Family planing operations
-
కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలి
మంచిర్యాలటౌన్: ఈ నెల 27 నుంచి జూలై 10వరకు కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేను పురస్కరించుకు ని కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శా శ్వత పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే, చిన్న కు టుంబం ప్రాధాన్యత, కుటుంబ నియంత్రణ ప్రణాళి క, దంపతులిద్దరి బాధ్యతలు వివరించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డీఎస్వో డాక్టర్ ఫయాజ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఎస్వో వెంకటేశ్వర్లు, డీపీవో రాఘవ, ఆప్తాలమిక్ ఆఫీసర్ శంకర్, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్యసేవలు మంచిర్యాలటౌన్: మహిళల్లోని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకంగా ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, సాయికుంట బస్తీ దవాఖానాల్లో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రతీ మంగళవారం మహిళల కోసమే నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలో 4,016 మందికి పరీక్షలతోపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైష్ణవి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, హెచ్‌ఈవో నాందేవ్ పాల్గొన్నారు. -
భార్యలకేనా..ఆ బాధ్యత భర్తలకు లేదా!
మగ మహా రాజులుగా మీసాలు మెలేస్తారుమగ ధీరులుమంటూ మాటలు కోటలు దాటిస్తారుధైర్యానికి ప్రతీకలుగా కండలు తిప్పుతారువాస్తవానికి ఇవన్నీ మహిళలకే వర్తిస్తాయి... ఓ యువతా... ఇల్లరికం వస్తావా అంటేకొత్తవాళ్ల మధ్య నే మసలలేననే సమాధానం... ఓ మొగుడా గర్భం దాల్చి బిడ్డను కంటావా అంటేఆ భారం మోయలేను..ఆ బాధ భరించలేనంటావ్ పసి బిడ్డను లాలించగలవా అని ప్రశ్నిస్తే...పసికందు ఏడుపును నేనెలా ఆపగలనంటావ్ కనీసం కు.ని. శస్త్ర చికిత్స చేయి ంచుకో అంటేయోజనాల దూరం పరుగులు తీస్తావ్... మాకు తెలుసులే..మీదంతా మేకపోతు గాంభీ ర్యమేమీరంతా మగ మహా భయస్తులనేది నిజంలే... తూర్పుగోదావరి, కొత్తపేట: ఒక బిడ్డ ముద్దు..ఇద్దరు బిడ్డలు హద్దు..మూడో బిడ్డ వద్దు..అన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. ఆ దిశగానే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. చేయించుకున్నవారికీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాదాపు అందరూ ఒకరు, ఇద్దరితోనే సరిపెట్టుకుని స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే సంతానానికి భార్యా, భర్త ఇద్దరూ కారకులైనా..కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు మాత్రం భర్తలు ఆమడ దూరంలో ఉంటున్నారు. పురుషులకే వేసక్టమీ ఆపరేషన్లు చేయాలని లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. ఆ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ల సంఖ్యనే చూపించి లక్ష్యాలు సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారు. వేసక్టమీ ఆపరేషన్ సులువైనా... పురుషులకు కోత, కుట్టు, కట్టు లేని అతి సులువైన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స అందుబాటులో ఉన్నా ముందుకు రావడం లేదు. ఎక్కడో అతి కొద్దిమంది మాత్రమే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అదీ పట్టణ ప్రాంతాల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో మచ్చుకు కూడా ఆ జాడ కనిపించడం లేదు. మహిళలకు చేసే ట్యూబెక్టమీ కంటే పురుషులకు చేసే వేసక్టమీ ఆపరేషన్లకే ప్రభుత్వం ఎక్కువ పారితోషికం చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు రూ. 660 చెల్లిస్తుండగా పురుషులకు రూ.1,100 ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సహజ ప్రసవమయ్యేలా ప్రయత్నిస్తూ... అత్యవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నారు. అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం సహజ ప్రసవంమయ్యే అవకాశం ఉన్నా పెద్ద మొత్తంలో బిల్లులు దండుకునేందుకు సిజేరియన్ చేస్తుండగా, కొందరు నొప్పులు బాధ నుంచి తప్పించుకొనేందుకు స్వచ్ఛందంగా సిజేరియన్ ద్వారా బిడ్డకు కంటున్నారు. అపోహలు కారణం... వేసక్టమీ శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకపోవడానికి పురుషుల్లో పలు అపోహలే కారణం. పురుషులు వేసక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్ధ్యం, బలం, కోరిక తగ్గుతుందని పురుషులు భావించడం ఒక ప్రధాన కారణం. వాస్తవానికి పురుషులకు కత్తిరింపుతో కాకుండా చిన్న రంధ్రం ద్వారా వేసక్టమీ చేస్తాం... కొంత సేపు అనంతరం ఇంటికి వెళ్లిపోవచ్చు. ట్యూబెక్టమీ కన్నా వేసక్టమీ సులువైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ట్యూబెక్టమీతో మహిళ చర్మం 6 పొరలు కోయాలి. 7 నుంచి 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలి. అదే వేసక్టమీ అయితే పురుషులకు చిన్నగాటు పెట్టి కుట్టు కూడా లేకుండా ఆపరేషన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు.– డాక్టర్ ప్రదీప్తి కరుణ, గైనకాలజిస్ట్, కొత్తపేట -
ఆపరేషాన్
కర్నూలు ,నూనెపల్లె : కుటుంబ నియంత్రణకు చేపడుతున్న ఆపరేషన్లకు అన్నీ అడ్డంకులే. శస్త్రచికిత్స చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో రోజుకు ఆరు మాత్రమే చేస్తూ మిగిలినవి వాయిదా వేస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. కావాల్సిన పరికరాల అవసరతను గురించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా స్పందించే నాథుడే లేరని వైద్యులు వాపోతున్నారు. నంద్యాల జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ (పోస్ట్‌పార్ట్) యూనిట్లో కుని (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేస్తారు. ఇందుకోసం నంద్యాలతోపాటు గోస్పాడు, మహానంది, పాణ్యం, బండిఆత్మకూరు, గడివేముల, వెలుగోడు మండలాల పరిధిలోని గర్భిణులు ఇక్కడికి వస్తారు. వైద్యుల కొరత, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అందరికీ ఆపరేషన్లు చేయలేక చాలా మందిని వెనక్కు పంపడం పరిపాటిగా మారింది. సిబ్బంది కొరత పీపీ యూనిట్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. పీపీ యూనిట్‌కు బాలింతలు, గర్భిణులు వస్తారు. ఆపరేషన్లు చేసేందుకు, రోగులను పరీక్షించేందుకు ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండడంతో ఇబ్బందులు ఎదువుతున్నాయి. గర్భిణులను పరీక్షించే సమయంలో ఆపరేషన్లకు వెళ్లాల్సి వస్తుండడంతో సేవలు కొరవడతున్నాయి. దీంతో వారంలో మూడు రోజులు (మంగళ, బుధ, గురు, శనివారాల్లో) బాలింతలకు పరీక్ష, ఇమ్యూనైజేషన్ చేస్తుండడం, మిగిలిన రోజులు (సోమ, మంగళ, శుక్రవారాలు) మాత్రమే ఆరు చొప్పున ఆపరేషన్లు చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అసౌకర్యంగా ఆపరేషన్ థియేటర్ కు.ని ఆపరేషన్లు చేసే ఆపరేషన్ థియేటర్లో అన్నీ సమస్యలే. ఆపరేషన్‌కు ఉపయోగించే ఆర్టర్ ఫోర్సెస్, స్ట్రీట్, నీడిల్ హాల్డర్స్, కరూడ్ ఆర్డరీ వంటి పరికరాలు అందుబాటులు లేకుండా పోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరికరాలు కూడా ఆరు ఆపరేషన్ల వరకే ఉపయోగపడుతాయని మిగిలిన తర్వాత ఆపరేషన్ చేసేందుకు వస్తే స్ట్రెరిలైజ్ కాకపోవడంతో ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ థియేటర్లో వర్షం కురిస్తే చెమ్మ దిగి నీటి మడుగులా మారుతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. నివేదికలు పంపినా ప్రయోజనం లేదు ఆసుపత్రిలోని వసతులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. ఇప్పటిదాకా ఎలాంటివి రాలేదు. ప్రతిపాదనలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. మెరుగైన వసతులు కల్పించి మరో వైద్యుడిని నియమిస్తే సకాలంలో ఆపరేషన్లు చేస్తాం. – డాక్టర్ డి.ఎన్.మూర్తి, పీపీ యూనిట్ పరీక్షలు చేయించి మళ్లీ రమ్మన్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చా. పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆపరేషన్‌కు తేదీ ఇస్తామని, ఆ ప్రకారం రావాలని చెప్పారు. ఆపరేషన్ లేదని చెప్పడంతో ఇంటికి వెళుతున్నాం. – లావణ్య, తమడపల్లె విద్యుత్ వసతి లేదు ఆపరేషన్ థియేటర్లోకి వెళితే చీకటిగా ఉంటుంది. చీక ట్లో ఎక్కడికి వెళుతున్నామో తెలియడం లేదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా సక్రమంగా లేదు. చీకటిగా ఉంటే ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. – భారతి, వీసీ కాలనీ ఉక్కపోతకు అల్లాడాల్సిందే థియేటర్లో ఏసీ లేకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బ ంది పడ్డాం. ఆపరేషన్‌కు తీసుకెళ్లినప్పుడు గాలి ఆడకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. థి యేటర్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. – మహాలక్ష్మి, నంద్యాల -
రాజధాని గ్రామాల్లో రోగుల పాట్లు
* ఆస్పత్రి వరండాలోనే చికిత్స * మూణ్ణాళ్ల ముచ్చటగా సీఆర్డీఏ మెగా వైద్య శిబిరాలు * మాటలకే పరిమితమైన మంత్రి హామీలు * అంబులెన్స్ సౌకర్యం లేక ప్రజల ఇక్కట్లు తుళ్లూరు రూరల్: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్లూరు మండల పరిధిలో డెంగీ, విషజ్వరాలు, అంటువ్యాధులతో జనం అల్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ అధికారులు, పాలకులు సమీక్షలు, సమావేశాలు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బురదమయమైంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం నుంచి బాలింతలకు కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేసి వరండాలోనే వైద్యం అందిస్తున్నారు. వరండాలో ఉండటంతో రోగులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన వైద్య సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. ఆపరేషన్ చేసిన గంటల వ్యవధిలోనే వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. గతంలో వైద్యశాఖకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అధికారులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి పునర్నిర్మించాలని నివేదికలు ఇచ్చారు. ఇదే భవనంలో ఎక్కువlకాలం విధులు నిర్వహించటం మంచిది కాదని కూడా తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. గ్రామాల్లో వైద్య శిబిరాలేవీ? భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో సైతం ఉచిత వైద్యం అందిస్తామని పాలకులు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయి. గతంలో వ్యాధులు ప్రబలిన సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలతో అవసరం తీరిపోవటంతో నేడు గ్రామాల్లో వైద్యశిబిరాలు కరువయ్యాయి. అమరావతి రాజధాని అయిన ప్రాంతంలో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పేద, బడుగు వర్గాల వారికి అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు అతి కష్టం మీద పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లు? తుళ్లూరు మండల ప్రజలకు వైద్యం అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని తేటతెల్లమవుతోంది. గతంలో మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రాథమిక వైద్యశాలను పరిశీలించినప్పుడు వెనువెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పిలిపించి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో మంత్రి రూ.4.30 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2016 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేశారు. ఏడాదిలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆరునెలలు గడచినా టెండర్లే పూర్తి కాలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని, రాజధాని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. కు.ని. కష్టాలు.. పాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కుటుంబ నియంత్రణ చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఏఎన్ఎంలకు కేటాయించిన గదుల్లో కు.ని. శస్త్రచికిత్సలు నిర్వహించడంతో బాలింతలు అవస్థలకు గురవుతున్నారు. చిన్న గదుల్లో ఇటువంటి శస్త్రచికిత్సలు చేస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.