Film and Television Institute of India
-
ఎఫ్టీఐఐ ప్రెసిడెంట్‌గా శేఖర్ కపూర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌కి కొత్త బాధ్యత లభించింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)కు ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులయ్యారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఇదో సరికొత్త బాధ్యత. అందరి సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాను’’ అన్నారు శేఖర్ కపూర్. మార్చి 2023 వరకూ ఆయన పదవీకాలం కొసాగుతుంది. -
ఆ నిరసనలతో ఆడియెన్స్ పెరిగారు!
న్యూఢిల్లీ: టీవీ నటుడు గజేంద్రసింగ్ చౌహాన్ గుర్తుఉన్నారు కదా! పుణెలోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయనను ప్రకటించింది మొదలు నిరసనలు, ధర్నాలు హోరెత్తాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరగతులు బహిష్కరించి.. ధర్నాలు చేశారు. ఆయన నియామకంపై దేశవ్యాప్తంగా టీవీల్లో చర్చలు కూడా జరిగాయి. ఈ వివాదం ఆయనను బాగానే వెలుగులోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. ఢిల్లీలో ఆయన శివుడి పాత్ర వేస్తున్న నాటకానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. దసరా సందర్భంగా ఎర్రకోట సమీపంలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో గజేంద్రసింగ్ చౌహాన్ శివుడుగా నటిస్తున్నారు. ఆయన పార్వతీదేవికి రాముడి ఇతివృత్తాన్ని వివరిస్తారు. ఈ నాటకంలో ఆయన పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. "35 ఏండ్ల కెరీర్లో చాలా డైలాగులను నేను గుర్తుంచుకున్నాను. కానీ తొలిసారి రంగస్థలం మీద నటిస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా నటించడం మినహా ఎలాంటి రీటేక్ లకు అవకాశం ఉండదు' అని గజేంద్ర చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన "మహాభారత్' సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు. -
పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల అరెస్ట్
పుణె : పుణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎఫ్టీఐఐ కి చెందిన ఐదుగురు విద్యార్థులను బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ పత్రాబే వారిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.17 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశామని, ఇందులో ఇద్దరు విద్యార్థినుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. విద్యార్థినులను మాత్రం అరెస్టు చేయలేదని చెప్పారు. 25-30 మంది విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు, అందులో కొందరి పేర్లు తప్పుగా ఉన్నాయని సమాచారం. 'మేం దీన్ని అంగీకరించం. విద్యార్థుల బాధ్యత మాపై ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఒక్కరు కూడా అరెస్టు సమయంలో అక్కడ లేరని తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఇది పూర్తిగా అన్యాయం' అని ప్రస్తుతం ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు తాత్కాలిక డీన్ గా వ్యవహరిస్తున్న సందీప్ చటర్జీ అన్నారు. ఓ ప్రజా ప్రతినిధి విధులను అడ్డుకోవడంతో పాటు గొడవకు దిగి ఆస్తి నష్టం కలిగించారన్న ఆరోపణలతో విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులను ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డైరెక్టర్‌ను ఆయన చాంబర్లో సుమారు ఏడు గంటల పాటు బయటకు వదలకుండా చేసినందుకు ఆ రోజు రాత్రి పోలీసులను పిలిపించాడు. అక్కడికి వచ్చిన పోలీసులు విద్యార్థులపై చేయి చేసుకున్నారని, వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. 2008 బ్యాచ్ విద్యార్థులకు ప్రాజెక్టు చివరి రిపోర్టు విషయంలో మేనేజ్ మెంట్ తీరు వారికి నచ్చలేదని తెలుస్తోంది. కొందరు మాత్రమే తమ అసైన్ మెంట్లను సబ్మిట్ చేయగా, మరికొందరు విద్యార్థులు ధర్నాకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టుకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
నేను రాజీనామా చేశా...
పుణె: ప్రముఖ టీవీ నటి, జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు విజేత పల్లవీ జోషి భారత ఫిలిం అండ్ టెలివిజన్ సంస్థ (ఎఫ్టీఐఐ)కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రసార మంత్రిత్వశాఖకు తన రాజీనామా పత్రాన్ని నాలుగు రోజులు క్రితం పంపించాననీ, సంస్థ నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. దీంతో గజేంద్ర చౌహాన్ నియామకానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి నైతిక మద్దతు లభించినట్టయింది. సాధారణంగా విద్యార్థుల ఆందోళనను సమర్ధించనంటూనే వారికి వేరే ఆప్షన్ లేకుండా పోయిందని పల్లవి పేర్కొన్నారు. చాలా మర్యాదపూర్వకంగా, శాంతియుతంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మరోవైపు చౌహాన్ నియమాకంపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. రాజ్ కుమార్ హిరానీ, బాలీవుడ్ నటి విద్యాబాలన్, సినిమాటోగ్రాఫర్ శైలేష్ గుప్తా తదితర సినీ దిగ్గజాలు సభ్యులుగా పనిచేసిన ఎఫ్టీఐఐలో పల్లవీ సభ్యురాలిగా ఉన్నారు. కాగా భారత ఫిలిం, టీవీ సంస్థ (ఎఫ్టీఐఐ) చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాల్సిందేనని, అప్పటిదాకా తమ ఆందోళన ఆగదని ఆ సంస్థ విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులతో విద్యార్థుల ప్రతినిధి బృందంతో శుక్రవారం జరిపిన చర్చలు జరిపారు. ఈ చర్చల్లో విషయం ఎటూ తేలకపోవడంతో అనంతరం వారు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. అయితే గజేంద్రను తొలగించే ప్రసక్తే లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎఫ్టీఐఐ విద్యార్థుల సంఘం (ఎఫ్ఎస్ఏ) నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఎంతోమంది దిగ్గజ నటులుండగా, చిత్ర పరిశ్రమ పెద్దలు ఉండగా అనుభవం, స్థాయిలేని గజేంద్రను నియమించడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.