నాటాలో సరస్వతికి ఫస్ట్ ర్యాంక్
అమలాపురం టౌన్ : కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్(నాటా) ప్రవేశ పరీక్షలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కల్వకొలను సరస్వతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. నాటా’లో ప్రవేశానికి ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ దశలవారీగా జరిగిన పరీక్షల్లో సరస్వతి 126 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సీటు సాధించింది.
అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్వకొలను తాతాజీ కుమార్తె అయిన సరస్వతి చిన్ననాటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ రాణిస్తోంది. రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించిన ఆమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.