స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
వెల్లడించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు నేడు (గురువారం) వెల్లడించనుంది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 18 నెలల కిందట ఈ స్కాండల్ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ... ఫిక్సింగ్‌లో బీసీసీఐలోని కొంత మంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తేల్చడంతో కేసు అనేక మలుపులు తీసుకుంది.