First anniversary of the death
-
నేడు శోభమ్మ ప్రథమ వర్ధంతి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నేడు ఆళ్లగడ్డలో జరగనుంది. కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని శోభానాగిరెడ్డి భర్త, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సాధారణ ఎన్నికల సందర్భంగా గత ఏడాది నంద్యాలలో జరిగిన పార్టీ మహిళా నేత షర్మిల బహిరంగ సభ అనంతరం తిరిగి ఆళ్లగడ్డకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం శోభమ్మ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భూమా వెల్లడించారు. 9.30 గంటలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ప్రముఖ గాయని, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం నాయకురాలు వంగపండ ఉష బృందం... శోభానాగిరెడ్డి చేసిన సేవలను వివరిస్తూ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం 11 గంటలకు సంస్మరణ సభలో పార్టీ గౌవర అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధినేత వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన శోభానాగిరెడ్డి విగ్రహాలను విజయమ్మతో పాటు జగన్ ఆవిష్కరిస్తారని వివరించారు. వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 20వేల నుంచి 25వేల మంది వరకూ హాజరవుతారని అంచనా. -
నేడు ఆళ్లగడ్డకు జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఆళ్లగడ్డకు వెళుతున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని గురువారం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.శోభా తొలి వర్ధంతిని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరులో బండలాగుడు పోటీలను ప్రారంభి ంచారు. తలపాగా చుట్టిన ఆయన చర్నాకోలా చేతబట్టి ఎద్దులను అదిలించి ఆకట్టుకున్నారు. - సాక్షి, కడప -
ధర్మవరపు సుబ్రమణ్యం వర్ధంతి
చైతన్యపురి: ప్రముఖ హాస్య నటుడు, దివంగత ధర్మవరపు సుబ్రమణ్యం ప్రధమ వర్ధంతిని బుధవారం ఉదయం దిల్సుఖ్నగర్ శారదానగర్‌లోని ఆయన నివాసంలో నిర్వహించనున్నారు. అనారోగ్య కారణంగా గత సంవత్సరం డిసెంబర్ 7న చైతన్యపురిలోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించారు. ప్రకాశం జిల్లా కొమ్మినేని పాలెం గ్రామంలో జన్మించిన ధర్మవరపు ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్ ద్వారా నటుడుగా పరిచయమై ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వర్ధంతి సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.అశోక్‌నగర్‌లోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సుబ్రమణ్యేశ్వర షష్టి కల్యాణ మహోత్సవం.