Fishing industry
-
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేట విరామానికి వేళాయె..
మచిలీపట్నం: సముద్రంలో చేపల వేటకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సాగర గర్భంలో చేపలు పునరుత్పత్తి సమృద్ధిగా జరిగే సీజన్ ఇదే కావడంతో ఈ ఏడాదీ వేట నిషేధం అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు 61రోజుల పాటు వేట నిషేధ కాలంగా మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలుకుని తిరుపతి జిల్లా వరకు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో 1.60 లక్షల మంది మత్స్యకారులకు చేపల వేట వృత్తి కాగా, వీరి ద్వారా 6 లక్షల మంది జీవనోపాధికి సముద్రం భరోసాగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన 30,107 మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ద్వారా సముద్రంపై చేపల వేట సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధ కాలంలో జీవనభృతి.. వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సకాలంలో ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా మత్స్యకారుల చేతికి వెళ్లకుండానే దళారులు మింగేసేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ జీవనభృతిని రూ.10 వేలుకు పెంచటమే కాక, డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తూ పారదర్శకత చాటుకున్నారు. రాష్ట్రంలో గతేడాది అర్హత గల వారు 97,619 మంది ఉండగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.97.61 కోట్లును మత్స్యకారులకు భరోసాగా అందజేశారు. అర్హుల జాబితా తయారీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేట నిషేధ భృతి పొందాలంటే తప్పనిసరిగా బోటు రిజిస్ట్రేషన్ చేసుకుని.. మత్స్యకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 18 నుంచి 60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. సోనా బోట్లకు 8 మంది, మోటార్ బోట్లకు ఆరుగురు, ఇంజిన్ తెప్పలకు ముగ్గురు మాత్రమే అర్హులు. ఇక జాబితాలో పేరులేని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో వలంటీర్ ద్వారా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించాలి. సంప్రదాయ పడవలకు అవకాశం సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు సముద్రం తీరానికి 8 కిలోమీటర్లలోపు, అనుమతించిన సైజు వలలతో చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసమని మత్స్యకారులు తగిన ఆధారాలతో అధికారులు నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా తీర ప్రాంత పోలీసులు (మెరైన్), తీర ప్రాంత గస్తీ సిబ్బంది (కోస్ట్‌గార్డ్) చర్యలు తీసుకుంటున్నారు. నిషేధం పక్కాగా అమలు ఈ నెల 15 నుంచి సముద్రంపై మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేట నిషేధం పక్కాగా అమలుచేసేలా దృష్టిసారించాం. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే బోటు యజమానులపై చర్యలు తీసుకుంటాం. నిషేధ కాలపు భృతికి అర్హులైన వారందరికీ మంజూరు చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – లాల్ మహమ్మద్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా -
‘మత్స్య సంపద’కు 20 వేల కోట్లు
న్యూఢిల్లీ: మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి ద్వారా నీలి విప్లవం సాధించేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)’కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర వాటా రూ. 9,407 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 5763 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల పాటు అమలు చేస్తారు. 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం, మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం, చేపల ఉత్పత్తిని 2024–25 నాటికి 2.2 కోట్ల టన్నులకు పెంచడం ఈ పథకం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం మత్స్య రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్(సీఎస్), సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్). సీఎస్‌లో మొత్తం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తుంది. కేబినెట్ ఆమోదించిన ఇతర నిర్ణయాలు.. ► వృద్ధులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎంవీవీవై)’ను మరో మూడేళ్ల పాటు(2023 మార్చ్ 31వరకు) పొడగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వృద్ధులకు కనీస పెన్షన్ కచ్చితంగా లభించే ఈ పథకాన్ని ఎల్ఐసీ ద్వారా అమలు చేస్తున్నారు. 2020–21 సంవత్సరానికి రేట్ ఆఫ్ రిటర్న్‌ను 7.4 శాతానికి తగ్గించారు. గత సంవత్సరం ఇది 8 శాతంగా ఉంది. 2017–18 బడ్జెట్లో మొదట ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ► రెండు నెలల పాటు సుమారు 8 కోట్ల మంది వలస కూలీలకు కేంద్రం వాటా నుంచి నెలకు 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రూ. 2982.27 కోట్లను ఫుడ్ సబ్సీడీ కింద, రూ. 127.25 కోట్లను రవాణా, ఇతర ఖర్చుల కింద కేటాయించారు. -
మత్స్యకారులను ఆదుకుంటాం
నిజాంసాగర్: ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల మత్స్య పరిశ్రమ, హార్టికల్చర్ శాఖలు కనుమరుగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రాంత పెత్తందార్ల వల్ల ఆ రెండు శాఖలు కళావిహీనంగా మారాయని ఆరోపించారు. మత్య్సశాఖతో పాటు హార్టికల్చర్ శాఖలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సోమవారం మండ లంలోని అచ్చంపేట మత్య్సబీజక్షేత్రాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు సందర్శిం చారు. చేప పిల్లల విత్తనోత్పతి లేక బోసిపోయిన నర్సరీలను చూసి మత్య్సశాఖ పని తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కార్మికుల సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆంధ్రా వ్యాపారులు రోయ్యల పెంపకం చేపట్టడంతో చేప పిల్లలు ఉత్పత్తి తగ్గింద న్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి 1,680 కుటుంబాలు జీవ నం సాగిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులో చేపపిల్లల పెంపకానికి తగిన ప్రాధాన్యత కల్పించి మత్స్యకార్మిక కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏడాదికి 30 వేల కోట్ల వ్యాపారం మత్య్సపరిశ్రమను ప్రభుత్వం వ్యవసాయానికి అనుసంధానం చేసిందన్నారు. హైదరాబాద్‌లో 20 శాతం చేపల వ్యాపారం తెలంగాణ, 80 శాతం ఆంధ్రా వ్యాపారం సాగుతోందన్నారు. దీంతో ఏడాదికి * 30 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. మత్స్యపరిశ్రమను పురోగతి దిశగా తీసుకు వెళ్లేందుకు కోసం ఆగస్టు 2న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. హార్టికల్చర్ శాఖపై ఆగస్టు ఒకటిన హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి రైతు లకు హార్టికల్చర్ సామాగ్రిని సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 25 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అసరం ఉండగా, ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినయ్‌కుమార్, శ్రీహరి, ఎన్డీసీసీ బ్యాంకు డెరైక్టర్ నామాల శంకర్, మత్య్సశాఖ అధికారులు రాములు పాల్గొన్నారు.