fires on media
-
సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు
సాక్షి, అమరావతి: ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ ఎల్లో మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూస్ చానల్... సీ ఓటర్‌తో కలిసి చేసిన సర్వే మాత్రమే అసలు సిసలు అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోందన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితే ఒరిజినల్, లేకపోతే ఆ సర్వే ఫేకా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. పరాజితులు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని చెప్పారు. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటారన్నారు. ‘‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది.. ఎందరో పుష్పరాజ్‌లను నేను తయారు చేశా.. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’’ అని బాబు అంటారేమో అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాము సమీక్ష నిర్వహిస్తే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేసిన ఈనాడు అభూత కల్పనలు రాస్తూ నానాటికీ దిగజారుతోందన్నారు. కాగా ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రకటించిన జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైన గనిమిశెట్టి పద్మజకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కడం ప్రశంసనీయమన్నారు. -
ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్‌పై సమంత సీరియస్
Samantha Fires On A Reporter: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన స్టాఫ్‌తో కలిసి ఆమె తిరుమలకు చేరుకుంది. అయితే దర్శనం అనంతరం బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్..'మీ గురించి రూమర్స్ వస్తున్నాయి' అంటూ ప్రశ్నించడంతో సీరియస్ అయిన సమంత.. 'గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి? అసలు బుద్ధి ఉందా' అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. దేవుని దర్శనం కోసం వచ్చినప్పుడు కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఆమె షూటింగ్స్‌లో పాల్గొననుంది. Sam really proud of you!! Some people don’t understand what to ask when .. Just loved that reply of yours !@Samanthaprabhu2 . .#SamanthaAkkineni #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/5RUO5bbhbz — Multi Fandom (@multifandom5928) September 18, 2021 చదవండి : Samantha: శ్రీవారిని దర్శించుకున్న సమంత -
జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌పై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్లే ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంగీకరించాడు. సమిష్టిగా రాణించడంలో తమ జట్టు సభ్యులు విఫలమయ్యారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్ట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (అద్భుతాలు జరగలేదు.. మనం గెలవలేదు) టెస్ట్ మ్యాచ్ రెండో రోజు మైదానంలో కోహ్లి ప్రవర్తించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మైదానంలో అరుస్తున్న ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు కోహ్లి సైగ చేశాడు. అలాగే ఆవేశంగా ఏదో అంటున్నట్టు కనిపించాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు కోహ్లి క్రీడా స్పూర్తిని మరిచి ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు ఈ ఘటనపై కోహ్లి స్పందించాల్సిందిగా కోరారు. దీంతో అసహనానికి లోనైన కోహ్లి.. ఒక ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారని ఘాటుగా స్పందించాడు. జర్నలిస్టు : విరాట్, మైదానంలో మీ ప్రవర్తనపై ఏం చెబుతారు?. కేన్ విలియమ్సన్ జౌట్ అయినప్పుడు మీరు ఎందుకు అలా ప్రవర్తించారు. టీమిండియా కెప్టెన్‌గా మైదానంలో ఇలాంటి సంప్రాదాయం నెలకొల్పడం సరైనది కాదని మీకు అనిపించలేదా? కోహ్లి : మీరు ఏమనుకుంటున్నారు? జర్నలిస్టు : నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను? కోహ్లి : నేను మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాను? జర్నలిస్టు : మీరు మంచి సంప్రాదాయాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. కోహ్లి : మీరు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే సరైనా ప్రశ్నలు అడగాలి. సగం వివరాలతో సగం సగం ప్రశ్నలు అడగకండి. ఒకవేళ మీరు వివాదం సృష్టించాలనుకుంటే ఇది అందుకు సరైన వేదిక కాదు. నేను మ్యాచ్ రిఫరీతో మాట్లాడాను.. అతనికి మైదానంలో జరిగిన దానితో ఎలాంటి సమస్య లేదు. -
మీడియాను బహిష్కరిస్తున్నా: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై అలిగారు. మీడియాను తాను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కుమారస్వామి ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం బయటకురాగానే కుమారస్వామిని చుట్టుముట్టిన మీడియా, సమావేశంలో ఏం చర్చించారని ప్రశ్నించింది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన కుమారస్వామి..‘మీరంతా(మీడియా) వార్తల కోసం ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయండి. ఇష్టమొచ్చినట్లు రాసుకోండి. ఎంజాయ్ చేయండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. తన కుమారుడు నిఖిల్, సినీనటి సుమలత బరిలో ఉన్న మాండ్యలో మీడియా సుమలతకే ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎం అలకబూనినట్లు్ల తెలుస్తోంది. -
పిక్క కొడితే కరీంనగర్‌కు కలెక్టర్ అవుతా:రసమయి
కరీంనగర్: పిక్క కొడితే కరీంనగర్‌కు కలెక్టర్ అవుతానని తెలంగాణ సాంస్కృతిక సారథి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పీహెచ్డీ కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కేటగిరీలో సీటు సంపాదించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై రసమయి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరితీసిన దాఖలాలు ఉన్నాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికలు వ్యవహరించాలని సూచించారు.