మీడియాను కంట్రోల్లో పెట్టుకునేందుకే... | ys jagan mohan reddy slams chandrababu naidu government over fiber optic cable | Sakshi
Sakshi News home page

మీడియాను కంట్రోల్లో పెట్టుకునేందుకే...

Published Sat, Mar 26 2016 3:05 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

మీడియాను కంట్రోల్లో పెట్టుకునేందుకే... - Sakshi

మీడియాను కంట్రోల్లో పెట్టుకునేందుకే...

హైదరాబాద్ : టీవీ చానళ్లను నియంత్రించేందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను తెరమీదకు తెచ్చారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫైబర్ గ్రిడ్, ఈ-ప్రగతిపై శనివారం సభలో వాడీవేడిగా  చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదైనా చూపిస్తే ఆ చానళ్లను కట్ చేసేందుకే  ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అని అన్నారు.

బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కాంట్రాక్ట్ ఎలా అప్పగించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వందల కోట్ల స్కామ్ జరిగిందని, టెరా సాఫ్ట్వేర్ సంస్థను గతేడాది బ్లాక్ లిస్టులో పెట్టారని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. అదే సంస్థకు మరలా ఫైబర్ గ్రిడ్ పనులు ఎలా అప్పగిస్తారని వైఎస్ జగన్ సూటిగా అడిగారు.

హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఈ సంస్థను నడిపిస్తున్నారని, ఆయన గతంలో ముంబయిలో ఈవీఎం మిషన్లు దొంగతనం చేస్తు దొరికిపోయారని తెలిపారు. హరికృష్ణ ప్రసాద్ పై కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు. ఫైబర్ గ్రిడ్ ఉన్నతస్థాయి కమిటీలో హరికృష్ణ ప్రసాద్ను సభ్యుడిగా నియమించారని, అలాగే టెరా సాఫ్ట్వేర్ సంస్థ కూడా ఆయనదే అన్నారు. ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులు ఇప్పించారన్నారు. ఇంతకంటే దారుణం ఏదీ ఉండదని వైఎస్ జగన్ అన్నారు.

కోర్ డాష్ బోర్డు గతంలోనే ఉందని, ఆ బోర్డును చంద్రబాబే తయారు చేసినట్లు చెప్పుకొస్తున్నారని, మొబైల్ లో యాప్లు ఎలా వాడాలో కూడా చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పేరుతో అక్రమాలు జరిగాయన్నారు.

దీనిపై చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని, వైఎస్ జగన్పఐ వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను ఎల్లుండికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement