first birthday
-
ఇలియానా కుమారుడి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత తక్కువ రోజులకే భూమిపైకి వచ్చిన ఓ బుడతడు తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అమెరికాకు చెందిన బెత్, రిక్ దంపతులకు 2020, జూన్ 5న రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ జన్మించాడు. అయితే రిచర్డ్ బతికే ఛాన్స్ జీరో అని అప్పట్లో డాక్టర్లు తేల్చేశారు. కానీ తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణలో రిచర్డ్ తన ఫస్ట్ బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. 21 వారాల 2 రోజులకు జన్నించి బతికిన శిశువుగా రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు నిజానికి బెత్ హచిన్సన్ డెలివరీ డేట్ 2020 అక్టోబర్ 13. అయితే కొన్ని సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. దీనిపై వైద్యులు బెత్ హచిన్సన్ భర్త రిక్ హచిన్సన్తో తీవ్రమైన చర్చలు జరిపిన తరువాత బిడ్డను బయటకు తీశారు. రిచర్డ్ స్కాట్ జన్మించినపుడు కేవలం 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు.. ఓ అరచేతిలో సరిపోయే సైజు మాత్రమే ఉన్నాడు. ఇక అతడి బరువు పూర్తికాల నవజాత శిశువు సగటు బరువులో పదోవంతు అన్నమాట. బతకడం జీరో ఛాన్స్ అన్న డాక్టర్ రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ పుట్టినప్పుడు అతడు బతకడం జీరో ఛాన్స్ అని మిన్నియాపాలిస్లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా ఆసుపత్రిలోని డాక్టర్ నియోనాటాలజిస్ట్ స్టేసీ కెర్న్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఓ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటలకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక గతంలో కెనడాలోని ఒట్టావాలో బ్రెండా, జేమ్స్ గిల్ దంపతులకు 1987, మే 20న జన్మించిన జేమ్స్ ఎల్గిన్ గిల్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉండేది. జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల 5 రోజులు మాత్రమే ఉన్నాడు. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్.. ప్రాణాలు గాల్లో.. -
అరిన్ డాటర్ ఆఫ్ అసిన్
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలబార్ బ్యూటీ ఆసిన్. 2016లో రాహుల్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో విడుదలైన ‘ఆల్ ఈజ్ వెల్’ అసిన్ చివరి చిత్రం. గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే ఆ పాప ఫొటోలను కానీ, పేరుని కానీ మీడియాతో పంచుకోలేదు. ఇప్పుడు మా అమ్మాయి ‘అరిన్’ అంటూ పాప మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ బర్త్డే ఫొటోలను పంచుకున్నారామె. ‘‘మా చిన్నారి పాప అరిన్కి హ్యాపీ ఫస్ట్ బర్త్డే’’ అన్నారు అసిన్. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ముంబైలో ఉంటున్నారు అసిన్. -
పుట్టిన రోజే.. చివరి రోజు!
బుడిబుడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో వారందరికీ సంతోషం పంచిన ఆ చిన్నారికి మొదటి పుట్టిన రోజు చివరిదయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధు మిత్రుల ఆప్యాయతల నడుమ నిండు నూరేళ్లు జీవించాల్సిన వాడు పుట్టిన ఏడాదికే కానరాని లోకాలకు తరలిపోయాడు. తమకు జీవనాధారమైన ఆటో కన్నపేగును చిదిమేసిన విషయాన్ని తలచుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పండుగ రోజు జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సాక్షి, జూపాడుబంగ్లా : మండలంలోని 80 బన్నూరులో శనివారం ఆటో కిందపడి ఓ చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. మృతుడి బంధువుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఇలాష్బాషా, ఆశ్మ దంపతులకు కుమారుడు యూసుఫ్(ఏడాది)ఉన్నాడు. కుమారుడి పుట్టినరోజు, రంజాన్ పండుగ ఒకే రోజు రావటంతో ఆ ఇంట్లో బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం ఇంట్లో అందరూ పండగ హడావుడిలో ఉండగా తండ్రి కుమారుడి తీసుకుని ఇంటికి సమీపంలో ఉన్న మినరల్వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. తండ్రి ఆటోలోని ట్యాంకులో నీటిని నింపుకొని గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఆటో వెనక్కు నడపడంతో వెనుక ఉన్న చిన్నారిపై దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా వచ్చీరాని మాటలతో అందర్నీ నవ్వించిన యూసుఫ్ మృతిచెందాడనే వార్తతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. ఘటన స్థలికి చేరుకుని గుండెలు అవిసేలా రోదించారు. పండగ వాతావరణం కాస్త విషాదభరితంగా మారింది. గ్రామంలోని ముస్లింలు, చుట్టుపక్కల వారు మృతి చెందిన బాలుణ్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ చెయ్యని తమకు పండుగరోజు, పుట్టిన రోజునాడే అల్లా తమ బిడ్డను తీసుకెళ్లాలా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. -
జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో
-
జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో
హైదరాబాద్: తన కుమారుడు అభయ్ రామ్ తొలి పుట్టినరోజు కోసం హీరో ఎన్టీఆర్ మంగళవారం యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. బుధవారం(జూలై 22) అభయ్ రామ్ పుట్టినరోజు కావడంతో నందమూరి వారింట సందడి నెలకొంది. అభయ్ రామ్ బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా తన కుమారుడితో ఎన్టీఆర్ కలిసివున్న ఫోటో 'సాక్షి' సంపాదించింది. పుత్రోత్సాహంతో అభయ్ రామ్ ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుంటున్న ఫోటో అభిమానులకు కనువిందు చేయనుంది. తన పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడి ఫోటో తొలిసారిగా మే 19న జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే ఎన్టీఆర్ యూరప్ వెళ్లారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. పొడవాటి గడ్డం, వెరైటీ కటింగ్ తో విభిన్నంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఎన్టీఆర్ కొత్త గెటప్ ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.