దీనికి సంబంధించిన వివరాలతో ఎఫ్.హెచ్.ఎం. వెలువరించిన తాజా సంచికను దీపిక బుధవారం ఇక్కడ ఆవిష్కరించింది. ఈ ఎన్నికలో ప్రపంచ వ్యాప్తంగా దీపిక సహా శృంగార వనితలుగా తొలి 100 స్థానాలను దక్కించుకున్న వారి కథనాలను తాజా సంచికలో ప్రచురించారు.
పత్రిక ఆవిష్కరణ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. తన బాహ్య సౌందర్యం కారణంగా ఈ స్థానం దక్కిందని తాను భావించడం లేదని చెప్పింది. ఎంచుకున్న రంగంలో చేస్తున్న కృషి వల్లే ఈ గుర్తింపు లభించినట్టుగా భావిస్తున్నట్టు పేర్కొంది. ‘నా ఆలోచన ప్రకారం నిజంగా ఈ ఫలితం నా కృషికి దక్కిందనే అనుకుంటున్నా. భౌతిక సౌందర్యంతో ఏదైనా సాధించొచ్చని నేను భావించడం లేదు’ అని పేర్కొంది.
అదృష్టవశాత్తు గత రెండు మూడేళ్లలో తాను నటించిన చిత్రాల్లో తనకు మంచి పాత్రలు లభించాయని, అదేవిధంగా వైవిధ్యమున్న పాత్రలు చేసే అవకాశం వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైండింగ్ ఫన్నీ’ చిత్రంలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియాలతో కలిసి నటిస్తోంది.