final decision
-
అన్నీ ఆలోచించాకే పిల్లలకు టీకాపై నిర్ణయం
న్యూఢిల్లీ: శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అధ్యయనం చేసి, కోవిడ్–19 వ్యాక్సిన్ల పంపిణీ పరిస్థితుల్ని అంచనా వేసుకున్నాకే పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కరోనా టాస్క్‌ఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు 18 ఏళ్లలోపు వారికి టీకా డోసులు ఇస్తున్నారని, అయితే తాము అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే పిల్లల వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఆదివారం చెప్పారు. భారత్ బయోటెక్ కోవాగి్జన్ టీకాను 2–18 ఏళ్ల వయసు వారికి ఇవ్వొచ్చునని డీసీజీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగి్జన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. 2–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై శాస్త్రీయ అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వి.కె.పాల్ స్పష్టం చేశారు. -
స్పీకర్ నిర్ణయమే కీలకం
రరాజకీయ సంక్షోభ సమయాన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్పీ ప్రజాపతిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. చట్ట ప్రకారం శాసనసభ్యులు తమ రాజీనామా పత్రాలను సభాపతికి పంపించాల్సి ఉంటుంది. అయితే రాజీనామా పత్రాలు స్పీకర్‌కి సమర్పించినంత మాత్రాన సరిపోదు. వాటిని స్పీకర్ ఆమోదించినప్పుడే ఆ రాజీనామాలను అధికారికంగా గుర్తిస్తారు. ►రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ఒక శాసనసభ్యుడు ఎలా రాజీనామా చేయొచ్చు అనే విషయాన్ని చర్చిస్తుంది. ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ని ఉద్దేశించి రాయాల్సి ఉంటుంది. దాన్ని కేవలం స్పీకరే మాత్రమే ఆమోదించాల్సి ఉంటుంది. (గవర్నర్ కాదు). ►శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాలు ఎవరి ఒత్తిడి వల్ల చేసినవి కావనీ, అవి వారి వారి ఇష్టపూర్వకంగా చేసినవేననీ స్పీకర్ భావించాలి. స్పీకర్‌కి విశ్వాసం కలగకపోతే దానిపైన స్వతంత్రంగా విచారణ జరిపే అధికారాన్ని కూడా ఈ ఆర్టికల్ స్పీకర్‌కి ఇచ్చింది. ►ఒకవేళ రాజీనామా స్వతంత్రంగా చేసింది కాదనీ, ఎవరి ఒత్తిడితోనైనా చేసిన రాజీనామా అని స్పీకర్ నమ్మినట్టయితే రాజీనామాని ఆమోదించకుండా ఉండే అవకాశం కూడా సభాపతికి ఉంటుంది. ►శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడం కూడా స్పీకర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమ్మతించింది. ►స్పీకర్ ఆమోదముద్ర వేయకుండానే ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరిపోతే వారు పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలోకి వస్తారు. -
ఇక జస్టిస్ ధర్మాధికారిదే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఏడాదిగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ముగిసింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ధర్మాధికారి ఆదివారం రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సైతం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్‌లో 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఉద్యోగుల విభజన కోసం ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని గతంలో ధర్మాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు. రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో 613 మంది ఏపీకి, 504 తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వగా.. మిగిలినవారు ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 256 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని ఏపీ విద్యుత్ సంస్థలు తీసుకుంటే, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మందిలో సగంమందిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆదివారం సమావేశంలో ఆఫర్ ఇచ్చాయి. దీనిని ఏపీ విద్యుత్ సంస్థలు తిరస్కరించాయి. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ ముగిసిందని, తానే తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు నివేదిస్తానని పేర్కొంటూ జస్టిస్ ధర్మాధికారి సమావేశాన్ని ముగించారు. 2018 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మెట్టు దిగినా..: రిలీవైన 1,157 మందిలో తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 504 మందితోపాటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన 256లో సగం మందిని తీసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శివాజీ, అంజయ్యలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి తోడు నాలుగేళ్ల కింద ఏపీ నుంచి 242 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకున్నాయన్నారు. దీంతో మొత్తం 874 మంది ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేయగా, 613 మందిని తీసుకోవడానికి ఏపీ అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు మెట్టు కిందికి దిగినా, ఏపీ విద్యుత్ సంస్థలు మొండికేశాయని విమర్శించారు.