మైనారిటీ యువతులకు ఫాక్స్ కాంలో ఉద్యోగ అవకాశాలు
కర్నూలు (రాజ్‌విహార్): నిరుద్యోగ యువతులకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న ఫాక్స్ కాంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధుల్లోని 18 సంవత్సరాల నుంచి 35ఏళ్ల వయస్సులోపు ఉన్న మహిళలు అర్హులని పేర్కొన్నారు. నెలకు రూ.8వేలు, 750 బోనస్ (26 పనిదినాలు పూర్తి చేసినవారికి) షిఫ్ట్ అలవెన్స్ కల్పిస్తారని, 150 కిలో మీటర్లు దూరం ఉన్న వారికి ఉచిత వసతి, 40శాతం సబ్సిడీపై నెలకు రూ.800కి భోజనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తారని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత అని, ఆసక్తి ఉన్న యువతులు www.apsmfc.com లో వివరాలను నమోదు చేసుకోవాలని, లేదా ఫోన్ 08518 277153, 91601 05162 నంబర్లకు సంప్రదించాలని కోరారు.