అబుదాబి: ఓపెనర్ ఖుర్రమ్ మన్‌జూర్ (244 బంతుల్లో 131 బ్యాటింగ్; 14 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్థాన్ ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు ఆడుతున్న షాన్ మసూద్ (140 బంతుల్లో 75; 8 ఫోర్లు) కూడా రాణించడంతో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సరికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
ప్రస్తుతం పాక్ 14 పరుగుల ఆధిక్యంలో ఉంది. మన్‌జూర్‌తో పాటు కెప్టెన్ మిస్బావుల్ హక్ (77 బంతుల్లో 44 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. హషీమ్ ఆమ్లా (252 బంతుల్లో 118; 13 ఫోర్లు) చక్కటి సెంచరీ సాధించగా, జేపీ డుమిని (94 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, బాబర్ చెరో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అజ్మల్‌కు 2 వికెట్లు దక్కాయి.
పాకిస్థాన్‌కు ఆధిక్యం
Published Wed, Oct 16 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement