Fiber optic cable
-
ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే భగీరథ పైప్లైన్లు
- 3,500 కిలోమీటర్ల మేర పైప్లైన్లను పూర్తిచేసిన ఆర్‌డబ్ల్యుఎస్ - ఆలస్యంగా మేల్కొన్న ఐటీశాఖ - సమన్వయ లేమిపై కేటీఆర్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు పైప్‌లైన్‌తో పాటే ఇంటర్నెట్కు అవసరమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ పట్టాలెక్కలేదు. భగీరథ ప్రాజెక్టు బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్), ఫైబర్‌గ్రిడ్ బాధ్యతలను చేపట్టిన ఐటీ శాఖల మధ్య సమన్వయం కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి మంచి నీటిని అందించే 9 నియోజకవర్గాల్లో సుమారు 3,500 కిలోమీటర్ల మేర ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు భగీరథ పైప్లైన్లు పూర్తిచేశారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తవ్వకాల నిమిత్తం దాదాపు రూ.140 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ప్రభుత్వం తమకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు తాము పైప్లైన్లు వేసుకుంటూ పోయామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు అంటుండగా, నిధుల కొరత కారణంగా ఫైబర్ గ్రిడ్ పనులను సకాలంలో చేపట్టలేకపోయామని ఐటీశాఖ చెబుతోంది. ఫైబర్ గ్రిడ్‌పై సోమవారం సమీక్షించిన ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు రెండు విభాగాల మధ్య సమన్వయ లేమిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే భగీరథ పైప్లైన్లు వేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన ఐటీశాఖ అధికారులను ఆదేశించారు. పైప్లైన్లు పూర్తయిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం ఏరియల్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని ఐటీశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్‌కు భారత్‌నెట్ ద్వారా కేంద్రం నిధుల కోసం మంగళవారం ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ప్రభుత్వం ఢిల్లీకి పంపుతున్నట్లు తెలిసింది. -
మీడియాను కంట్రోల్లో పెట్టుకునేందుకే...
హైదరాబాద్ : టీవీ చానళ్లను నియంత్రించేందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను తెరమీదకు తెచ్చారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫైబర్ గ్రిడ్, ఈ-ప్రగతిపై శనివారం సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదైనా చూపిస్తే ఆ చానళ్లను కట్ చేసేందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అని అన్నారు. బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కాంట్రాక్ట్ ఎలా అప్పగించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వందల కోట్ల స్కామ్ జరిగిందని, టెరా సాఫ్ట్వేర్ సంస్థను గతేడాది బ్లాక్ లిస్టులో పెట్టారని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. అదే సంస్థకు మరలా ఫైబర్ గ్రిడ్ పనులు ఎలా అప్పగిస్తారని వైఎస్ జగన్ సూటిగా అడిగారు. హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఈ సంస్థను నడిపిస్తున్నారని, ఆయన గతంలో ముంబయిలో ఈవీఎం మిషన్లు దొంగతనం చేస్తు దొరికిపోయారని తెలిపారు. హరికృష్ణ ప్రసాద్ పై కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు. ఫైబర్ గ్రిడ్ ఉన్నతస్థాయి కమిటీలో హరికృష్ణ ప్రసాద్‌ను సభ్యుడిగా నియమించారని, అలాగే టెరా సాఫ్ట్వేర్ సంస్థ కూడా ఆయనదే అన్నారు. ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులు ఇప్పించారన్నారు. ఇంతకంటే దారుణం ఏదీ ఉండదని వైఎస్ జగన్ అన్నారు. కోర్ డాష్ బోర్డు గతంలోనే ఉందని, ఆ బోర్డును చంద్రబాబే తయారు చేసినట్లు చెప్పుకొస్తున్నారని, మొబైల్ లో యాప్‌లు ఎలా వాడాలో కూడా చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పేరుతో అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని, వైఎస్ జగన్పఐ వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను ఎల్లుండికి వాయిదా వేశారు. -
ఆ కంటికి చిక్కకూడదంటే..!
