చైనాలో ఐసీఐసీఐ బ్యాంక్ తొలి బ్రాంచ్
షాంఘై: భారత ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ చైనాలో తమ సేవలను ఆరంభించింది. చైనాలో ఐసీఐసీఐ తొలి బ్రాంచ్‌ను శనివారం షాంఘైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్రాంచ్‌ను తెరిచేందుకు గత మార్చిలో చైనా ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. భారత్, చైనాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల పురోగతిలో తమ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చర్ అన్నారు. మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది.