fhm magazine
-
'ప్రపంచ శృంగార దేవత' దీపికా పదుకోనె!
జగదేక సొగసరి ముంబై: బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే ప్రపంచ శృంగార వనితగా ఎన్నికైంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మాస పత్రిక ఎఫ్.హెచ్.ఎం.(ఫర్ హిమ్ మేగజైన్) ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోల్‌లో పదుకొనే శృంగార వనితగా ప్రథమ స్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలతో ఎఫ్.హెచ్.ఎం. వెలువరించిన తాజా సంచికను దీపిక బుధవారం ఇక్కడ ఆవిష్కరించింది. ఈ ఎన్నికలో ప్రపంచ వ్యాప్తంగా దీపిక సహా శృంగార వనితలుగా తొలి 100 స్థానాలను దక్కించుకున్న వారి కథనాలను తాజా సంచికలో ప్రచురించారు. పత్రిక ఆవిష్కరణ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. తన బాహ్య సౌందర్యం కారణంగా ఈ స్థానం దక్కిందని తాను భావించడం లేదని చెప్పింది. ఎంచుకున్న రంగంలో చేస్తున్న కృషి వల్లే ఈ గుర్తింపు లభించినట్టుగా భావిస్తున్నట్టు పేర్కొంది. ‘నా ఆలోచన ప్రకారం నిజంగా ఈ ఫలితం నా కృషికి దక్కిందనే అనుకుంటున్నా. భౌతిక సౌందర్యంతో ఏదైనా సాధించొచ్చని నేను భావించడం లేదు’ అని పేర్కొంది. అదృష్టవశాత్తు గత రెండు మూడేళ్లలో తాను నటించిన చిత్రాల్లో తనకు మంచి పాత్రలు లభించాయని, అదేవిధంగా వైవిధ్యమున్న పాత్రలు చేసే అవకాశం వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైండింగ్ ఫన్నీ’ చిత్రంలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియాలతో కలిసి నటిస్తోంది. -
ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్
లాస్ ఎంజెల్స్: పురుషులకు చెందిన ఎఫ్హెచ్ఎం పత్రిక ఈ ఏడాది సెక్సీయెస్ట్ మహిళగా ఆస్కార్ అవార్డు గెలిచిన నటి జెన్నిఫర్ లారెన్స్‌ను ఎంపిక చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆ పత్రిక 2014 టాప్ 100 హాటెస్ట్ గర్ల్స్ జాబితాను విడుదల చేయగా.. అందులో ప్రథమ స్థానాన్ని ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ నటి జెన్నిఫర్ దక్కించుకుంది. తనకు ఈ కిరీటం దక్కడంపై జెన్నిఫర్ ఆనందం వ్యక్తం చేసింది. సెక్సీ అంటే భారీ మేకప్, కచ్చితమైన శరీరాకృతి, జుట్టు కాదని, అది ఆత్మవిశ్వాసమని చెప్పింది. నీకులా నువ్వు సౌకర్యంగా ఉండడం, ఎల్లప్పుడూ దరహాసం, సంతోషమే సెక్సీ అని తెలిపింది. కాగా, రెండో స్థానాన్ని ఇంగ్లిష్ నటి మిషెల్లీ కీగన్ దక్కించుకున్నారు.