు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. శ్రీలంక ప్రస్తుత దుస్థితికి ఈ నలుగురు అన్నదమ్ములే కారణమన్న విమర్శలున్నాయి. భావి తరం నేతలుగా చక్రం తిప్పడానికి వారి కుమారులు నమల్, యోషిత, శశీంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. మహింద రెండోసారి అధ్యక్షుడిగా చేసిన 2010–15 మధ్య ఆ కుటుంబం నుంచి ఏకంగా 40 మందికి పైగా ప్రభుత్వ పదవుల్లో కొనసాగారు! వారిలో అత్యధికులు ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశ అప్పుల్లో 78% రాజపక్సల హయాంలో చేసినవే! బాసిల్ రాజపక్స (70) మాజీ ఆర్థిక మంత్రి అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఆర్థికమంత్రిగా అవకతవక నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారు. కాంట్రాక్ట్ ఏదైనా 10 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. అందుకే బాసిల్‌ను మిస్టర్ 10% అని పిలుస్తారు. మహింద రాజపక్స (76) ప్రధాని అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. 2005 నుంచి పదేళ్లు దేశాధ్యక్షుడు. ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. దశాబ్దాల తరబడి సాగిన అంతర్యుద్ధాన్ని మే 2009లో మిలటరీ ఆపరేషన్‌తో నామరూపాల్లేకుండా చేసి సింహళ–బుద్ధిస్టులకు ఆరాధ్యునిగా మారారు. మహింద హయాంలోనే శ్రీలంక చైనాకు దగ్గరైంది. మౌలిక సదుపాయాల కల్పనకంటూ 700 కోట్ల డాలర్లు అప్పుగా తెచ్చారు. ఆ ప్రాజెక్టుల్లో భారీ అవినీతితో ఆ రుణ భారం కొండంతైంది. ఆయన ఏకంగా 1,900 కోట్ల డాలర్లు పోగేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గొటబయ రాజపక్స (72) అధ్యక్షుడు అన్న మహిందకు కుడిభుజం. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్నారు. 2005లో రక్షణ శాఖకు శాశ్వత కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతర్యుద్ధ సమయంలో తమిళ రెబెల్స్‌పై మూకుమ్మడి అత్యాచారాలు, హింస, హత్యల వెనుక గొటబయ హస్తముందంటారు. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న ఈయనను కుటుంబీకులే టెర్మినేటర్ అని పిలుస్తూంటారు. 2019లో అధ్యక్షుడయ్యాక రక్షణ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. 2020 అక్టోబర్‌లో అధ్యక్షుడికి అపరిమిత కార్యనిర్వాహక అధికారాలు కల్పించుకోవడం వివాదాస్పదమైంది. చమల్ రాజపక్స (79) నీటిపారుదల మంత్రి మహింద అధ్యక్షుడిగా ఉండగా స్పీకర్‌గా చేశారు. ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకేకు వ్యక్తిగత అంగరక్షకుడిగా చేయడంతో బాడీగార్డ్ అనే పేరు స్థిరపడిపోయింది. ప్రస్తుతం నీటిపారుదల మంత్రి. అన్నదమ్ముల్లో అంతగా వివాదాలు లేనిది ఈయనొక్కడే. నమల్ రాజపక్స (35) క్రీడలు, యువజన మంత్రి మహింద కుమారుడు. 2010లో 24 ఏళ్ల వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎప్పటికైనా అధ్యక్షుడు కావాలని కలలు గంటున్నారు. మహింద అధ్యక్షుడిగా ఉండగా ఏ పదవీ లేకుండానే చక్రం తిప్పడంతో పాటు ఈయనపై మరెన్నో అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాష్ట్రంలో కుటుంబ పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎస్ఎస్ తాడ్వాయి: ‘ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది.. రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ మాటలతో గారడీ చేస్తున్నాడని, ప్రజలు బతుకు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు ఏసీలో కూర్చున్న కేసీఆర్‌కు ఏం తెలుస్తాయని ధ్వజమెత్తారు. ఈ పాదయాత్ర ద్వారా కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని అన్నారు. కాగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. -
కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్
డాక్టర్ చెరుకు సుధాకర్ నల్లగొండ రూరల్ : అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు పలువురు ప్రాణత్యాగం చేయగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబమే తెచ్చినట్లు చరిత్రను మార్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ స్ఫూర్తి యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రు ల్లో అనేక మంది తెలంగాణ ద్రోహులు ఉన్నారని, ఏనాడూ జై తెలంగాణ అనని వారిని సీఎం నెత్తిన పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉద్యమకారులు అనేక ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకు చెం దిన ఓ బాలిక తెలంగాణ చరిత్రను తెలి యజేసిందని రూ.10 లక్షలు అందించారని, రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు జక్కల యాకస్వామి భువనగిరిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను అల్లుడికి, కొ డుకుకు అప్పగించారని,కుమార్తె కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పి నేడు పట్టించుకోలేదన్నారు. అంశాల స్వామి లాంటి ఫ్లోై రెడ్ బాధితులు జిల్లాలో ఎంతో మంది ఉ న్నారని, వీరందరికీ విముక్తి కలగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అమరులని పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. ఎన్నికల ముందు 1200 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పి సహా యం అందించే సమయంలో అందరికీ న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డికి రూ.30 కోట్లు ఇచ్చి పా ర్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. యానాల లింగారెడ్డి, చెరుకు లక్ష్మి, పాల్వాయి రవి, చుక్కా సైదులు పాల్గొన్నారు. -
చిన్న దేశం.. పెద్ద సంక్షోభం
మతోన్మాదం, ప్రజాస్వామ్యం పట్ల బద్ధవైరం కలగలసి ఇప్పుడు మాల్దీవులను కల్లోలానికి గురి చేస్తున్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అరెస్ట్ (ఫిబ్రవరి 22, 2015), 13 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు (మార్చి 13, 2015), వీటిని నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతున్నాయి. మూడు ద శాబ్దాల పాటు నియంతృత్వంతో పాలించిన అబ్దుల్ గయూం మీద పోరాడి, తొలిసారి (2008) ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ నషీద్. మాల్దీవియన్ డెమాక్రటిక్ పార్టీ తరఫున ఆయన ఆ పదవికి ఎంపికయ్యాడు. ఆ క్రమంలో ఆయన ఎన్నోసార్లు అరె స్టయ్యి, జైలు పాలైనాడు. ఆయన మీద నమోదైన అభియోగం- ఉగ్రవాదానికి ప్రోత్సాహం. అందుకే 1990 నాటి ఉగ్రవాద చట్టం ప్రకారమే మల్దీవుల న్యాయస్థానం ఈ మాజీ అధ్యక్షుడిని విచారించింది. 2012లో అబ్దుల్లా మహ్మద్ అనే ఒక న్యాయమూర్తిని నషీద్ అరెస్టు చేయించిన మాట నిజమే. అయితే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను బట్టి నషీద్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దానినే కిడ్నాప్ అభియోగంగా మోపి ఈ శిక్ష విధించారు. ఇతర ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు కూడా న్యాయస్థానం ఆరోపణలు చేసింది. ఇరవై దీవులతో, నాలుగు లక్షలలోపు జనాభాతో పర్యాటకుల స్వర్గధా మంగా వెలుగొందుతున్న మాల్దీవుల అంతరంగ చిత్రం నిజానికి వికృతమైనది. అబ్దుల్ గయూం నియంతృత్వానికి చరమగీతం పాడి, అధికారంలోకి వచ్చిన నషీద్ ఫిబ్రవరి, 2012లో ఆ దేశ టీవీ చానెళ్ల ఎదుట కనిపించి, తాను స్వచ్ఛం దంగా రాజీనామా చేస్తున్నట్టు నాటకీ యంగా ప్రకటించారు. అయితే వెంటనే తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. తరువాత అన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాయి. పోలీసు యంత్రాంగం సాయం తో, సైన్యం నషీద్‌ను పదవీచ్యుతుడిని చేసింది. తరువాత 2013లో జరిగిన ఎన్నికలలో నషీద్ పైచేయి సాధించినట్టు వెల్లడైన ప్రతిసారి ఆ దేశ ఉన్నత న్యాయస్థానం దానిని నిరాకరిస్తూ వచ్చింది. చివరికి స్వల్ప ఆధిక్యంతో గెలిచిన అబ్దుల్ యామీన్ పాలకుడయ్యారు. ఈయన అబ్దుల్ గయూం సన్నిహిత బంధువే. ఆ ఇద్దరి తల్లులు వేరు, తండ్రి ఒక్కరే. ఒక్కొక్క అంశం వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో నషీద్ 2013 ఫిబ్రవరి నుంచి రాజధాని మాలె లోని భారత రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. న్యాయమూ ర్తి కిడ్నాప్ కేసుతోపాటు, ఆయన ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించాడని ప్రభు త్వం ఆరోపించింది. అతడు ఇస్లాంకు వ్యతిరేకి అని, నిజానికి రహస్య క్రైస్త వుడని కూడా ముద్రవేశారు. ప్రస్తుత పరిణామాల మీద భారత్‌తోపాటు, అమె