Faulkner
-
విలియం ఫాక్నర్
గ్రేట్ రైటర్ పిల్లాడిగా కథలు వింటూ పెరిగాడు విలియం ఫాక్నర్ (1897–1962). అమెరికా పౌరుడిగా, అందునా దక్షిణాది రాష్ట్రమైన మిసిసిపి వాడిగా అక్కడి ఉత్తరాది రాష్ట్రాలకూ దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య జరిగిన సివిల్ వార్ గాథలూ, నల్లవాళ్లు–తెల్లవాళ్ల బానిసత్వపు కథలూ, శ్వేతాధిపత్యాన్ని ప్రవచించిన ‘కు క్లక్స్ క్లాన్’ కథలూ, ఫాక్నర్ వంశీయుల కథలూ... వాటన్నింటి ప్రభావం వల్ల పదిహేడేళ్ల నాటికే రాయడం ప్రారంభించాడు. కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సినిమాలకు స్క్రీన్‌ప్లేలు రాశాడు. ‘ఎ రోజ్ ఫర్ ఎమిలీ’ ఒక అమెరికన్ రాసిన అత్యంత ప్రసిద్ధ కథగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ’ ఇంగ్లిష్‌లో వెలువడిన వంద గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచింది. ‘యాజ్ ఐ లే డైయింగ్’, ‘లైట్ ఇన్ ఆగస్ట్’, ‘ద రీయవర్స్’, ‘ద ఫేబుల్’, ‘అబ్సలోమ్, అబ్సలోమ్!’ ఆయన ఇతర రచనలు. 1949లో ఫాక్నర్ను నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఒక మంచి కళాకారుడు తనకు సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఎవరూ ఉండరని నమ్ముతాడు, అన్నారు ఫాక్నర్. తప్పులు చేస్తూనే నేర్చుకోవాలనీ, రచన అనేది యాంత్రికంగా ఏదో టెక్నిక్‌ను పాటించడం కాదనీ అనేవారు. -
ఫాల్క్‌నర్‌కు చోటు
మెల్బోర్న్: వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. పేస్ ద్వయం జేమ్స్ ఫాల్క్‌నర్, నాథన్ కౌల్టర్ నైల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరో పేసర్ మిషెల్ స్టార్క్ గాయం కారణంగా దూరమయ్యాడు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు జట్లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఇండోర్, కోల్‌కతాలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక హైదరాబాద్, రాంచీ, గువాహటిలో మూడు టి20లు నిర్వహిస్తారు. -
ఫాల్కనర్, షాన్ మార్ష్‌లకు నో ప్లేస్!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ తో పాటు వెటరన్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌కు చోటు దక్కలేదు. 2017-18 సంవత్సరానికిగాను ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. 2013 నుంచి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న ఫాల్కనర్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకర పరిణామం. మరొకవైపు ఇటీవల భారత పర్యటనలో విశేషంగా రాణించి 19 వికెట్లు తీసిన స్టీవ్ ఓకీఫ్ కు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కుతుందని తొలుత భావించినా చివరకు అతనికి కూడా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కొత్త ముఖం కార్ట్ రైట్ తో పాటు ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయని ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్ లేక్‌లకు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కడం ఇక్కడ విశేషం. రాబోవు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే 20 మందికి కాంట్రాక్ట్ జాబితాలో చోటు కల్పించినట్లు సీఏ సెలక్షన్ చైర్మన్ ట్రావెర్ హాన్స్ తెలిపారు. -
చివరి బంతికి సెంచరీ కొట్టి...
-
చివరి బంతికి సెంచరీ కొట్టి...
బ్రిస్ బేన్: పాకిస్థాన్‌తో జరుగతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మథ్యూ వాడే రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి బంతి సహాయంతో కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. 7(ఫోర్లు), 2(సిక్సర్లు)తో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు మహ్మద్ అమీర్ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (7), కెప్టెన్ స్టీవ్ స్మీత్ వికెట్లను (0) వెనువెంటనే కోల్పోయింది. ఒక దశలో 78 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు మథ్యూ వాడే ఆపద్బాంధవుడులా నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలో ఆచితూచి ఆడుతూ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్‌తో కలిసి 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వైపు మ్యాక్స్ వెల్ వికెట్ల మధ్య చురుకుగా కదులుతూ అద్భుతమైన రివర్స్ స్వీప్స్, చూడచక్కని షాట్లతో 56 బంతుల్లో 60 (7ఫోర్లు) పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ వేసిన 31వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించబోయి మహ్మద్ హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సొంత గ్రౌండ్ గబ్బాలో తొలి వన్డే ఆడుతున్న క్రిష్ లిన్ 16 (12) అమీర్ వేసిన ఓవర్లో ఏకంగా 97 మీటర్ల భారీ సిక్సర్ ను కొట్టిన అనంతరం హసన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ స్వ్కేర్, కవర్ డ్రైవ్స్ తో బంతిని పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో 39 పరుగులు అనంతరం స్పిన్నర్ ఇమాద్ వసీంకు దొరికి పోయాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మథ్యూ సెంచరీ చేసి ఆసిస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు కృషి చేశాడు. టేలెండర్స్తో కలిసి మాథ్యూ చేసిన ఒంటరి పోరాటం ఫలితంగా ఆస్ట్రేలియా 268 పరుగులు చేయగలిగింది. పాక్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ తన తల్లికి సీరియస్ గా ఉండటంతో స్వదేశానికి వెళ్లగా.. అతని స్థానంలో జట్లులోకి వచ్చిన రిజ్వాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ లో తొమ్మిది ఓవర్లు వేసిన హాసన్ 65 పరుగులిచ్చి, మూడు వికెట్లు తీశాడు. బ్యాట్స్మెన్ల పేలవ ప్రదర్శనతో పాక్ 176 పరుగులకే ఆలౌటైంది. ఫాల్క్‌నర్ 4, కమ్మిన్స్ 3 వికెట్లు తీసి పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో 92 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. పాక్‌లో బాబర్ అజమ్ 33 పరుగులతో పాక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
లంకను ఆదుకున్న 2 'సెంచరీ' భాగస్వామ్యాలు
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక 48.5ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడొందల పరుగులు అలవోకగా చేసేలా కనిపించిన లంక, ఆసీస్ పేసర్లు చెలరేగడంతో తన చివరి 5 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఆరంభంలో కాస్త తడబడిన లంక కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు), చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్ కు సెంచరీ(125 పరుగుల) భాగస్వామ్యంతో కోలుకుంది. వీరిద్దరిని ఆసీస్ బౌలర్ జంపా స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ఫలితంగా 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంకకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అయితే ఆరో వికెట్ కు కుశాల్ పెరీరా(53 బంతుల్లో 54 పరుగులు: 5 ఫోర్లు, 1 సిక్స్), లంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్(60 బంతుల్లో 57 పరుగులు: 1 ఫోర్, 1 సిక్స్) రాణించి సెంచరీ భాగస్వామ్యాన్ని (103పరుగులు) జతచేశారు. చివర్లో ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో 300 స్కోరు దాటేలా కనిపించిన లంక 288 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా, ఫాల్కనర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ ఒక్క వికెట్ తీశాడు. -
నిద్రపోతున్నావా..!
ఫాల్క్‌నర్‌కు కోహ్లి చురక కాన్బెర్రా: ఆస్ట్రేలియా జట్టుపై తన ప్రత్యేక ‘అభిమానాన్ని’ విరాట్ కోహ్లి ఎక్కడా దాచుకోవడం లేదు. ఒక వైపు భారీ స్కోర్లు చేస్తూ ...మరో వైపు మాటలతోనూ ఢీకొట్టే శైలిని ఏడాది కాలంగా అనుసరిస్తున్నాడు. ముఖ్యంగా జేమ్స్ ఫాల్క్‌నర్‌ను అతను ఆటాడుకుంటున్నాడు. మెల్బోర్న్లో ‘నా కెరీర్లో సరిపడినంత ఇప్పటికే నీ బౌలింగ్‌లో బాదాను. వెళ్లి పని చూసుకో’ అని ఫాల్క్‌నర్‌కు జవాబిచ్చిన కోహ్లి నాలుగో వన్డేలో మరింత ఉడికించాడు. ఇన్నింగ్స్ 22వ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నించిన కోహ్లిని రనౌట్ చేసే అవకాశం వచ్చింది. మిడాన్‌లో ఉన్న ఫాల్క్‌నర్ తగిన విధంగా స్పందించలేకపోయాడు. దాంతో ఫీల్డర్‌ను ఉద్దేశించి ‘గాఢ నిద్రలో ఉన్నట్లున్నావు’ అని కోహ్లి నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న కోహ్లి... 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు చేశాడు. అయితే కొన్ని ఆస్ట్రేలియా పత్రికలు మాత్రం ఈ ఘటనలో కోహ్లిని దోషిగా చిత్రీకరించాయి. -
పాపం బెంగళూరు!
రాజస్థాన్ సూపర్ ఛేజింగ్ 5 వికెట్లతో ఆర్సీబీ చిత్తు యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా రాయల్స్‌ను గెలిపించిన స్మిత్, ఫాల్క్‌నర్ మ్యాచుకో కోటి రూపాయల భారాన్ని మోస్తూ వచ్చిన యువరాజ్ సింగ్ ఎట్టకేలకు తన విలువను ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. భీకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లోనూ రాణించినా బెంగళూరు ఓటమి పాలైంది.భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువీ బౌలింగ్ ధాటికి చివరి 39 బంతుల్లో 85 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ నిలిచింది. అయితే ఇదే మైదానంలో ఆసీస్ తరఫున ఆడి రికార్డు సెంచరీ సాధించిన ఫాల్క్‌నర్ ఈసారీ చిన్నస్వామి స్టేడియాన్ని సొంతం చేసుకున్నాడు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి భారీ షాట్లతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్‌కు అద్భుత విజయం దక్కగా...రాయల్ చాలెంజర్స్‌కు నిరాశే మిగిలింది. బెంగళూరు: యువరాజ్ చాన్నాళ్ల తరువాత అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా...అది బెంగళూరు విజయానికి సరిపోలేదు. భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రాజస్థాన్ ప్రత్యర్థికి నిరాశను మిగిల్చింది. భారీస్కోరును సాధించినా దాన్ని కాపాడుకోవడంలో చాలెంజర్స్ విఫలమైంది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ తొలుత బ్యాట్‌తో (38 బంతుల్లో 83; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఆపై బంతితో (4/35) చెలరేగి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. డివిలియర్స్ (32 బంతుల్లో 58; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం రాజస్థాన్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కరుణ్ నాయర్ (39 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... చివర్లో స్టీవెన్ స్మిత్ (21 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (17 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో చెలరేగి కోహ్లి సేనను చిత్తు చేశారు. వీరిద్దరు చివరి 17 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. యువీ వీరంగం... బెంగళూరు ఇన్నింగ్స్ నిరాశాజనక రీతిలో ఆరంభమైంది. పార్థివ్‌ను కాదని గేల్‌తో కలిసి స్వయంగా ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లి (4) పేలవఫామ్‌ను కొనసాగిస్తూ మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. ఈ క్రమంలో గేల్ మూడు, విజయ్ జోల్ రెండు చొప్పున ఫోర్లు కొట్టినా.. పవర్ ప్లే ముగిసేటప్పటికి బెంగళూరుకు వికెట్ నష్టానికి 31 పరుగులు మాత్రమే లభించాయి. అయితే డివిలియర్స్‌కు జత కలిసిన యువరాజ్ చాన్నాళ్ల తరువాత తన విశ్వరూపం ప్రదర్శించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. తెవాటియా బౌలింగ్‌లో ఫోర్‌తో మొదలైన యువీ విజృంభణ.. ఆపై తీవ్రరూపం దాల్చి పరుగుల సునామీని సృష్టించింది. రజత్ భాటియా వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌తోపాటు మొత్తం 14 పరుగులు రాబట్టాడు. ఆపై తాంబే, రిచర్డ్సన్ల ఓవర్లలో మరో రెండు సిక్స్‌లతో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ కూడా చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లతో అర్ధసెంచరీ మైలురాయిని దాటాడు. యువీ, డివిలియర్స్‌ల విజృంభణతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు నమోదయ్యాయి. చివర్లో మెరుపులు... లక్ష్యఛేదనను రాజస్థాన్ దూకుడుగా ఆరంభించింది. రహానే, కరుణ్ నాయర్లు ప్రతి ఓవర్లోనూ కనీసం ఓ ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు నమోదయ్యాయి. అయితే రహానే (24)ను చహల్ ఔట్ చేశాక యువీ మాయ ప్రారంభమైంది. తన రెండో ఓవర్లో వాట్సన్ (1), బిన్నీ (1)లను, తరువాతి ఓవర్లో శామ్సన్ (13)ను వెనక్కి పంపాడు. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఇక్కట్లలో పడినా.. మరోవైపు కరుణ్ నాయర్ దూకుడు మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్‌నూ యువరాజే ఔట్ చేశాడు. విజయానికి 36 బంతుల్లో 83 పరుగులు చేయాల్సివుండడంతో బెంగళూరు విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ, అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌లు బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి దొరికిన బంతినల్లా బౌండరీ లైన్ దాటించారు. పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారు. స్టార్క్ వేసిన 17వ ఓవర్లో 21 పరుగులు, దిండా వేసిన 18వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. దీంతో చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశకు మ్యాచ్ చేరింది. అయితే ఫాల్క్‌నర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) భాటియా (బి) రిచర్డ్సన్ 4, గేల్ (సి) శామ్సన్ (బి) తాంబే 19, జోల్ (సి) వాట్సన్ (బి) తెవాటియా 16, డివిలియర్స్ (సి) రహానే (బి) ఫాల్క్‌నర్ 58, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) రిచర్డ్సన్ 83, ఆల్బీ మోర్కెల్ (నాటౌట్) 1, పార్థివ్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1-6, 2-38, 3-40, 4-172, 5-186. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-43-2, వాట్సన్ 4-0-35-0, ఫాల్క్‌నర్ 4-0-42-1, తాంబే 4-0-38-1, తెవాటియా 3-0-17-1, భాటియా 1-0-13-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పార్థివ్ (బి) చహల్ 24, కరుణ్ (బి) యువరాజ్ 56, వాట్సన్ (బి) యువరాజ్ 1, బిన్నీ (సి) సబ్-రోసో (బి) యువరాజ్ 1, శామ్సన్ (సి అండ్ బి) యువరాజ్ 13, స్మిత్ (నాటౌట్) 48, ఫాల్క్‌నర్ (నాటౌట్) 41, ఎక్స్‌ట్రాలు, 7, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1-54, 2-61, 3-63, 4-82, 5-106. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-20-0, స్టార్క్ 3-0-33-0, దిండా 3-0-37-0, ఆరోన్ 2.5-0-41-0, యువరాజ్ 4-0-35-4, చహల్ 4-0-24-1.