
కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త మద్యం విధానంపై కేబినెట్లో చర్చించారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
- ఏపీ ఎక్సైజ్ యాక్ట్ను తెలంగాణ వర్తింపు
- వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం
- కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, కార్పొరేట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ వ్యాట్ చట్టంలో మార్పులకు ఆమోదం
- ఏపీ ప్రొఫెషనల్ ట్యాక్స్ యాక్ట్ తెలంగాణకూ వర్తింపు
- తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
- తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం
- తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనువుగా ఏపీ డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ అన్వయించుకునేందుకు ఆమోదం