కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ | CM KCR perpetrated by the regime of the family | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్

Published Sat, Apr 16 2016 4:41 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

CM KCR perpetrated by the regime of the family

డాక్టర్ చెరుకు సుధాకర్
నల్లగొండ రూరల్ :  అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు పలువురు ప్రాణత్యాగం చేయగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబమే తెచ్చినట్లు చరిత్రను మార్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ స్ఫూర్తి యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రు ల్లో అనేక మంది తెలంగాణ ద్రోహులు ఉన్నారని, ఏనాడూ జై తెలంగాణ అనని వారిని  సీఎం నెత్తిన పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

ఉద్యమకారులు అనేక ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకు చెం దిన ఓ బాలిక తెలంగాణ చరిత్రను తెలి యజేసిందని రూ.10 లక్షలు అందించారని, రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు జక్కల యాకస్వామి భువనగిరిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటే  పట్టించుకోలేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను అల్లుడికి, కొ డుకుకు అప్పగించారని,కుమార్తె కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పి నేడు పట్టించుకోలేదన్నారు. అంశాల స్వామి లాంటి ఫ్లోై రెడ్ బాధితులు జిల్లాలో ఎంతో మంది ఉ న్నారని, వీరందరికీ విముక్తి కలగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అమరులని పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. ఎన్నికల ముందు 1200 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పి సహా యం అందించే సమయంలో అందరికీ న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డికి రూ.30 కోట్లు ఇచ్చి పా ర్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. యానాల లింగారెడ్డి, చెరుకు లక్ష్మి, పాల్వాయి రవి, చుక్కా సైదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement