
పోస్టర్లు విడుదల చేస్తున్న జిల్లా వైద్యాధికారి సుబ్బరాయుడు, అధికారులు
మంచిర్యాలటౌన్: ఈ నెల 27 నుంచి జూలై 10వరకు కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేను పురస్కరించుకు ని కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శా శ్వత పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే, చిన్న కు టుంబం ప్రాధాన్యత, కుటుంబ నియంత్రణ ప్రణాళి క, దంపతులిద్దరి బాధ్యతలు వివరించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో డాక్టర్ ఫయాజ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఎస్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో రాఘవ, ఆప్తాలమిక్ ఆఫీసర్ శంకర్, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్యసేవలు
మంచిర్యాలటౌన్: మహిళల్లోని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకంగా ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, సాయికుంట బస్తీ దవాఖానాల్లో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రతీ మంగళవారం మహిళల కోసమే నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలో 4,016 మందికి పరీక్షలతోపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైష్ణవి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, హెచ్‌ఈవో నాందేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment