68 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు
హైదరాబాద్: చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 43 అంశాలపై చర్చించారు. చీప్ లిక్కర్ విషయంలో సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నందున పాతవిధానాన్ని కొనసాగించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. కేబినెట్ సమావేశ నిర్ణయాలను కేసీఆర్ వెల్లడించారు. ఏం చెప్పారంటే..
ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
3900 కోట్ల రూపాయలతో 60 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం
పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 5.30 లక్షలు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాక కార్యదర్శి నుంచి నివేదిక రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు
జీహెచ్ఎంసీలో ఆర్టీసీ విలీనం.. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఈ నిర్ణయం
హైదరాబాద్లో 3800 బస్సులు తిరుగుతున్నాయి
నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు
కరీంనగర్ జిల్లా జిమ్మికుంటలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు
త్వరలో తెలంగాణ జలవిధానం ప్రకటిస్తాం
రాబోయే మూడేళ్లలో ప్రతిఏటా సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు
ప్రాజెక్టుల రీడిజైన్పై ప్రతిపక్షాలది అవగాహనరాహిత్యం
ఈ ఏడాదికి చీప్ లిక్కర్ ప్రతిపాదన ఉపసంహరణ