Finance Year
-
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు అంతంతే!
ముంబై: భారత్ మొత్తం రత్నాలు– ఆభరణాల ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా 2.48 శాతం పెరిగి రూ. 3,00,462.52 కోట్లకు (37,469 మిలియన్ డాలర్లు) చేరాయి. ఒక్క మార్చి నెల చూస్తే, ఏకంగా ఈ విలువ భారీగా 24 శాతం పడిపోయి రూ.21,502 (2,613 మిలియన్ డాలర్లు) కోట్లుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ విలువ రూ.28,198.36 కోట్లు (3,699.90 మిలియన్ డాలర్లు). ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, దాదాపు ఆరు నెలల పాటు చైనాలో లాక్డౌన్ కారణంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్వల్ప వృద్ధి నమోదుకావడానికి సకాలంలో జరిగిన భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కొంత దోహపదడింది. దీనితో ప్లైన్ గోల్డ్ జ్యూయలరీ 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే భారీగా 17 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఎగుమతుల్లో 2.97 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో రూ.1,82,111 కోట్ల (24,434 మిలియన్ డాలర్లు) నుంచి రూ.1,76,697 కోట్లకు (22,045 మిలియన్ డాలర్లు) ఎగుమతుల విలువ తగ్గింది. ► అమెరికా–చైనాసహా భారత్ కీలక మార్కెట్లలో వజ్రాల డిమాండ్‌ను ప్రపంచ సవాళ్లు, అనిశ్చితి పరిస్థితులు ప్రభావితం చేశాయి. ► అయితే యూరప్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ బాగానే ఉంది. రష్యన్ వజ్రాల సరఫరాల్లో అనిశ్చితి, శుద్ధీకరణలో సవాళ్ల కారణంగా భారతదేశం ఇబ్బందులను ఎదుర్కొంది. ► రాబోయే నెలల్లో వజ్రాల రంగానికి స్థిరత్వం తిరిగి వస్తుందన్నది అంచనా. ముఖ్యంగా చైనా, దూర ప్రాశ్చ ఆసియాలో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని విశ్వాసం ఉంది. ► 2022 ఏప్రిల్ 2023 మార్చి మధ్య పసిడి ఆభరణాల ఎగుమతుల విలువ 11 శాతం పెరిగి రూ.75,636 కోట్లు (9,423 మిలియన్ డాలర్లు). 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య ఈ విలువ రూ.68,062.41 కోట్లు (9,130 మిలియన్ డాలర్లు). ► ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో వెండి ఆభరణాల ఎగుమతులు 16.02 శాతం పెరిగి రూ. 23,492.71 కోట్లకు (2,932 మిలియన్ డాలర్లు) పెరిగింది. 2021–22 ఇదే కాలంలో ఈ విలువ రూ. 20,248.09 కోట్లు (2,714.14 మిలియన్ డాలర్లు). -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
మార్చి 31కి ముందే భారీ డిజిన్వెస్ట్‌మెంట్ : జైట్లీ
ముంబై: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే(మార్చి 31) పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణల (డిజిన్వెస్ట్‌మెంట్) కార్యక్రమాన్ని చేపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే ఇంతకుమించి తాను దీనిపై మరే ఇతర అంశాలూ చెప్పదలచుకోలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.1 శాతం వద్ద ద్రవ్యలోటు (కేంద్రానికి రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసం) కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.43,425 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణలు బడ్జెట్ లక్ష్యం. ఇందుకోసం ఓఎన్జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియా వంటి సంస్థలు వరుసలో ఉన్నాయి. ఆర్థికవృద్ధిపై ఇలా... గడచిన సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థికాభివృద్ధి బాగుండే అవకాశం ఉన్నప్పటికీ, ఇది పూర్తి సంతృప్తికలిగించకపోవచ్చన్నారు. దీనికి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే కారణమని విమర్శించారు. ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో ఉంటుందంటూ, ఇది వడ్డీరేట్ల తగ్గింపునకు, వృద్ధికి దోహదపడుతుందన్నారు.