Final Matches
-
అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తొలి సెంచరీలు చేసింది ఎవరు..?
నిన్న (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ట్రవిస్ హెడ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్ ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్లో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కిన అనంతరం వివిధ ఫార్మాట్ల ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఎవరు శతక్కొట్టారనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్‌లో ఎవరు తొలి సెంచరీ చేశారని ఆరా తీయగా.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తొలి సెంచరీ క్లైవ్ లాయిడ్ (1975 వరల్డ్‌కప్, వెస్టిండీస్), ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీ ఫిలో వాలెస్ (1998, వెస్టిండీస్) పేరిట నమోదై ఉన్నాయి. టీ20 ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో జరిగే ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ సాధించలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో 11 సెంచరీలు నమోదైనప్పటికీ అన్నీ వివిధ దశల్లో వచ్చినవే. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) సత్తా చాటడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వార్నర్ (43), ఉస్మాన్ ఖ్వాజా (0), మార్నస్ లబూషేన్ (26) ఔటయ్యారు. షమీ, సిరాజ్, శార్దూల్‌కు తలో వికెట్ దక్కింది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించిన ఆసీస్ -
'క్రికెట్ మక్కా' వేదికగా 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్
క్రికెట్ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023, 2025లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లకు లార్డ్స్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు మంగళవారం(జూలై 26) బర్మింగ్హమ్ వేదికగా నిర్వహించిన చివరి రోజు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పేర్కొంది. వాస్తవానికి 2019-21 తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా లార్డ్స్‌లో జరగాల్సింది. కానీ కరోనా కారణంగా ఆఖరి క్షణంలో వేదికను సౌతాంప్టన్‌కు మార్చాల్సి వచ్చింది. దీంతో పాటు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక 2021 జూన్ 18 నుంచి 23 వరకు తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ►ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీలో వివిఎస్ లక్ష్మణ్‌తో పాటు కివీస్ మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరిని ఆటగాళ్ల ప్రతినిధులుగా నియమించింది. ►ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ కారణంగా రష్యా క్రికెట్ మెంబర్‌షిప్‌ను ఐసీసీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేసింది. దీంతోపాటు ఉక్రెయిన్‌కు క్రికెట్లో సభ్యత్వం ఇవ్వడానికి ఐసీసీ కమిటీ ఆమోదం తెలిపింది. ►2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. ►అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
Ranji Trophy 2022: ముంబైను ఆపతరమా!
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్ చేరిన ఆ టీమ్ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క రంజీ టైటిల్ కూడా లేదు. 23 ఏళ్ల క్రితం ఒకే ఒకసారి ఫైనల్ చేరిన ఆ టీమ్ ఓటమితో సరిపెట్టుకుంది. ఇప్పుడు తమ అంకెను 42కు పెంచుకునేందుకు ముంబైకి, తొలి ట్రోఫీని ముద్దాడేందుకు మధ్యప్రదేశ్‌కు అవకాశం వచ్చింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐదు రోజుల పాటు ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలుస్తుందనేది ఆసక్తికరం. బలాబలాలను బట్టి చూస్తే ముంబైది పైచేయిగా కనిపిస్తున్నా... ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన మధ్యప్రదేశ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించకపోవచ్చు. ఫామ్‌లో బ్యాటర్లు... 7 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు... ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ ఇది. యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటగా, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపించారు. రజత్ పటిదార్ కీలకం... ఆదిత్య శ్రీవాస్తవ కెప్టెన్సీలోని మధ్యప్రదేశ్ జట్టులో స్టార్స్ లేకపోయినా సమష్టి తత్వమే టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చింది. ఐపీఎల్లో సత్తా చాటిన రజత్ పటిదార్ (506 పరుగులు) దేశవాళీ టీమ్ తరఫున కూడా టాప్ స్కోరర్‌గా బ్యాటింగ్ భారం మోస్తున్నాడు. యశ్ దూబే (480), శుభమ్ శర్మ (462), హిమాన్షు (307) కీలక ఆటగాళ్లు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా మధ్యప్రదేశ్ మెరుగైన స్థితికి చేరగలదు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆకట్టుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (27 వికెట్లు) బౌలింగ్‌లో మరోసారి ముందుండి నడిపించనున్నాడు. -
సన్‌రైజర్స్ ముందు ‘నాలుగు’ సవాళ్లు
గతేడాది అద్భుత ప్రస్థానంతో దర్జాగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈసారి అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అటు బ్యాటింగ్ బలం, ఇటు బౌలింగ్ దన్నుతో ఈపాటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావాల్సిన జట్టు... అనూహ్య పరాజయాలతో కిందామీద పడుతోంది. వీటికితోడు వార్నర్, బెయిర్‌స్టో వంటి మేటి బ్యాట్స్‌మెన్ కీలక సమయంలో దూరం కావడం మరింత ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్‌లోనూ తప్పిదాలతో తలబొప్పి కడుతోంది. ఇన్ని సవాళ్ల మధ్య హైదరాబాద్ నాకౌట్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో...? సాక్షి, హైదరాబాద్ : పది మ్యాచ్‌లు... ఐదు విజయాలు, ఐదు పరాజయాలు, పది పాయింట్లు...! ఐపీఎల్–12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిది. వాస్తవానికి ఈసారి లీగ్‌ను ఓటమితో ప్రారంభించినా, తర్వాత హ్యాట్రిక్ విజయాలతో మన జట్టు మంచి స్థితిలోనే నిలిచింది. అయితే, ఆ వెంటనే హ్యాట్రిక్ పరాజయాలు ఎదురవడంతో దెబ్బపడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా వెనుకబడింది. కీలక దశలో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లను ఓడించి గాడిన పడినట్లే కనిపించినా, మంగళవారం చెన్నైతో మ్యాచ్‌ను చేజార్చుకుని మళ్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడిక మిగిలింది నాలుగు మ్యాచ్‌లు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకౌట్‌కు చేరాలంటే వీటిలో కనీసం మూడైనా నెగ్గాలి. రెండింటిలో గెలిచినా అవకాశాలుంటాయి కానీ, అప్పుడు ప్రత్యర్థి జట్ల గెలుపోటముల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. తాజాగా జట్టు ఫామ్‌తో పాటు, పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండటంతో సన్ రైజర్స్ ఏ మేరకు ముందుకెళ్తుందో చూడాలి. ఆ త్రయం లేకుంటే ఇబ్బందే! వ్యక్తిగత కారణాలతో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ప్రపంచ కప్ సన్నాహాలతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో ఇప్పటికే సన్ రైజర్స్‌ను వీడారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొనసాగడమూ సందేహంగానే ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్ బ్యాటింగ్ తేలిపోయినట్లే. ఓ విధంగా చూస్తే ఈ సీజన్లో జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగడానికి ప్రధాన కారణం విలియమ్సన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే. అప్పటికీ వార్నర్, బెయిర్‌స్టో అతడి లోటును సాధ్యమైనంత భర్తీ చేశారు. కానీ, వీరికితోడుగా విలియమ్సన్ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది. ఇప్పుడీ త్రయం సేవలు పూర్తిగా దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు క్లిష్ట పరిస్థితులు తప్పేలా లేవు. బౌలింగూ బెంగ పుట్టిస్తోంది సన్ రైజర్స్ ప్రధాన బలం బౌలింగే. గతేడాది 140 లోపు స్వల్ప స్కోర్లనూ జట్టు ఇదే బలంతో కాపాడుకోగలిగింది. భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ వంటి పేసర్లు, రషీద్ ఖాన్, షకీబ్ వంటి స్పిన్నర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయడానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెమటోడ్చేవారు. ఇప్పుడు ఈ మ్యాజిక్ కూడా పనిచేయట్లేదు. భువీ మెరుగ్గానే బంతులేస్తున్నా, సందీప్ పూర్తిగా తేలిపోతున్నాడు. వైవిధ్యం కోసమో మరెందుకో కానీ కౌల్ స్థానంలో తీసుకుంటున్న ఎడమ చేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్ అంచనాలు నిలుపుకొంటున్నాడు. అయితే, సందీప్‌ను కాకుండా కౌల్‌ను పక్కనపెట్టడం, షాబాజ్ నదీమ్‌లాంటి స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వ్యూహ తప్పిదంగా కనిపిస్తోంది. ఇక పొదుపైన బౌలింగ్‌కు మారు పేరైన మిస్టరీ స్పిన్పర్ రషీద్ ఖాన్... కీలకమైన చెన్నైపై భారీగా పరుగులివ్వడం మ్యాచ్‌నే చేజార్చింది. ఈ తప్పులను సరిచూసుకుని, లోపాలను తక్షణమే సరిచేసుకోవాల్సి ఉంది. కిం కర్తవ్యం? బ్యాటింగ్‌లో విదేశీ మొనగాళ్లు దూరమవుతున్న నేపథ్యంలో భారాన్ని మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్ పూర్తిగా మోయాలి. మంచి బ్యాట్స్‌మన్ అయిన మనీశ్... గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించాలి. విజయ్ భారీ ఇన్నింగ్స్‌లతో జట్టు స్కోరుకు ఉపయోగపడాలి. ప్లే ఆఫ్స్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుని... ఈ నెల 27న రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గెలవాలి. బలహీన జట్టయిన రాయల్స్‌ను ఓడిస్తే కొంత భరోసా వస్తుంది. అనంతరం 29న పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగొచ్చు. సొంతగడ్డపై జరిగే మ్యాచ్ కాబట్టి గెలుపుపై ధీమా ఉంటుంది. ముంబై (మే 2), బెంగళూరు (మే 4)తో మ్యాచ్‌లను తాడోపేడో అనే రీతిలో ఆడొచ్చు. అయితే, అచ్చం హైదరాబాద్‌లాగే ఈ నాలుగు జట్లూ ప్లే ఆఫ్స్‌కు అర్హత రేసులో ఉన్నాయి. దీంతో పోటీ రసవత్తరంగా సాగడం ఖాయం. ఆ భాగ్యం దక్కేనా? ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందన్న వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటికే టికెట్ల కోసం వారంతా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో మన జట్టు ఫైనల్‌కు చేరితే అభిమానుల సందడికి అంతుండదు. మరి ఈ ఆశను సన్‌రైజర్స్ ఎంతవరకు నెరవేరుస్తుందో? -
రద్వాన్‌స్కాకు షాక్
పిరన్కోవా సంచలనం * ఆరో సీడ్ హలెప్ కూడా అవుట్ * ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలన ఫలితాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఆరో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టారు. గతంలో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా ఏనాడూ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన బల్గేరియా ప్లేయర్ స్వెతానా పిరన్కోవా ధాటికి రద్వాన్‌స్కా... యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సమంత స్టోసుర్ దూకుడుకు హలెప్ చేతులేత్తేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ పిరన్కోవా 2-6, 6-3, 6-3తో ప్రపంచ రెండో ర్యాంకర్ రద్వాన్‌స్కాను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6-2, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల ఆగిపోయింది. సోమవారం వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. మంగళవారం మ్యాచ్ మొదలయ్యాక 29 ఏళ్ల పిరన్కోవా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో పిరన్కోవా అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హలెప్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోసుర్ 7-6 (7/0), 6-3తో విజయం సాధించింది. తద్వారా మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్లో 3-5తో వెనుకబడ్డ 2011 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టోసుర్ వెంటనే తేరుకొని స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్లో ఒకసారి హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్టోసుర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది. వెంటాడిన వర్షం మంగళవారం కూడా ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వీడలేదు. ఫలితంగా పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. బాటిస్టా అగుట్ (స్పెయిన్)తో జరుగుతున్న మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌ను 3-6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6-4తో నెగ్గాడు. మూడో సెట్లో ఈ సెర్బియా స్టార్ 4-1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.