fill up
-
గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్
బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బ్యాక్లాగ్ పోస్ట్‌లు భర్తీ చేయండి!
సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ ఆదేశం ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో ఉన్న పరిపాలనపరమైన పదవులు, పాలక మండలి సభ్యుల సంఖ్య, ఉద్యోగుల పదోన్నతుల అంశాలు, వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే అంశాలను వర్సిటీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 నుంచి సర్వీస్ రిజిస్టర్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఎందుకు ఆడిట్ చేయించలేదని ప్రశ్నించారు. చాలా కాలంగా వర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయటం లేదని, వాటి భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం, సమన్వయానికి వారం రోజుల్లో లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, పలువురు పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేల ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌లాగ్ పోస్టులను ఆయా శాఖలో భర్తీ చేశారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజి తెలిపారు. యూనివర్సిటీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం మరో విడత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్షతను రూపుమాపాలని, అసమానతలకు తావివ్వకూడదని పేర్కొన్నారు. వర్సిటీల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. -
కొమురవెల్లి మల్లన్నకు కమిటీ
ధర్మకర్తల మండలిలో సభ్యత్వానికి కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 6తో ముగియనున్న గడువు సాక్షి ప్రతినిధి, వరంగల్ : నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా దేవాలయాల కమిటీల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. తొలి దశలో రాష్ట్ర స్థాయి ఆలయాలకు ధర్మకర్తల కమిటీలను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ప్రముఖ ఆలయాల ధర్మకర్తల కమిటీల నియామకం కోసం ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి, మేడారం సమ్మక్క–సారలమ్మ, కురవి వీరభద్రస్వామి ఆలయాలకు కమిటీలను నియమించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. దీంతో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయింది. అయితే ప్రఖ్యాత కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ నియామకం కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడింది. కమిటీలో సభ్యులుగా నియమితులు కావాలనుకునేవారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు దేవాదాయ శాఖ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం సెప్టెంబరు 6 నాటికి దరఖాస్తుల గడువు ముగియనుంది. అనంతరం దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దరఖాస్తుదారుల వివరాలతో కమిషనర్ కార్యాలయానికి ప్రత్యేక నివేదిక పంపిస్తారు. దీని ఆధారంగా కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. దేవాలయాల ధర్మకర్తల మండళ్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులు చేసింది. గతంలో రెండేళ్లు ఉన్న పదవీకాలాన్ని ఏడాదికి కుదించారు. అన్ని కేటగిరి ఆలయాల ధర్మకర్తల కమిటీల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు. వార్షిక ఆదాయంప్రామాణికంగాదేవాలయాలను నాలుగు కేటగిరీలుగా పరిగణించాలని నిర్ణయించారు. రూ.2 లక్షలలోపు ఆదాయం, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఆదాయం, రూ.25 లక్షల నుంచి రూ.కోటిలోపు ఆదాయం, రూ.కోటికిపైగా ఆదాయం పొందే ఆలయాలను వేర్వేరు కేటగిరీలుగా గుర్తించారు. సభ్యుల సంఖ్యలో పెంపు.. రూ.కోటి కంటే అధిక వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ధర్మకర్తల మండలిని నియమిస్తుంది. వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు. ప్రభుత్వం ఈ సంఖ్యను 14కు పెంచింది. రూ.కోటి కంటే అధిక వార్షిక ఆదాయం కలిగిన ఆలయాల కేటగిరీలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కురవిలోని వీరభద్రస్వామి, వరంగల్‌లోని భద్రకాళి, పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి, వర్ధన్నపేట మండలం ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నాయి. రూ.25 లక్షల నుంచి రూ.కోటి దాకా ఆదాయం ఉన్న ఆలయాలకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ధర్మకర్తలను నియమిస్తుంది. వీటిలో సభ్యుల సంఖ్యను ఐదు నుంచి ఏడుకు పెంచారు. ఆదాయం రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఉన్న ఆలయాలకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ధర్మకర్తలను నియమిస్తుంది. వీటి మండలి సభ్యుల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచారు. -
8086 పోస్టులను భర్తీ చేస్తాం..