first century
-
ఐపీఎల్ 2023లో తొలి రికార్డ్ క్రియేట్ చేసిన బ్రూక్
-
ఈ శతకం నాన్నకు అంకితం: విహారి
కింగ్స్టన్: టెస్టుల్లో సాధించిన తొలి శతకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ప్రకటించాడు. ఇదే సందర్భంలో తాను సెంచరీ చేసేందుకు సహకరించిన పేసర్ ఇషాంత్ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. శనివారం ఆట ముగిశాక విహారి మాట్లాడుతూ... ‘ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు’ అని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన విహారి... ఇందులో ఇషాంత్ పాత్రను కొనియాడాడు. ఇషాంత్ అచ్చమైన బ్యాట్స్‌మన్‌లా ఆడాడని, బౌలర్లు ఏం చేస్తారో మాట్లాడుకుంటూ ఇన్నింగ్స్ కొనసాగించామని, అతడి అనుభవం ఉపయోగపడిందని విహారి అన్నాడు. -
‘హమ్మయ్య ఎట్టకేలకు సెంచరీ సాధించా’
రాజ్‌కోట్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఘనత అతడి సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయినా ఒక్క శతకం నమోదు కాలేదు.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ఆల్‌రౌండర్‌గా డొమెస్టిక్ క్రికెట్లో అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో ఒంటి చేత్తో విజయాలను అందించాడు రవీంద్ర జడేజా. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోయాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జడేజా.. కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడ్డూ బౌలర్‌గానే స్థిర పడ్డాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది చాలా తక్కువ. ఇక తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకోడానికి తొమ్మిదేళ్లు పట్టింది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో జడేజా తొలి శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం జడేజా మీడియా ముందు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. (ఓయ్ జడ్డూ.. ఏంటిది?) ఇంగ్లండ్ సిరీస్‌లో విశ్వాసం ఏర్పడింది.. ‘ఈ రోజు సెంచరీ చేసిన ఆ మధురాతి క్షణం ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొమ్మిదేళ్లకు తొలి సెంచరీ సాధించాను అందుకే చాలా స్పెషల్. అందులోనూ సొంత మైదానంలో కాబట్టి ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీసారి 70-80 స్కోర్ చేయగానే సెంచరీ చేయాలనే ఆరాటంలో వికెట్ పారేసుకునేవాడిని. కానీ ఈ రోజు సెంచరీ మార్క్ చేరాలని కసిగా ఆడాను. డొమెస్టిక్ క్రికెట్లో భారీ శతకాలు సాధించిన నేను.. ఇక్కడ కూడా సెంచరీలు సాధించగలననే నమ్మకం ఏర్పడింది. ఇంగ్లండ్‌లో నా బ్యాటింగ్ తీరుతో మరింత విశ్వాసం పెరిగింది. 15 నెలల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడాను. ఆసియాకప్‌లోనూ రాణించాను. ఫార్మట్ ఏదైనా నా శైలిలో రాణించేందుకు కష్టపడతా’ అంటూ జడేజా పేర్కొన్నాడు. అలా ఊహించలేదు ఈ రోజు మ్యాచ్‌లో జరిగిన రనౌట్ సంఘటన గురించి స్పందించాడు. ‘ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే ఎండ్‌లో ఉండటంతో సులువుగా ఔట్ చేయొచ్చని అనుకున్నాను. అందుకే నేరుగా బంతితో వికెట్లను గిరటేద్దామనుకుని.. వికెట్ల వైపు నడుచుకుంటూ వస్తున్నాను. కానీ అవతలి ఎండ్ నుంచి హెట్మెయిర్ పరిగెత్తుకొస్తున్న విషయాన్ని గమనించలేదు. సహచరులు అలర్ట్ చేయడంతో బంతిని వికెట్లుకు నేరుగా విసిరాను. అదృష్టం బాగుండి బంతి వికెట్లను తాకింది. లేకుంటే భారీ తప్పిదం జరిగి ఉండేది. థ్యాంక్ గాడ్’ అంటూ జడేజా వివరణ ఇచ్చాడు. చదవండి: తొలి టెస్టు.. విండీస్ విలవిల జడేజా సెంచరీ.. కోహ్లి సేన డిక్లేర్ -
నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్
