నిద్రపోతున్నావా..! | Why are you fast asleep?, Kohli asked Faulkner in Canberra | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్నావా..!

Published Fri, Jan 22 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

నిద్రపోతున్నావా..!

నిద్రపోతున్నావా..!

ఫాల్క్‌నర్‌కు కోహ్లి చురక
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా జట్టుపై తన ప్రత్యేక ‘అభిమానాన్ని’ విరాట్ కోహ్లి ఎక్కడా దాచుకోవడం లేదు. ఒక వైపు భారీ స్కోర్లు చేస్తూ ...మరో వైపు మాటలతోనూ ఢీకొట్టే శైలిని ఏడాది కాలంగా అనుసరిస్తున్నాడు. ముఖ్యంగా జేమ్స్ ఫాల్క్‌నర్‌ను అతను ఆటాడుకుంటున్నాడు. మెల్‌బోర్న్‌లో ‘నా కెరీర్‌లో సరిపడినంత ఇప్పటికే నీ బౌలింగ్‌లో బాదాను. వెళ్లి పని చూసుకో’ అని ఫాల్క్‌నర్‌కు జవాబిచ్చిన కోహ్లి నాలుగో వన్డేలో మరింత ఉడికించాడు.

ఇన్నింగ్స్ 22వ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నించిన కోహ్లిని రనౌట్ చేసే అవకాశం వచ్చింది. మిడాన్‌లో ఉన్న ఫాల్క్‌నర్ తగిన విధంగా స్పందించలేకపోయాడు. దాంతో ఫీల్డర్‌ను ఉద్దేశించి ‘గాఢ నిద్రలో ఉన్నట్లున్నావు’ అని కోహ్లి నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న కోహ్లి... 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు చేశాడు. అయితే కొన్ని ఆస్ట్రేలియా పత్రికలు మాత్రం ఈ ఘటనలో కోహ్లిని దోషిగా చిత్రీకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement