finance case
-
మామ అని బైక్ ఇప్పిస్తే.. ఎంత పనిచేశాడు..
సాక్షి, భిక్కనూరు(నిజామాబాద్): మేనమామకు తన పేరు మీద బైక్ ఇప్పిస్తే ఆయన కనబడకుండా పోయాడు. ఫైనాన్స్ వారు తనకు ఫోన్ చేయడంతో డబ్బు ఎలా కట్టాలని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని పెద్దమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాలు..పెద్దమల్లారెడ్డికి చెందిన నడిపొల్ల బాలయ్య(29)కు బీబీపేటకు చెందిన శ్యాగ రాజు మేనమామ అవుతాడు. శ్యాగ రాజు బాలయ్య పేరిట ఫైనాన్స్‌లో ద్విచక్రవాహనం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సగం మాత్రమే రాజు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ వారు బాలయ్యకు డబ్బులు చెల్లించాలని ఫోన్ చేస్తున్నారు. బైక్ తీసుకున్న రాజు కనించకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండటంతో బాలయ్య ఆందోళనకు గురయ్యాడు. 15 రోజులుగా ఈ విషయమై తీవ్రంగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గ్రామశివారులోని డబులు బెడ్ రూం ఇళ్ల సమీపంలో చెట్టుకు బాలయ్య ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలయ్య భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
50 లక్షలకు మించితేనే సుప్రీంకు
న్యూఢిల్లీ: తాను పార్టీగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల కంటే తక్కువ మొత్తం చెల్లించాల్సిన ఆర్థిక సంబంధమైన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించ కూడదని భావిస్తోంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ. 10 లక్షలుగా ఉంది. దీనిని ఐదు రెట్లు పెంచడం ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు రూ.50 లక్షలకు మించిన కేసుల్లోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రకమైన కేసులు ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ, తపాలా విభాగం, రక్షణ, రైల్వే శాఖల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2017 జూన్ 12 నాటికి మొత్తం 1,35,060 ప్రభుత్వ కేసులు, 369 కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వీస్‌కు సంబంధించిన అంశాలు, ప్రైవేటు పార్టీలతో వివాదాలు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఈ వివాదాలు నడుస్తున్నాయి. -
సీఎం ఆఫీస్ ఎదుట విషం తాగి చస్తాం
♦ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి బాధితులు ♦ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ ♦ నేటి నుంచి ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు హైదరాబాద్: అక్రమ వడ్డీ వ్యాపారానికి పాల్పడి.. తమ ఆస్తులను హస్తగతం చేసుకున్న మోహన్‌రెడ్డి ఆగడాలను అడ్డుకుని తగిన న్యాయం చేయకపోతే సీఎం కేసీఆర్ కార్యాలయం ముందే విషం తాగి చస్తామని బాధితులు హెచ్చరించారు. అలాగే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, బాధితులు లక్ష్మి, ముజీబ్, స్వప్న, సరోజలు మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కరీంనగర్లో 20 ఏళ్లుగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న మోహన్‌రెడ్డి తనఖా పేరుతో, అప్పు పేరుతో తమ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్, బెంగుళూరు, అమరావతి, తదితర ప్రాంతాల్లో సుమారు 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మోహన్‌రెడ్డి బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రర్ అయ్యాయని తెలిపారు. ఇలా సుమారు రూ.1000 కోట్ల బినామీ ఆస్తులను ఆయన సంపాదించాడని ఆరోపించారు. ఎదురు తిరిగిన బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సివిల్ పోలీసులు, సీఐడీ, ఏసీబీ లాంటి విభాగాల అధికారులు విచారణ చేసినా మోహన్‌రెడ్డి ప్రభావితం చేయగలుగుతాడని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి స్పందించి మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇకపై హైదరాబాద్‌లోనే ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. మోహన్‌రెడ్డి, అతని బినామీలు, గూండాల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఏఎస్సై కేసులో డీల్ కుదిరింది!
► పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లింపు! ► కీలకంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి ► వారి నుంచి డబ్బు ముట్టినట్లు సంతకాలు ► కరీంనగర్లో 20 రోజుల మకాం ► స్థానిక నేతలకు ముడుపులు! ► సీఐడీ దర్యాప్తుపైనా అనుమానాలు కరీంనగర్: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ ఉదంతానికి తెరదించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య కేసులో అరెస్టై జైలుపాలైన మోహన్‌రెడ్డికి అక్రమ ఫైనాన్స్ దందాతో దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, జైలులోనే ఉన్న మోహన్‌రెడ్డి అక్కడి నుంచే తన వ్యాపారానికి సంబంధించి సెటిల్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులకు సొమ్మును చెల్లించడంతోపాటు బాధితులతో రాజీకి సిద్ధపడినట్లు తెలిసింది. తన ప్రైవేట్ పైనాన్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఠంఛన్‌గా వడ్డీలు చెల్లించడంతోపాటు 20 రోజుల క్రితం అసలు మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదారాబాద్‌లో పని చేస్తున్న ఓ పోలీ సు ఉన్నతాధికారి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. రూ.120 కోట్ల చెల్లింపులు..! మోహన్‌రెడ్డి శాఖాపరంగా మంచిపేరున్న కొంతమంది పోలీసుల పేర్లను ఉద్దేశపూర్వకంగా ఇరికించి వ్యవహరాన్ని జఠిలం చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో వ్యవహరాన్ని చక్కదిద్దడానికి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి రంగంలోకి దిగినట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్ పెట్టుబడుదారుల జాబితాతో ఇటీవల కరీంనగర్ అలకాపురిలోని అధికారికి చెందిన ఇంట్లో ఆయన సుమారు 20 రోజులు పాటు మకాం వేసినట్లు తెలిసింది. ఆ జాబితాలోని వారందరినీ ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిచి వారు పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. విశ్వనీయమైన సమాచారం మేరకు మొత్తంగా రూ.120 కోట్లు పెట్టుబడుదారులకు వడ్డీతో సహా చెల్లించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు ముట్టినట్లుగా సంతకాలు సైతం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పెట్టుబడిదారులకు చెల్లించడానికి రూ.120 కోట్లకు పైగా నగదు ఎక్కడి నుంచి తెచ్చారనేది చర్చనీయాంశమైంది. నిజామాబాద్, మంచిర్యాల, హైదరాబాద్‌లకు చెందిన ముగ్గురు ఎన్ఆర్ఐలు ఆ డబ్బును సర్దుబాటు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన సదరు పోలీస్ అధికారి ఆ ముగ్గురి ఇళ్లకు వెళ్లి తన సొంత వాహనంలో డబ్బులను కరీంనగర్ తీసుకుని వచ్చారని సమాచారం. ఎన్ఆర్ఐల నుంచి మొత్తం రూ.150 కోట్లు తీసుకొచ్చారని, అందులో పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లించారని తెలిసింది. మిగిలిన మొత్తాన్ని ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉండేందుకు అధికార, విపక్షాలకు చెందిన కొందరు నేతలకు రూ. కోటి చొప్పున పంపకాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
కదులుతున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందా