Fibroids problem
-
ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?
నా వయస్సిప్పుడు 28 సంవత్సరాలు. రొటీన్ స్కాన్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు తేలింది. 1–2 సెం.మీ సైజ్ అన్నారు. ఇప్పటికైతే నాకే ఇబ్బందీ లేదు. అయితే కొందరికి దీని వల్ల హిస్టరెక్టమీ అయిందని విన్నాను. అలా అవుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. శుభదా, చంద్రపూర్ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో ఉండే మజిల్ ఓవర్గ్రోత్తో ఏర్పడే గడ్డలు. ఇవి కొంతమందికి చిన్న వయస్సులోనే అంటే 20–30 ఏళ్ల మధ్య హార్మోన్స్ ప్రాబ్లమ్‌తో ఏర్పడవచ్చు. 5 సెం.మీ లోపు ఉండే ఫైబ్రాయిడ్స్ చాలావరకు ఇబ్బంది పెట్టవు. స్కాన్‌లో మాత్రమే తెలుస్తాయి. వాటికి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కానీ కొన్ని పరిమాణంలో చిన్నవే అయినా ప్రాబ్లమ్‌ను క్రియేట్ చేస్తాయి. అలాంటి ఫైబ్రాయిడ్స్ గనుక గర్భసంచి లోపలి పొరల్లో గనుక ఫామ్ అయి ఉంటే పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం అయ్యే చాన్సెస్ను కూడా పెంచుతాయి. సింప్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు 3డీ అల్ట్రాసౌండ్ చేసి ఫైబ్రాయిడ్ సైజ్, లొకేషన్, నంబర్, మీ వయసు, ప్రెగ్నెన్సీ చాన్సెస్ మొదలైనవాటిపై డిస్కస్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ వల్ల అధిక రక్తస్రావం, రక్తహీనత, మూత్రం రావడం, మలబద్ధకం, ప్రెజర్ ఫీలింగ్ లాంటివి ఉండొచ్చు. భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ పైనే డిస్కషన్స్ ఆధారపడి ఉంటాయి. 3 సెం.మీ లోపు ఉంటే చాలామందికి ఏ ఇంటర్వెన్షన్ చెప్పరు. సంవత్సరం తర్వాత మళ్లీ స్కాన్ చేసి సైజ్ చెక్ చేస్తారు. మీరు డాక్టర్ని కలసినప్పుడు మీ స్కానింగ్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్, మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి డిటేయిల్డ్‌గా డిస్కస్ చేయండి. ఫాలో అప్ స్కాన్స్‌లో ఏమైనా సడెన్ గ్రోత్ ఉంటే ఫైబ్రాయిడ్స్‌కి మెడికల్, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అని సజెస్ట్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ సైజ్, లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అధిక రక్తస్రావాన్ని నియంత్రించడానికి పిల్స్, ప్యాచెస్, ఇంప్లాంట్స్, మిరేనా కాయిల్ లాంటివి ఉన్నాయి. ఇవి ప్రెగ్నెన్సీని కూడా నిరోధిస్తాయి. అంటే కాంట్రాసెప్టివ్‌గా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్‌తో గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవం జరగొచ్చు. అలాంటివారిలో మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ని లాపరోస్కోíపీ ద్వారా తీస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది ఉండదు. యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరం మీద ఏ కోత లేకుండా బీడ్స్ ద్వారా ఫైబ్రాయిడ్స్‌కి రక్తప్రసరణను అందించే రక్తనాళాలను బ్లాక్ చేస్తారు. ఇది ఇక పిల్లలు వద్దు అనుకునే వాళ్లకు ఉపయుక్తమైనది. కొంతమందికి యూటరస్ లైనింగ్‌ని పూర్తిగా తగ్గించే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ సమస్యను ట్రీట్ చేస్తారు. హిస్టరెక్టమీ అనేది చివరి ఆప్షన్. మీకు ఏ చికిత్స మంచిది అనేది మీ పర్సనల్ హిస్టరీ తీసుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే మీరు డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదిస్తే అసలు మీకు ట్రీట్మెంట్ అవసరమా? ఎలాంటి ఫాలో అప్ కావాలి? వంటి విషయాలు నిర్ధారణవుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..) -
ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?
నా వయసు 40 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమనీ, అయితే భవిష్యత్తులో తిరగబెట్టవచ్చని అంటున్నారు. మళ్లీ రాకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – శ్రీదుర్గ, విజయవాడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తుల్లా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. -డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 40 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమనీ, అయితే భవిష్యత్తులో తిరగబెట్టవచ్చని అంటున్నారు. మళ్లీ రాకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – శ్రీదుర్గ, విజయవాడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తుల్లా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా? నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – రమేష్‌బాబు, కందుకూరు పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ∙సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ సమస్య... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్సతో వాటిని తొలగించాలని, అయితే భవిష్యత్తులో మళ్లీ రావచ్చని అంటున్నారు. దాంతో ఆందోళనగా ఉంది. హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – మాధవి, చిత్తూరు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. కారణాలు: ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం.. లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఆస్తమా... నయమవుతుందా? మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం, పిల్లికూతలతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వర్షాకాలం. ఎప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు చికిత్స ఉందా? - శ్రీప్రసాద్, ఖమ్మం ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది ఊపిరిని అడ్డుకుంటుంది. దాంతో వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి. వ్యాధి నిర్ధారణ: ఎల్ఎఫ్టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, రక్తపరీక్షలు. చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. తగిన మందులు వాడితే హోమియో ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్... ఎందుకిలా? నా వయసు 35 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. ఈ సమస్య తరచూ వస్తోంది. డాక్టర్‌ను కలవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? - సోదరి, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. కారణాలు : సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై అనే బ్యాక్టీరియా తరచూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మరో కారణం. అవి మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందడానికి దోహదపడి ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లోనూ ఇది సాధారణం. లక్షణాలు : మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్