మొహాలి : క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్- 2018 లో మొదటి సెంచరీని గేల్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం సృష్టించాడు. గేల్ 1 ఫోర్, 11 సిక్స్‌లతో 63బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం తనదైన రీతిలో గేల్ బ్యాట్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రోజు(శుక్రవారం) గేల్ కుమార్తె క్రిసాలినా పుట్టిన రోజు. నిన్న మ్యాచ్‌లో సాధించిన సెంచరీని గేల్ తన కుమార్తె క్రిసాలినాకు పుటినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గేల్‌ను వరించింది. అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘నా సెంచరీని నా కుమార్తె క్రిసాలినాకు అంకితం ఇస్తున్నాను. శుక్రవారం(ఏఫ్రిల్ 20న) మా రెండో పాట పుట్టినరోజును జరుపుకుంటోంది. క్రిసాలినా ఇండియాకు రావడం రెండోసారి. పంజాబ్ టీమ్ హోమ్‌గ్రౌండ్‌లో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంద’ని గేల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన విషయం విదితమే. టి20లో గేల్ మొత్తం 21 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మెకల్లమ్, క్రింగర్, ల్యూక్ రైట్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు ఈ విండీస్ వీరుడు. -
సచిన్ నిరీక్షణకు తెరపడిన వేళ!
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్.. ఈ పేరుకు బలమెక్కువ. మాస్టర్ బ్యాట్ నుంచి జాలువారిన పరుగులే ఇందుకు నిదర్శనం. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు.. వీటితోనే సచిన్ సావాసం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్‌కు వన్డేల్లో శతకం చేయడానికి ఆరేళ్లు పట్టింది. 1989లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన సచిన్.. 1990లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. మరి సచిన్ తొలి వన్డే సెంచరీ అంత త్వరగా అతని ఖాతాలో చేరలేదు. దాదాపు 78 మ్యాచ్‌లు ఆడిన తరువాత సచిన్ వన్డే సెంచరీ సాధించాడు. తాను నమోదు చేసిన అర్థశతకాలను సెంచరీగా మలచడానికి సచిన్ చాలానే శ్రమించాడు. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సచిన్ తన తొలి సెంచరీ సాధించాడు. అది జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9 వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సచిన్ తన సెంచరీల రికార్డులకు పునాది వేసుకున్నాడు. ఆ తరువాత వెనుదిరిగ చూడని సచిన్.. అదే ఏడాది వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. 1995లో సచిన్ ఖాతాలో ఒక్క వన్డే సెంచరీ మాత్రమే వచ్చినా.. 1996లో ఆరు శతకాలతో దుమ్మురేపాడు. ఓవరాల్‌గా సచిన్ వన్డే కెరీర్లో 49 సెంచరీలు చేస్తే, టెస్టుల్లో 51 శతకాలు సాధించాడు. -
పాకిస్థాన్‌కు ఆధిక్యం
అబుదాబి: ఓపెనర్ ఖుర్రమ్ మన్జూర్ (244 బంతుల్లో 131 బ్యాటింగ్; 14 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్థాన్ ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు ఆడుతున్న షాన్ మసూద్ (140 బంతుల్లో 75; 8 ఫోర్లు) కూడా రాణించడంతో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సరికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ 14 పరుగుల ఆధిక్యంలో ఉంది. మన్జూర్తో పాటు కెప్టెన్ మిస్బావుల్ హక్ (77 బంతుల్లో 44 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. హషీమ్ ఆమ్లా (252 బంతుల్లో 118; 13 ఫోర్లు) చక్కటి సెంచరీ సాధించగా, జేపీ డుమిని (94 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, బాబర్ చెరో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అజ్మల్‌కు 2 వికెట్లు దక్కాయి.