ఆ కంటికి చిక్కకూడదంటే..! | teenaged problems and students | Sakshi
Sakshi News home page

ఆ కంటికి చిక్కకూడదంటే..!

Published Sun, Nov 23 2014 1:15 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

ఆ కంటికి చిక్కకూడదంటే..! - Sakshi

ఆ కంటికి చిక్కకూడదంటే..!

వాయనం
ఆమధ్య ఢిల్లీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కారణం... ఆమె ఓ షాపింగ్ మాల్‌లో దుస్తులు మార్చుకుంటుండగా తీసిన ఓ వీడియో, ఎమ్మెమ్మెస్ రూపంలో దర్శనమివ్వడం! తర్వాత కొన్ని రోజులకే.. తన భర్తతో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇంటర్నెట్లో చూసి షాకయిన ఓ ఇల్లాలు విషం తాగింది. చాలాసార్లు మనం మాత్రమే ఉన్నామనుకుంటాం. కానీ ఓ రాక్షసకన్ను  మనల్ని గమనిస్తూ ఉంటుంది. అదెక్కడో దాగివుంటుంది. మనకు తెలియకుండానే మన పరువుని, అభిమానాన్ని బజార్లో పెట్టేస్తుంది. ఆ కన్ను... సీక్రెట్ కెమెరాది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆఫీసుల్లోని బాత్రూముల్లో.. ఎక్కడైనా ఉండొచ్చు ఇవి. వాటికి చిక్కకుండా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మహిళలంతా తెలుసుకుని తీరాలి.

* ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్, హోటల్ గదుల్లోకి వెళ్లిన వెంటనే... ఫ్లవర్ వాజులు, ఫొటో ఫ్రేములు, అద్దాలు, టేబుల్ ల్యాంప్స్... ఏవి ఉన్నా వాటిని పరీక్షించండి. ఎక్కు వగా వీటిల్లోనే కెమెరాలను పెడతారు.
* హోటల్ గదుల్లోని సోఫా కుషన్లు, దిండ్లను అటూ ఇటూ తిప్పి చూడండి. ప్రతి అల్మరానీ తెరిచి చూడండి. టేబుల్, టీపాయ్‌ల అడుగున పరిశీలించండి. ఈ ప్రదేశాలు మీనియేచర్ కెమెరాను అమర్చడానికి అనువైనవి.
* వైర్లు కనిపిస్తే... అవి దేనికి సంబంధించినవో పరిశీలించండి.
* గదిలో లైటు తీసేసి చుట్టూ పరిశీలించండి. పచ్చ లేక ఎర్రటి ఎల్‌ఈడీ లైట్‌లాంటిది కనిపిస్తే కెమెరా ఉన్నట్టు.
* సెల్‌ఫోన్‌లో ఏదైనా నంబర్ డయల్ చేయండి. సిగ్నల్ ఉన్నా కాల్ వెళ్లకపోతే కెమెరా ఉన్నట్టే. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉన్నచోట కాల్స్ వెళ్లవు.
* ఈమధ్య అద్దాల వెనుక కెమెరాలు పెట్టడం ఎక్కువయ్యింది. కాబట్టి అద్దం దగ్గరకు వెళ్లి, చూపుడు వేలును అద్దం మీద అదిమి పెట్టండి. మీ వేలికి, అద్దానికి మధ్య గ్యాప్ కనిపిస్తే అది మంచి అద్దమే. అలా కాకుండా మీ వేలిని ప్రతిబింబం తాకుతుంటే మాత్రం అది టూవే మిర్రర్ అన్నమాట. మామూలు అద్దానికున్నట్టు వీటి వెనుక సిల్వర్ కోటింగ్ ఉండదు. కాబట్టి ఆ అద్దంగుండా మిమ్మల్ని అవతలివాళ్లు చూడగలరు. కానీ, అవతలున్నవాళ్లు మాత్రం మీకు కనిపించరు. వీటిని గుర్తించడానికి మరో మార్గం... లైటు తీసేసి, అద్దంలోకి సెల్‌ఫోన్ ద్వారా గానీ, టార్చ్ ద్వారా గానీ లైటు వేయండి. వెనుక కెమెరా ఉంటే కనిపిస్తుంది.
* పిన్‌హోల్ కెమెరాలని ఉంటాయి. వీటిని సాధారణంగా గోడల్లో అమరుస్తారు. వీటిని కనిపెట్టడానికి ఓ చిన్న గొట్టం (టిష్యూ రోల్స్ ఉంటాయి కదా. దాని మధ్య ఉండే గొట్టం చాలు), ఓ టార్చ్ కావాలి. లైటు తీసేసి, గొట్టాన్ని ఓ కంటి దగ్గర పెట్టుకుని, రెండో కన్నుమూసి, గదంతా టార్చ్‌లైట్ వేసి చూడండి. ఎక్కడైనా కెమెరా ఉంటే, రిఫ్లెక్షన్ వస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement