Fish breeding
-
ఈ పద్ధతిలో చేపల పెంపకం చేస్తే.. లాభాలు కూడా భారీగానే..!
-
పెట్టుబడి లేకుండా చేపల పెంపకం 20 లక్షలు సంపాదిస్తున్న రైతు
-
పంగాసియస్.. కేరాఫ్ ఏపీ
పంగాసియస్గా పిలిచే ఈ చేపకు వెన్ను ముల్లు తప్ప చూద్దామంటే మరో ఎముక కనిపించదు. పైగా నీచు వాసన రాదు. దీంతో చేసే ఏ వంటకమైనా చాలా మృదువుగా.. రుచికరంగా ఉంటుంది. తింటే ఇట్టే జీర్ణమైపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే స్టార్ హోటల్స్‌తోపాటు సాధారణ హోటళ్లలోనూ ఈ చేప వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అపోలో ఫిష్‌గా దీనిని ఎక్కువగా వండుతారు. వియత్నాంలో పుట్టిన ఈ చేపలు మన ప్రాంతంలో పెరిగే ఏటి జెల్లను పోలి ఉంటాయి. దేశీయంగా వీటిని పంగా, పంగస్, అపోలో, వెండి చేప అని కూడా పిలుస్తారు. సాక్షి, అమరావతి: పంగాసియస్ చేపల సాగులోను.. అధిక దిగుబడులు సాధించడంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో ఈ చేపల్ని పెంచుతుండగా.. అందులో 20 వేల హెక్టార్లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఏటా 80 లక్షల టన్నుల పంగాసియస్ చేపలు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో 30నుంచి 35 లక్షల టన్నులు ఏపీ నుంచే దిగుబడి వస్తుండటం గమనార్హం. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వీటి సాగు విస్తరించి ఉంది. స్థానికంగా ఈ చేపల వినియోగం కేవలం 2 శాతమే కాగా.. మిగిలిందంతా పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు 10 లక్షల టన్నుల వరకు వెళుతోంది. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్లోనూ వీటికి డిమాండ్ ఎక్కువే. నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలవు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ చేపలు ఎలాంటి తెగుళ్లు, వ్యాధులనైనా తట్టుకుంటాయి. మొప్పలు కాకుండా వీటికి ఉండే గాలి తిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నీటి ఉపరితలానికి చేరి వాతావరణంలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వేసిన ప్రతి పిల్ల బతకడం వీటి ప్రత్యేకత. రెండేళ్లలో మూడు పంటలు తీస్తున్నారు. గరిష్టంగా ఏడాది పాటు పెంచగలిగితే ఒక్కో చేప 3నుంచి 4 కేజీల వరకు పెరుగుతుంది. ఎకరాకు సైజును బట్టి 12 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పోషకాలు పుష్కలం ప్రొటీన్స్, ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ చేపల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చేపలో ప్రొటీన్ 15.2 గ్రాములు, కొవ్వు 2.9 గ్రాములు, కార్బోహైడ్రేట్స్, యాష్ గ్రాము, నీరు 60 గ్రాములు, 89 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. హాని కల్గించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, కీళ్ల బలోపేతానికి, సేంద్రియ ఆమ్లాలు కంటిచూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి. బ్రూడర్ కేంద్రం ఏపీలోనే.. కేంద్రీయ మంచినీటి మత్స్య పరిశోధనా సంస్థ (భువనేశ్వర్)కు అనుబంధంగా కృష్ణా జిల్లా కానూరు వద్ద గల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం పంగాసియస్ బ్రూడర్గా కేంద్రం గుర్తింపు పొందింది. 2013లో వియత్నాం నుంచి తీసుకొచ్చిన బ్రూడర్స్ ద్వారా తల్లి చేపలను ఉత్పత్తి చేసి కనీసం 4 ఏళ్లపాటు పెంచి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన 30–40 గ్రాముల సైజు పిల్లలను హేచరీలకు ఇస్తుంటారు. హేచరీల్లో మరో మూడేళ్ల పాటు సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీడ్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 టన్నుల బ్రూడర్స్ ఉన్నాయి. ఏటా 100 లక్షల సీడ్ అవసరం కాగా.. 50 లక్షల సీడ్ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన బ్రూడర్స్ నుంచే ఉత్పత్తి చేస్తారు. అపోలో ఫిష్‌గా, ఫిష్ స్టాటర్స్గా ఉపయోగించే ఈ చేపకు స్టార్ హోటల్స్ నుంచి సాధారణ హోటల్స్ వరకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంగానే వీటికి అపోలో ఫిష్ అనే పేరొచ్చింది. పదేళ్లుగా ఇదే సాగు పదేళ్లుగా వంద ఎకరాల్లో పంగాసియస్ సాగు చేస్తున్నా. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి సాగులో ఏమాత్రం నష్టాలు ఉండవు. కేజీ, కేజీన్నర సైజులో చేపలు పట్టుబడి చేస్తా. ఎకరాకు 9నుంచి 12 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, గుడివాడ, కృష్ణా జిల్లా బ్రూడర్స్ ఉత్పత్తిలో.. పదేళ్లుగా పంగాసియస్ తల్లి చేపల(బ్రూడర్స్)ను ఉత్పత్తి చేస్తున్నాం. జన్యుపరమైన సమస్యలు లేకుండా వీటిని అభివృద్ధి చేసి హేచరీలకు ఇస్తున్నాం. వీటి సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2013లో 200 బ్రూడర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం 6వేల కిలోల బ్రూడర్స్ ఉన్నాయి. – బి.శేషగిరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాంతీయ మత్స్య పరిశోధనా కేంద్రం -
పంజరంలో.. 'పండుగ'ప్ప
‘మాకు చేపల వేటే జీవనాధారం. బోట్లు దెబ్బతినడంతో ఆక్వాసాగు చేపట్టాం. అదికూడా కలిసిరాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో గ్రామంలోని ఓ పది మంది ఎస్సీ, ఎస్టీ యువకులతో కలిసి సీఎంఎఫ్ఆర్ఐ దగ్గర శిక్షణపొంది కేజ్ కల్చర్ ప్రారంభించాం. నాలుగు కేజ్‌లలో రెండువేల పండుగప్ప పిల్లలు వేశాం. ఏడాది పాటు పెంచి సోమవారం పట్టుబడి పట్టాం. ఒక్కో చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు పెరిగింది. కిలో రూ.400 చొప్పున అమ్మితే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.3 లక్షలకు పైగా మిగిలింది’.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం పంచాయతీ ఏటిపవర పల్లెపాలేనికి చెందిన తిరుమాని బలరాం తన ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం సాగు (కేజ్ కల్చర్) నిరుద్యోగులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో చేపల సాగుకు పరిమితం కాకుండా సముద్ర, సహజ జలవనరులలో కేజ్ కల్చర్, మారీ కల్చర్‌ను (పారేనీటిలో వలలు కట్టి సాగుచేయడం) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కల్చర్ ఏపీలో విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతాల్లో విస్తరిస్తోంది. కేజ్ ఏర్పాటు ఇలా.. ► సముద్ర తీరంలో 6 మీటర్లు వెడల్పు, 4 మీటర్ల పొడవు విస్తీర్ణంలో కేజును ఏర్పాటుచేస్తారు. ► వీటిని తుప్పుపట్టని పైపులతో వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటుచేస్తారు. ► ఇవి నీటిలో తేలియాడేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చుతారు. ఇన్నర్, ఔటర్ నెట్లు ఏర్పాటుచేస్తారు. ఇన్నర్ వలలో సాగుచేపడతారు. ► పంజరం ఏర్పాటుచేసే స్థలంలో నీటి ఉష్ణోగ్రత 26–30 డిగ్రీల వరకు ఉండాలి. ► లోతు 7–10 మీటర్లు.. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి, గాలివేగం తక్కువగా ఉండాలి. ► కేజ్ కల్చర్‌లో తిలాఫియా, ఫంగసీస్, రెడ్ తిలాఫియా, రూప్‌చంద్,, కోబియా, పాంపినో, గ్రూపర్, పండుగప్ప వంటివి సాగుచేస్తున్నారు. పంజరం సాగుతో ప్రయోజనాలివీ.. ► భూమి అందుబాటులో లేనివారికి ఈ సాగు అనుకూలం. నిత్యం నీరు పారడంవల్ల చేపలకు వ్యాధులు సోకే అవకాశం తక్కువ. ► పదెకరాల్లో వచ్చే దిగుబడిని అర సెంటు విస్తీర్ణంలో కేజ్ పద్ధతిలో సాధించవచ్చు. ► యంత్రాలు, కూలీల ఖర్చు తగ్గుతుంది. కలుషిత నీటి బారి నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఒక్కో కేజ్ నుంచి రెండున్నర టన్నుల దిగుబడి సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో కృష్ణాజిల్లాలో ఏటిపవర పల్లెపాలం గ్రామంలోని ఉప్పుటేరుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది జూన్‌లో 585 మీటర్ల పరిమాణంగల ఒక్క పంజరంలో 100 గ్రా.సైజుగల 600 పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగాయి. సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మేఘరాజన్, ఇతర సాంకేతిక సిబ్బంది సమక్షంలో సోమవారం పట్టుబడి పట్టగా ఒక్కొక్క పంజరం నుండి సుమారు 600–700 కేజీల చొప్పున రెండున్నర టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఒక్కో పంజరంలోని చేపల అమ్మకం ద్వారా రూ.70వేల– రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. తక్కువ పెట్టుబడి రెట్టింపు ఆదాయం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. -
మురిపిస్తున్న 'కరిమీన్'
సాక్షి, అమరావతి: కేరళ ‘కరిమీన్’ చేప ఆంధ్ర తీరప్రాంత మత్స్యకారులను మురిపిస్తోంది. సాగుయోగ్యం కాని తీరప్రాంత భూముల్లో సిరులు కురిపించే ఈ చేపల సాగును మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో చేపట్టిన ఈ సాగు సత్ఫలితాలివ్వడంతో గోదావరి జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటి సాగుకు అవసరమైన సాంకేతికతను సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అందిస్తోంది. కేరళ రాష్ట్ర అధికారిక చేప పెరల్స్ పాట్.. (శాస్త్రీయ నామం–ఎట్రోప్లస్ సురాటెన్సిస్). ఒళ్లంతా ముత్యాల్లా తెల్లటి మచ్చలుండడంవల్ల దీన్ని ముత్యాల మచ్చగా పేరొందింది. కేరళ రాష్ట్ర అధికారిక చేపగా ప్రసిద్ధి చెందిన ఈ చేపను అక్కడ ‘కరిమీన్’గా పిలుస్తారు. మన వాడుక భాషలో ఈ చేపను ప్రాంతాన్ని బట్టి మురి మీను/చుక్కగొరక/దువ్వెన చేపని పిలుస్తుంటారు. మన ప్రాంతంలో పెద్దగా డిమాండ్‌లేని ఈ చేపకు కేరళలో మాత్రం మంచి మార్కెట్ ఉంది. అక్కడ స్టార్‌హోటళ్లు, రెస్టారెంట్ మెనూల్లో స్పెషల్ డిష్ ఇదే. స్థానికులే కాదు..అక్కడకొచ్చే విదేశీయులు ఈ చేపతో చేసే కరిమీన్ ఫ్రై, కరిమీన్ మోలీ, కరిమీన్ పొల్లిచాతు వంటకాలను అమితంగా ఇష్టపడతారు. ఈ చేపల సాగుకు సీజన్ అంటూ ఏమీలేదు. ఇది ప్రాథమికంగా ఉప్పునీటి చేప. కానీ, మంచినీరు, సముద్రపు నీటిలో జీవిస్తుంది. లోతు జలాల్లో దొరికే ఆల్గే మొక్కలు, కీటకాలను ఆహారంగా తీసుకునే ఈ చేప గరిష్టంగా 20 సెం.మీ వరకు పెరుగుతుంది. 150 గ్రాముల సైజు పెరిగితే చాలు కిలో రూ.325 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.600 వరకు కూడా విక్రయిస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కృష్ణాజిల్లా పెద్దపాలెంలో గిరిజన మత్స్యకారులు పట్టిన చేపలు ‘కృష్ణా’లో ప్రయోగం విజయవంతం ఐసీఎఆర్–సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ ప్రాంతీయ కేంద్రం సహకారంతో ఎలెర్ట్ ఎన్జీఓ అనే సంస్థ కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మురిమీను సాగు అద్భుత ఫలితాలిచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన యానాదులతో ఏర్పాటుచేసిన గ్రూపులకు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి చేపల సాగుకు శ్రీకారం చుట్టారు. 20 గ్రాముల పరిమాణం కలిగిన 5వేల చేప పిల్లలను అందించారు. పది నెలలపాటు సాగుచేయగా, ఒక్కో చేప సగటున 120 గ్రాముల పరిమాణంలో 510 కిలోల చేపలను శుక్రవారం పట్టుబడి చేశారు. కిలో రూ.225ల చొప్పున విక్రయించగా రూ.1.14లక్షల ఆదాయం ఆర్జించారు. పెట్టుబడి పోనూ రూ.60 వేలకు పైగా మిగలడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఈ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. నిరుపయోగంగా ఉన్న తీరప్రాంత భూముల్లో వీటి సాగును ప్రోత్సహించవచ్చు. చేపల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మనుగడ మాత్రం 83 శాతానికి పైగా ఉంటుంది. సీడ్ క్రీక్ వాటర్‌లో విరివిగా దొరుకుతుంది. కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ చేపల సాగుకు అనుకూలం. విత్తన సాంకేతిక సీఐబీఏ–చెన్నై, సీఎంఎఫ్ఆర్ఐ, కొచ్చిన్ వద్ద ఉంది. – డాక్టర్ శుభదీప్ ఘోష్, హెడ్, ఐసీఏఆర్–సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం -
చేపలు చూస్తే చవులూరుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: చేపల వినియోగంలో గ్రామాలే అగ్రస్థానంలో ఉన్నాయి. పట్టణ ప్రజల కంటే రెట్టింపుస్థాయిలో పల్లె ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేస్‌లైన్ సర్వే తేల్చింది. చేపలు తినే జనాభాను లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో తలసరి వినియోగం 7.88 కిలోలుంది. అందులో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తలసరి 9.66 కిలోలు తింటుండగా, పట్టణ ప్రజలు 4.88 కిలోలే తింటున్నారని వెల్లడైంది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సిఫారసుల ప్రకారం తలసరి చేపల వినియోగం 12 కిలోలు ఉండాలి. దాని ప్రకారం చూస్తే రాష్ట్రంలో మాత్రం చేపల వినియోగం తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక మత్స్య పథకాల కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. చేపల ఉత్పత్తి పెరుగుదలలో మార్పు వస్తుందని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పట్టణ ప్రజలకు చేపలు సరిపడా అందుబాటులో ఉండటంలేదన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా చేపల వినియోగం సగమే ఉంది. మూడేళ్లలో పెరిగిన చేపల ఉత్పత్తి... ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉచిత చేపపిల్లల పంపిణీ వల్ల పరిస్థితి మెరుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2017– 18లో 11,068 జలాశయాలు, చెరువులు, ఇతర జలవనరుల్లో 51.01 కోట్ల చేపపిల్ల లను ఉచితంగా విడుదల చేసింది. 2018–19లో 10,786 జలవనరుల్లో 49.15 కోట్ల చేపపిల్లలను విడుదల చేసింది. మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు అందజేసింది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. 2016–17లో 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా 2017– 18లో 2.62 లక్షల టన్నులకు పెరిగింది. 2018–19లో 2.40 లక్షల టన్నుల ఉత్పత్తి జరి గింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి కొన్నిచోట్ల చేపపిల్లలను కూడా విడుదల చేయలేని పరిస్థితులుండటంతో ఈ ఏడాది ఉత్పత్తి కాస్తంత తగ్గిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో చేపలు తినేవారు 90% తెలంగాణ ప్రజలు మాంసప్రియులు. జాతీయ స్థాయిలో 71% మంది మాంసప్రియులైతే, తెలంగాణలోనే 98.7% మాంసం, చేపలు తింటారు. పశ్చిమ బెంగాల్లో 98.55 %, ఏపీలో 98.25%, ఒడిషా 97.35%, కేరళ 97% ప్రజలు మాంసం, చేపలు తింటారు. రాష్ట్రంలో చేపలు తినేవారు 90% మంది ఉంటారని మత్స్యశాఖ నిర్ధారించింది. జాతీయ తలసరి ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఇంకా 30% అదనంగా చేపలు అందుబాటులోకి రావాల్సి ఉంది. బేస్‌లైన్ సిఫారసులు.. - యువతను ఈ రంగంవైపు తీసుకొని రావాలి. వారిని ఫోకస్డ్ యాక్టివిటీ గ్రూప్‌లుగా తయారు చేయాలి. - చేపల ఉత్పత్తిపై మత్స్యకారుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. - చేపల రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించాలి. చేపల ఉత్పత్తి మొదలు మార్కెటింగ్, రిటైల్ వరకు ఉన్న అవకాశాలపై అవగాహన, శిక్షణ ఇవ్వాలి. - రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిపై యువతకు శిక్షణ ఇవ్వాలి. వివిధ పథకాలను రూపొం దించాలి. మార్కెట్ లింకేజీ కల్పించాలి. చేప అనుబంధ ఉత్పత్తులు తయారు చేయాలి. - నేరుగా వినియోగదారుల ఇష్టాయిష్టాలను బట్టి చేప అనుబంధ ఉత్పత్తుల తయారీలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి. - నాబార్డు సాయంతో ఆర్థిక సాయం అందించాలి. - పెట్టుబడులు పెట్టేలా ‘ప్రైవేటు’ను ప్రోత్సహించాలి. -
ఊపిరి సేవ
నేను నా దైవం దేవుడికి ఎన్నో సేవలు ఉంటాయి. సుప్రభాత సేవ... తోమాల సేవ ఆరగింపు సేవ... ఊంజల్ సేవ ఏకాంత సేవ... పవళింపు సేవ. మరి మనిషికి సేవ అవసరం అయితే? ఊపిరి సలపలేనంత కష్టం వస్తే? చెయ్యాల్సింది.. ఊపిరి సేవ. రేపు బత్తినివారి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ప్రసాద వితరణకు ప్రతిసారీ బత్తిని సోదరులలో ఒకరైన హరినాథ్‌గౌడ్ ముందుంటారు. ‘నేను, నా దైవం’ గురించి హరినాథ్ ఏమని చెబుతారు? చేప ప్రసాదమే దైవం అని చెబుతారేమో అనుకుంటూ ఈ విషయమై ఆయన్ని కలుసుకోవడానికి హైదరాబాద్, కవాడిగూడలోని వారి నివాసానికి వెళ్లాం. ఇంటి ముందు గోడకు ‘చేప’ బొమ్మ కనిపించింది. లోపలికి వెళ్లేసరికి హరినాథ్ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. చేతిలో చేప ఆకారంలో ఉన్న పెన్ను, మెడలో చేప బొమ్మ ఉన్న గొలుసు, ఇంట్లో షోకేసులో చేప బొమ్మలు... గమనిస్తూ ఉండిపోయాం. ఫోన్ తర్వాత సంభాషణ మొదలైంది. ‘చేప మందు’ పంపిణీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టున్నారు? మందు కాదు, ‘ప్రసాదం’ అనండి. ఎందుకంటే మేం దీనిని దైవ ప్రసాదంగా భావిస్తాం. ఔషధాన్ని ‘ప్రసాదం’ అంటున్నారంటే మీలో దైవభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది? చాలా! ఇది ఇప్పటిది కాదు మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భక్తి పరంపర. ఎవరిని మీరు భక్తిగా పూజించేది? మా ముత్తాత నుంచి మేమంతా శివుణ్ని ఆరాధిస్తుంటాం. మా తండ్రి అయితే, రోజూ మూడు– నాలుగు గంటల సేపు పూజ చేసేవాడు. మా ఇల్లు శివయ్య పాటలు, భజనలతో మార్మోగేది. ఆయన పూజ ముగించుకొని బయటకు వచ్చినప్పుడు ఆ కైలాసనాథుడు శివయ్యలాగే కనిపించేవాడు. దైవం అంటే నా చిన్నప్పటి సంఘటన ఒకటి ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఒక పార్సీ మహిళ ‘చేప ప్రసాదం’ కోసం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. కాసేపటికి మా తండ్రి పూజ ముగించి బయటకు వచ్చాడు. ఆమె, మా తండ్రి పాదాలకు నమస్కరించబోయింది. మా తండ్రిగారు అడ్డుకుని ‘మహిళ ఎవరి పాదాలకూ నమస్కరించకూడదమ్మా!’ అన్నారు. ఆమె కళ్లనీళ్లతో ‘మీలో దైవశక్తికి నమస్కరిస్తున్నాను’ అంది. బత్తిని సోదరులందరికీ ఈ దైవభక్తి ఉందా? అందరూ శివారాధకులే! మేం ఐదుగురు అన్నదమ్ములం, నలుగురు అక్కచెల్లెళ్లు. మరో మూడేళ్లకు నాకు 80 ఏళ్లు నిండుతాయి. ఐదుగురు అన్నదమ్ముల్లో ఇప్పుడు నేను, మా అన్న ఇద్దరం మిగిలాం. అంతా హైదరాబాద్‌లోనే ఉన్నాం! మా పెద్దన్న కుటుంబం దూద్‌బౌలిలో, రెండో అన్న వనస్థలిపురంలో, మరో ఇద్దరు కూకట్‌పల్లిలో, నేను కవాడీగూడలో ఉంటున్నాం. అన్ని కుటుంబాల వాళ్లం యేటా మృగశిరకార్తె ముందురోజున జరిగే పూజలో కలుసుకుంటాం. మృగశిరకార్తె ముందురోజునే ఎందుకు, ఏమిటా పూజ? మా ఐదు కుటుంబాలలోని కొడుకులు, కోడళ్లలో ఎవరికి వీలైతే వాళ్లు రెండు– మూడు నెలల ముందుగానే హిమాలయాలు, రిషీకేష్... వంటి కొన్ని ప్రాంతాల నుంచి వనమూలికలను సేకరించి తెస్తారు. మా పూర్వికులు ఉన్న దూద్‌బౌలీలోని ఇంట్లో సత్యనారాయణవత్రం జరుపుకుంటాం. మా అమ్మ, నాన్నల సమాధుల వద్ద పూజలు చేస్తాం. మరుసటి రోజు ఉదయం మృగశిరకార్తె ప్రవేశించే సమయంలో ప్రసాదాన్ని సిద్ధం చేస్తాం. దేవుడి దగ్గర పెట్టి, కుటుంబ సభ్యులంతా ఆ ‘ప్రసాదం’ తీసుకొని అందరికీ పంచడానికి సిద్ధమైపోతాం. దేవుని ప్రసాదం అంటున్నారు. చేపతో ఇవ్వడం ఏంటి? ఈ ‘ప్రసాదం’ తయారీ ఎవరు నేర్పారు? హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని మా ముత్తాత వీరన్న గౌడ్‌కు పరిచయం అయ్యాడు. ఆరోగ్యం కోసం మందు ఇవ్వమన్నప్పుడు ఆ ముని వనమూలికలతో తయారుచేసిన ప్రసాదాన్ని ఇచ్చాడు. ఆ రోజు మృగశిర కార్తె. ఆ రోజే ఆ ప్రసాదాన్ని ఎలా తయారుచేసుకోవాలి, చేపతో ఎలా వేసుకోవాలో కూడా చెప్పాడు. ఆ ముని చెప్పినవిధంగా ఔషధాన్ని తయారుచేసి కుటుంబంలో అందరికీ, చుట్టుపక్కల వారికీ ఇచ్చాడు. అలా 172 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సేవ ఇప్పటికీ కొనసాగుతుండటం ఆ దైవ నిర్ణయంగా భావిస్తాం. శైవులు అంటున్నారు. మత్స్యం విష్ణు అవతారం కదా! శివకేశవులకు భేదం లేదు. దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. నా పేరులోనే ‘హరి’ ఉన్నాడుగా! మత్సా్యవతారంగా వచ్చినవాడు దేవుడే. ఊపిరిని పోస్తూ మత్స్య రూపంలో ఆ దేవుడే ఉబ్బసం సమస్యను తగ్గిస్తున్నాడు. చేపతోనే ప్రసాదం. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి? వారికి బెల్లంతో ‘ప్రసాదం’ వేస్తాం. ఇది కూడా ఆ ముని చెప్పినదే! ప్రసాదం ఇచ్చిన ముని మీ కుటుంబంలో ఎవరికైనా కలలోకి వస్తుంటారా? నా కలలోకే వచ్చారు. ప్రజలకు ఊపిరి సమస్య రాకుండా ఈ ‘సేవ’ను ఇలాగే కొనసాగించమని, తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. మీ దైవప్రసాదం మీద చాలా మందికి ‘అపనమ్మకం’ ఉంది? చాలా మందుల కంపెనీలు ఈ ఫార్ములా చెప్పమని అడిగాయి. మేం కాదన్నాం. ‘ఆ దేవుడి దయ వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. మాకు డబ్బులొద్దు’ అని చెప్పాం. దీంతో వాళ్లు ఈ ‘ప్రసాదం’ మీద చెడు ప్రచారం చేశారు. అయినా, మేం గట్టిగానే పోరాటం చేశాం. ఈ పోరాటం కష్టం అనిపించలేదా? ఏమని దైవానికి మొరపెట్టకున్నారు? దైవాన్ని తప్పు పడుతుంటే బాధతో కన్నీళ్లు వచ్చేవి. మేం చేస్తున్న దానికి ఎవరి నుంచి ఒక్క పైసా ఆశించలేదు. మా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రజలకు ఈ రూపంలో మేం చేసుకునే ‘సేవ’ఇది. దైవమిచ్చింది, దైవమే చూసుకుంటుంది అనుకున్నా. మీరు చెప్పకపోతే మీ కుటుంబంలో ఎవరి ద్వారా అయినా ఈ ‘ఫార్ములా’ ఎవరైనా తీసుకోవచ్చు కదా? ఇది దైవం మాకు ఇచ్చిన వరం. దీనిని వేరే ఇంటికి వెళ్లనివ్వం. కేవలం కొడుకులు, కోడళ్లకు మాత్రమే తెలుసు. ఆడపిల్లకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తాం. అందుకని వాళ్లకీ చెప్పం. అందరం అంత దీక్షగా ఉంటాం. దైవ వరంగా వచ్చిన ఈ ‘ప్రసాదం’ ఉబ్బసం వ్యాధికేనా! మిగతా జబ్బులకు కూడానా? ఎన్నో చిన్నపెద్దా జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్తమా సమస్యసు నివారిస్తుంది. అయితే, వరుసగా నాలుగైదేళ్లు ఈ ప్రసాదం తీసుకుంటూ పథ్యం పాటిస్తేనే! అసలు పథ్యమేమీ పాటించకపోయినా 20 శాతం సమస్య తగ్గిపోతుంది. మీ భక్తి, ప్రసాదం గురించి చాలా చెప్పారు. అసలు దేవుడు ఉన్నాడంటారా? దూద్‌బౌలిలో మా పూర్వికుల ఇల్లు బాగా పాతది, కూలిపోయింది. కానీ, ఆ ఇంట్లో పూజగది అలాగే ఉండిపోయింది. ఆ ఇంట్లో సన్నటి బావి ఉంది. ఆ బావిలో ఎంత కరువొచ్చినా ఇప్పటికీ నీళ్లు ఉంటాయి. ఈ రెండూ నాకు ఎప్పుడూ అద్భుతం అనిపిస్తాయి. దైవశక్తి అక్కడే ఉందని మా కుటుంబం అంతా నమ్ముతాం. ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో ఎన్నో చూశాను. దైవశక్తి ఈ లోకాన్ని పాలిస్తుంది. మా కుటుంబాన్ని మెచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించింది ఆ శక్తే. ఎవరో ముని ఇచ్చిన ఫార్ములాతో మీరు పాప్యులర్ అయ్యారు కదా! మరి ఈ ప్రసాదం పంపిణీ జరిగే చోట ఆ ముని ఊహాచిత్రమైనా పెట్టరు ఎందుకు? మా తల్లిదండ్రులను గురువులుగా భావించి వాళ్లు చెప్పిందే పాటిస్తున్నాం. అందుకే ఊహా చిత్రాలేవీ పెట్టడం లేదు. శివభక్తులు కదా! శైవక్షేత్రాలకు వెళుతుంటారా? కాలు బాగున్నప్పడు కేదార్నాథ్, బదరీనాథ్ వంటి తీర్థయాత్రలన్నీ చేశాను. మీలో శక్తి తగ్గినప్పుడు రీఛార్జ్ కావడానికి ఏం చేస్తారు? ఆ శివయ్యను తలుచుకుంటాను. కళ్లు మూసుకొని ఆయన రూపం దర్శించుకుంటాను. ఏదో శక్తి ఒంట్లో ప్రవహించినట్టుగా ఉంటుంది. మీ ప్రసాదం దేవుణ్ణి నమ్మేవాళ్లకే పనిచేస్తుందా? నమ్మనివారికి పనిచేయదా? ఎవరికైనా పనిచేస్తుంది. ఈ ప్రసాదం కేవలం హిందువులకేనా? కులం, మతం లేదు. ఈ ప్రసాదాన్ని అందరూ వేయించుకుంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. వైద్యులెవరైనా మీ ‘ప్రసాదం’ కోసం వచ్చారా? ఢిల్లీలో డాక్టర్ ఆనంద్గారింటికి వెళ్ళినప్పుడు ఆయాసపడుతూ పడుకున్న వారి అమ్మగారిని చూశాను. ఊపిరి అందక చాలా బాధపడుతున్నారు. ప్రసాదం విషయం చెప్పి తీసుకురమ్మన్నాను. వాళ్లు వరుసగా మూడేళ్లపాటు వచ్చి ప్రసాదం తీసుకున్నారు. ఆరోగ్యం బాగైంది. ఇప్పటికీ వాళ్లు ఫోన్ చేస్తుంటారు. మీరు కాలు ఎలా కోల్పోయారు? ఏదైనా ప్రమాదం జరిగిందా? మాకు వంశపారంపర్యంగా మధుమేహం ఉంది. నాకు 43 ఏళ్ల వయసులో వచ్చింది. మొన్న పుష్కరాలకు వెళ్లినప్పుడు కాలి పగుళ్లలో ఇసుక చేరి, ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను అది గమనించలేదు. ఇన్ఫెక్షన్ పెరగడంతో ముందు రెండుసార్లు ఆపరేషన్ చేసి కొంత తీసారు. అయినా ఇన్ఫెక్షన్ దగ్గలేదు. దీంతో కాలు తీసేయకతప్పలేదు. మీరు మీ చిన్నప్పటి నుంచి ఈ ‘ప్రసాదాన్ని’ తీసుకుంటున్నారు. అయినా, చక్కెరవ్యాధి రాకుండా ఆగలేదు. పెద్దాసుపత్రులకే వెళ్లాల్సి వచ్చింది? కొన్నింటిని అడ్డుకోవచ్చు. షుగర్ వ్యాధి వంటివాటిని అడ్డుకోలేం. పెద్ద ఆపరేషన్ కదా! కాలు తీసేసే పరిస్థితిలో భయం వేయలేదా? ఏంటీ జీవితం భగవంతుడా అని దేవుణ్ణి ప్రార్థించారా? ముందు భయపడ్డాను. ఒక్కకాలితో ఎలా? అనుకున్నాను. కానీ, తప్పదు. లేదంటే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. పిల్లలు ధైర్యం చెప్పారు. కృత్రిమ కాలు వాడచ్చు అన్నారు. దేవుడి మీదే భారం వేశాను. ఆపరేషన్ అయింది. కృత్రిమ కాలితో ఇప్పుడు బాగా నడుస్తున్నాను. రాపిడితో చిన్న పుండు అయ్యింది. అందుకే ‘ఈ కాలు’(కృత్రిమ)ను పక్కన పెట్టాను. తగ్గిపోతుంది. ఏం జరిగినా ప్రసాదం వితరణ మాత్రం ఆగదు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి