'సంక్రాంతికి వస్తున్నాం' 50 రోజుల రికార్డ్.. ఎన్ని కేంద్రాలో తెలుసా..?
ఇటీవలి కాలంలో విడుదలవుతున్న సినిమాలు కనీసం 10 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద కొనసాగడం కష్టంగా మారింది. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 50 రోజుల పాటు రికార్డ్ స్థాయిలో విజయవంతంగా పలు థియేటర్స్‌లలో పూర్తి చేసుకుని ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒక రీజనల్ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.పొంగల్ రేసులో జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైంది. ఇప్పటికే రూ. 300 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను కూడా ఈ మూవీ చేరుకుంది. అయితే, ఈ చిత్రం తాజాగా 92 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేసినప్పటికీ వీకెండ్లో థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. కలెక్షన్లతో పాటు విజయవంతంగా లాంగ్ రన్లో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో అభిమానులు నెట్టింట పలు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేవర సినిమా 52 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే, పుష్ప12 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300కు థియేటర్స్ పైగానే 50రోజుల పాటు విజయవంతంగా రన్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా.. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు.A heartfelt thank you to all the audiences for showering immense love on #SankranthikiVasthunam and making it a BLOCKBUSTER PONGALUU for everyone! 🙏✨50 Days in 92 Centres -This milestone wouldn’t have been possible without the unwavering dedication of our exhibitors and… pic.twitter.com/OuoJB7aJ4T— Anil Ravipudi (@AnilRavipudi) March 4, 2025