హోదాతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి l
ప్రకటించాలని డిమాండ్ ∙
విద్యార్థి, యువజన బ్యాలెట్ ప్రారంభోత్సవం
తరలివచ్చిన కళాశాల విద్యార్థులు
రాజమహేంద్రవరం సిటీ :
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ ఎ¯ŒS.రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లుమాని ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అమలు, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన 600 హామీలను నేరవేర్చిందా? లేదా అనే అంశాలపై కాంగ్రెస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు బోడా వెంకట్ అధ్యక్షతన మంగళవారం రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యార్థి, యువజన బ్యాలెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 13 జిల్లాల్లో జరిగే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మిగిలిన నాయకులతో కలిసి రఘువీరా విద్యార్థుల వద్దకు వెళ్లి బాక్సుల్లో బ్యాలెట్ వేయించారు.ఈ సందర్భంగా ఆయన వినూత్న ప్రయోగం చేశారు. ప్రసంగం మాని ప్రత్యేకహోదా, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ప్రశ్నలను విద్యార్థులకు సంధించి సమాధానాలు రాబట్టారు.ఇంటర్ విద్యార్థులకు బస్‌పాస్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తానన్న చంద్రబాబు రెండున్నరేళ్లలో ఇచ్చారా.?లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు మీఇంటి చుట్టుపక్కల వారికి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా.? ఉద్యోగం ఇవ్వని నిరుద్యోగులకు రూ. రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా? ఇస్తే ఇప్పటికి రూ.60 వేలు వచ్చి ఉండాలి? వచ్చిందా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లోని రూ. 80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేసి సామాన్యుడిని ఇబ్బందులకు గురిచేశారని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చింది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే నన్నారు. 2019లో రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలి ప్రత్యేక హోదాపైనేనన్నారు. కోటి బ్యాలెట్లు సేకరించాలని కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాలను ఆదేశించారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ టీడీపీ, బీజేపీ హామీఇచ్చి ఇప్పుడు మాటతప్పి హోదా వల్ల వరిగేదేమీ లేదంటూ మోసం చేస్తున్నారన్నారు.డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువత చేతిలో భారతదేశ భవిష్యత్ ఉందనే విషయం గుర్తించిన రాజీవ్‌గాంధీ 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించారన్నారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు తనదైన శైలిలో విద్యార్థులు భగవత్ స్వరూపులంటూ చలోక్తులు విసిరి ఆకట్టుకున్నారు.అనంతరం 10 బ్యాలెట్ బాక్సులతో నాయకులు విద్యార్థుల వద్దకు వెల్లి బ్యాలెట్లను సేకరించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఏఐసీసీ ఎస్సీసెల్ నాయకుడు డాక్టర్ ప్రసాద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పంతం నానాజీ, గిడుగురుద్రరాజు, కామన ప్రభాకరరావు, ఎస్ఎ¯ŒS రాజా, రామినీడి మురళి, మార్టి¯ŒS లూథర్, రాజీవ్ రతన్, అంకం గోపి తదితరులు పాల్గొన్నారు.