రికా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ నషీద్‌ను సాధారణ నేరగాడిని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లడం ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దీనితో మాల్దీవుల ప్రజానీకమే కాకుండా, చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. మాల్దీవుల విపక్ష శిబిరంలో నషీద్ ఇప్పటికీ ప్రముఖుడు. ఎక్కువ దీవులలో ఆయన పట్లే ఆదరణ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న యామీన్‌ను అభిశంసించే యోచన ఉన్నట్టు తాజాగా వదంతులు గుప్పుమనడంతో ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. ఇదంతా 2018లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో నషీద్‌ను పోటీ లేకుండా చేయడానికేనని ఒక మాట ఉంది. గతంలో నషీద్‌ను బంధించి ఉంచిన ధూనిధూ ద్వీపానికే తీసుకువెళ్లారు. కేసును వాదిస్తుండగానే ఆయన న్యాయవాదిని కూడా బయటకు గెంటేశారు. అయితే ఆయన దేశం నుంచి పారిపోకుండా జాగ్రత్త పడే క్రమంలోనే అరెస్టు చేయడం జరిగిందని దేశాధ్యక్షుడు ప్రకటన ఇవ్వడం విశేషం. నషీద్ పట్ల యామీన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకతను పెంచుకున్నదంటే, ఆయన హయాంలో మాలే విమానాశ్రయానికి సంబంధించి, జీఎంఆర్ సంస్థకు వచ్చిన పనులను మొన్న సెప్టెంబర్‌లో రద్దుచేసింది. ఈ అంశం మీద జీఎంఆర్కూ, యామీన్ ప్రభుత్వానికీ మధ్య సింగపూర్ కోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తున్నది. మాలే విమానాశ్రయం అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను నషీద్ సర్కారు ఇచ్చింది. మాల్దీవులు చిన్న దేశమే కావచ్చు. కానీ అక్కడ జరిగిన పరిణామం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ మద్దతు ఇచ్చే క్రమంలో జరిగింది. అందుకే నషీద్ ఉదంతం ఇంత సంచలనం సృష్టించింది. -
కేసీఆర్ ఓ మాయలోడు
ధారూరు, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ రూ. కోట్లు సంపాదించారని, కుటుంబ పాలన కోసం ఉద్యమాన్ని వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జి. ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ఎబ్బనూర్, అల్లిపూర్, చింతకుంట, హరిదాస్‌పల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్తడా, దోన్నాల్, నాగారం, తరిగోపుల, మోమిన్‌కలాన్, అంతారం, మోమిన్‌ఖుర్దు, జైదుపల్లి, గోదంగుడ తదితర గ్రామాల్లో ప్రసాద్‌కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సంపాదించిన డబ్బును వ్యవసాయం చేసి సంపాదిస్తున్నానని కేసీఆర్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎకరా పొలంలో మిర్చి పండించి రూ. కోటి ఆదాయం వచ్చిందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికలైన మరుక్షణమే అమెరికా వెళ్లిపోతారని, ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలు తెలియవని, తెలుగు భాష సరిగా రాని ఆయనకు ఓట్లు అడగడానికి రాదని అన్నారు. రాజకీయ కుటంబం నుంచి వచ్చిన చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ధారూరు ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్రావు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ అంజయ్య, వికారాబాద్, ధారూరు ఏఎంసీ వైస్ చైర్మన్లు పెంటయ్య, బాలునాయక్, జెడ్పీటీసీ అభ్యర్థి పట్లోళ్ల రాములు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జి. లక్ష్మన్, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, ఎంఐఎం మండల అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి, సర్పంచులు పాండునాయక్, నర్సిరెడ్డి, ప్రమీలమ్మగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు పలికిన ఏసీఆర్ వర్గం ప్రసాద్‌కుమార్‌కు మద్దతుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ వర్గం ప్రచారంలోకి దిగింది. బుధవారం ధారూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రసాద్‌కుమార్‌కు ధారూరు వద్ద ఎస్కె ఆశం తన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ప్రసాద్‌కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ఏసీఆర్ వర్గం నాయకులు చెప్పారు.