వాయనం ఆమధ్య ఢిల్లీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కారణం... ఆమె ఓ షాపింగ్ మాల్లో దుస్తులు మార్చుకుంటుండగా తీసిన ఓ వీడియో, ఎమ్మెమ్మెస్ రూపంలో దర్శనమివ్వడం! తర్వాత కొన్ని రోజులకే.. తన భర్తతో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇంటర్నెట్లో చూసి షాకయిన ఓ ఇల్లాలు విషం తాగింది. చాలాసార్లు మనం మాత్రమే ఉన్నామనుకుంటాం. కానీ ఓ రాక్షసకన్ను మనల్ని గమనిస్తూ ఉంటుంది. అదెక్కడో దాగివుంటుంది. మనకు తెలియకుండానే మన పరువుని, అభిమానాన్ని బజార్లో పెట్టేస్తుంది. ఆ కన్ను... సీక్రెట్ కెమెరాది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆఫీసుల్లోని బాత్రూముల్లో.. ఎక్కడైనా ఉండొచ్చు ఇవి. వాటికి చిక్కకుండా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మహిళలంతా తెలుసుకుని తీరాలి. * ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్, హోటల్ గదుల్లోకి వెళ్లిన వెంటనే... ఫ్లవర్ వాజులు, ఫొటో ఫ్రేములు, అద్దాలు, టేబుల్ ల్యాంప్స్... ఏవి ఉన్నా వాటిని పరీక్షించండి. ఎక్కు వగా వీటిల్లోనే కెమెరాలను పెడతారు. * హోటల్ గదుల్లోని సోఫా కుషన్లు, దిండ్లను అటూ ఇటూ తిప్పి చూడండి. ప్రతి అల్మరానీ తెరిచి చూడండి. టేబుల్, టీపాయ్‌ల అడుగున పరిశీలించండి. ఈ ప్రదేశాలు మీనియేచర్ కెమెరాను అమర్చడానికి అనువైనవి. * వైర్లు కనిపిస్తే... అవి దేనికి సంబంధించినవో పరిశీలించండి. * గదిలో లైటు తీసేసి చుట్టూ పరిశీలించండి. పచ్చ లేక ఎర్రటి ఎల్ఈడీ లైట్‌లాంటిది కనిపిస్తే కెమెరా ఉన్నట్టు. * సెల్ఫోన్లో ఏదైనా నంబర్ డయల్ చేయండి. సిగ్నల్ ఉన్నా కాల్ వెళ్లకపోతే కెమెరా ఉన్నట్టే. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉన్నచోట కాల్స్ వెళ్లవు. * ఈమధ్య అద్దాల వెనుక కెమెరాలు పెట్టడం ఎక్కువయ్యింది. కాబట్టి అద్దం దగ్గరకు వెళ్లి, చూపుడు వేలును అద్దం మీద అదిమి పెట్టండి. మీ వేలికి, అద్దానికి మధ్య గ్యాప్ కనిపిస్తే అది మంచి అద్దమే. అలా కాకుండా మీ వేలిని ప్రతిబింబం తాకుతుంటే మాత్రం అది టూవే మిర్రర్ అన్నమాట. మామూలు అద్దానికున్నట్టు వీటి వెనుక సిల్వర్ కోటింగ్ ఉండదు. కాబట్టి ఆ అద్దంగుండా మిమ్మల్ని అవతలివాళ్లు చూడగలరు. కానీ, అవతలున్నవాళ్లు మాత్రం మీకు కనిపించరు. వీటిని గుర్తించడానికి మరో మార్గం... లైటు తీసేసి, అద్దంలోకి సెల్‌ఫోన్ ద్వారా గానీ, టార్చ్ ద్వారా గానీ లైటు వేయండి. వెనుక కెమెరా ఉంటే కనిపిస్తుంది. * పిన్‌హోల్ కెమెరాలని ఉంటాయి. వీటిని సాధారణంగా గోడల్లో అమరుస్తారు. వీటిని కనిపెట్టడానికి ఓ చిన్న గొట్టం (టిష్యూ రోల్స్ ఉంటాయి కదా. దాని మధ్య ఉండే గొట్టం చాలు), ఓ టార్చ్ కావాలి. లైటు తీసేసి, గొట్టాన్ని ఓ కంటి దగ్గర పెట్టుకుని, రెండో కన్నుమూసి, గదంతా టార్చ్‌లైట్ వేసి చూడండి. ఎక్కడైనా కెమెరా ఉంటే, రిఫ్లెక్షన్ వస్తుంది.