five star hotels
-
ఆంధ్రప్రదేశ్ టూరిజం.. ‘స్టార్’డమ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్లు, ఓపెన్ లాన్లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు. నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి. రాయితీలు ఇలా.. పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు. పెట్టుబడిదారులకు సులభంగా.. సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
మారుతున్న ‘5 స్టార్’ రుచులు
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్డౌన్లు స్టార్ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్డౌన్లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్ (దశ) వచ్చి పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫీల్ మెనూ ఐటీసీ హోటల్స్ కూడా ఇదే విధంగా ‘ఫీల్మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్ కార్పొరేట్ చెఫ్ మనీషా బాసిన్ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్లైన్ హోమ్ డెలివరీ బ్రాండ్ గోర్మెట్కచ్తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్ బ్రాండ్ హోటళ్లను కలిగిన ఇండియన్ హోటల్ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యుమిన్పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్ హోటల్ ‘క్యుమిన్’ కమర్షియల్ డైరెక్టర్ జహంగీర్ తెలిపారు. ఒబెరాయ్ సైతం..: ఒబెరాయ్ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్ గ్రూపు హోటళ్లు ఆఫర్ చేస్తున్నాయి. మూడ్ డైట్స్... మారియట్ ఇంటర్నేషనల్ ‘మూడ్ డైట్స్’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ‘మారియట్ ఆన్ వీల్స్’ బ్రాండ్ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్ డైట్స్‌ను సైతం మారియట్ ఆన్ వీల్స్ వేదికగా అందించనుంది. ‘‘డార్క్ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్ఇంటర్నేషనల్ కలినరీ డైరెక్టర్ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. -
5 స్టార్ ఇళ్లొచ్చేశాయ్!
ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఎంట్రెన్స్ నుంచే హుందాతనం ఉట్టిపడే ద్వారం. ఇన్ఫినిటీ పూల్, అత్యాధునిక జిమ్, అతిథి గదులు వంటి వసతులే కాకుండా మనసును ఆహ్లాదపరిచే మ్యూజిక్, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యకరమైన ఏర్పాట్లూ ఉంటాయ్. ఈ వసతులన్నీ సొంతింట్లోనూ ఉంటే? మీ ఇంటి అడ్రస్సే ల్యాండ్‌మార్క్‌లా నిలిచేలా ఉంటే? ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె నగరాలకే పరిమితమైన థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు హైదరాబాద్‌కూ వచ్చేశాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు, ఎగువ ఆదాయ వర్గాలను రా..రమ్మంటున్నాయ్! సాక్షి, హైదరాబాద్: గత దశాబ్ధ కాలంగా గృహ కొనుగోలుదారుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. విదేశాల్లోని గృహాలు, హోటళ్లు, రిసార్ట్‌లోని వసతులను చూసి అలాంటి వసతులు స్థానికంగా తాముండే ఇళ్లలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి. చాలా మంది కిడ్స్, ఫిట్నెస్, స్పోర్ట్స్, డిస్నీ థీమ్ వంటి ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఆర్కిటెక్చర్ డిజైన్స్‌తో నిర్మాణాలను చేపడుతున్నారు. థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ప్రాజెక్ట్లున్న ప్రాంతం అభివృద్ధికి నిదర్శనంగా.. నగరానికే తలమానికంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహమక్కర్లేదు. ప్రాజెక్ట్‌తో సెల్ఫీ.. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే థీమ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి పెట్టుబడి కూడా కొంత ఎక్కువే అవసరం. అందుకే ఇళ్ల ధరలు కూడా కొంత ఎక్కువే ఉంటాయి. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లు అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి. కొత్త తరహా ప్రాజెక్ట్‌లు, వసతులున్న ప్రాజెక్ట్‌లను చూసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రోడ్డు మీద నుంచి అటువైపుగా వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ప్రాజెక్ట్ వైపు చూస్తున్నారని.. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా కిస్మత్పూర్ మీదుగా వెళ్లిన సినీ నటి జయసుధ అవిఘ్న ప్రాజెక్ట్ ఎలివేషన్ చూసి ఆశ్చర్యపోయి.. లోపలికి వచ్చి ప్రాజెక్ట్ మొత్తం కలియతిరిగారని’’ స్థానికులు తెలిపారు. కొనుగోలుదారులేమంటున్నారంటే? మరి, థీమ్ ప్రాజెక్ట్‌లలో ఫ్లాట్లను కొనుగోలు చేసే కస్టమర్ల స్పందన ఎలా ఉందంటే.. ‘‘రెండేళ్ల క్రితం ఓ హోటల్లో జరిగిన సాక్షి ప్రాపర్టీ షోలో గిరిధారి స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అవిఘ్న ప్రాజెక్ట్‌ను ప్రదర్శనలో చూసి నా భార్యకు ఎలివేషన్ బాగా నచ్చింది. అంతే రెండేళ్ల క్రితం ఫ్లాట్‌ను బుక్ చేశాం. ఇప్పుడు సొంతింట్లో ఆనందంగా ఉంటున్నాం. హైదరాబాద్‌లో ఎవరి ఇంటికీ లేని ఎలివేషన్ మా ప్రాజెక్ట్కుందని గర్వంగా చెప్పుకుంటున్నామని’’ రవితేజ చెప్పారు. ఇన్ఫిటిపూల్ చిన్నపిల్లల్నే కాదు మా లాంటి వాళ్లను కూడా అమితంగా ఆకర్షిస్తోంది. అవిఘ్నలోని పూల్ చూశాక నా మనవళ్లతో పాటూ నేనూ 45 ఏళ్ల తర్వాత స్విమ్మింగ్ చేశా. గిరిధారి ప్రాజెక్ట్లల్లో కొనుగోలుదారులు మూడోతరం వాళ్లూ ఉన్నారని చెప్పడానికి నేనే సాక్షినని’’ ప్రసాద్ తెలిపారు. విదేశీ ఆర్కిటెక్చర్లు, నిపుణులు.. గిరిధారి హోమ్స్, సుచిరిండియా, ప్రెస్టీజ్ వంటి నిర్మాణ సంస్థలు నగరంలో పలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో తొలి థీమ్ ఆధారిత ప్రాజెక్ట్ అవిఘ్నను పూర్తి చేసిన ఘనతను సొంతం చేసుకుంది గిరిధారి. థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చెందే ప్రాంతంలో, విశాలమైన విస్తీర్ణంలో, వినూత్నమైన ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఉంటాయి. వీటి ఎలివేషన్స్, వసతుల ఏర్పాట్ల కోసం విదేశీ ఆర్కిటెక్చర్లు, నిపుణుల అవసరముంటుంది. కిస్మత్పూర్లో గిరిధారి నిర్మించిన అవిఘ్న ప్రాజెక్ట్ పడవ ఆకారంలో నిర్మించిన క్లబ్ హౌజ్ ఎలివేషన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన ట్రిపోలీ స్టూడియో అభివృద్ధి చేసింది. ఇక, ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన లైట్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ప్యాలెస్ లాంటి ప్రాజెక్ట్‌లు.. ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్ గృహ నిర్మాణాల్లోనూ మొదలయ్యాయి. మానసిక చైతన్యం, ప్రేరణను కలిగించడమే సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఇందుకోసం ప్రాజెక్ట్లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మలు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటే మన మెదడు పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కిస్మిత్పూర్లో గిరిధారి 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర, హకీంపేట్ రోడ్‌లోని తూమ్కుంటలో సుచిరిండియా 86 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఆర్యవర్తనగరి ఇలాంటి ప్రాజెక్ట్‌లనే ప్రారంభించాయి. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్ ఆర్ట్) చిత్రీకరిస్తారు. దీంతో నివాసితులకు ప్యాలెస్ తరహా వాతావరణం కలుగుతుంది. 45 అడుగుల ఎత్తులో స్విమ్మింగ్ పూల్.. వినూత్న కాన్సెప్ట్‌లతో ప్రాజెక్ట్‌లను నిర్మించే గిరిధారి హోమ్స్.. హైదరాబాద్‌లో తొలి థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. అప్పా జంక్షన్‌లోని కిస్మత్పూర్లో ఎకరం ముప్పయి గుంటల్లో అవిఘ్న ప్రాజెక్ట్‌ను నిర్మించింది. మొత్తం 132 ఫ్లాట్లు.. 1,100 నుంచి 1,650 చ.అ.ల్లో విస్తీర్ణాలున్నాయి. సింగపూర్‌లో 50 అంతస్తు ఎత్తులో నిర్మించిన మెరీన్ బే సాండ్ ప్రాజెక్ట్‌ను ఆదర్శంగా తీసుకొని అవిఘ్న ప్రాజెక్ట్‌ను నిర్మించామని తెలిపారు. 55 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తులో ఇన్ఫినిటీ పూల్‌ను ఏర్పాటు చేశామని.. సింగపూర్ లాంటి అనుభూతి నగరవాసులకు కల్పించాలనేది లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేశామన్నారు. ♦ 10 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్‌తో పాటూ జిమ్, ఇండోర్ గేమ్స్, బాంక్విట్ హాల్, కాఫీ షాప్, లైబ్రరీ, ప్లే స్కూల్, సూపర్ మార్కెట్, సెలూన్, గెస్ట్ రూమ్స్, పార్టీ ఏరియా వంటి వసతి ఏర్పాట్లున్నాయి. ప్రాజెక్ట్ మధ్యలో నుంచి చిన్నపాటి సరస్సు పారుతున్నట్లు వాటర్ క్రీక్‌ను ఏర్పాటు చేశారు. 300 అడుగుల పొడవుండే ఈ క్రీక్ నిత్యం నీటి ప్రవాహంతో శబ్ధం చేస్తుంటే మనస్సు ఆహ్లాదకరంగా మారుతుందని స్థానిక కొనుగోలుదారులు చెబుతున్నారు. – ఇంద్రసేనా రెడ్డి. సీఎండీ, గిరిధారి హోమ్స్ -
కేటుగాడు ఎక్కడ?
ఫైవ్ స్టార్ హోటళ్లలో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న ‘సూటు..బూటు’ దొంగ జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లోని ఓ రూమ్‌లోకి ప్రవేశించి చాకచక్యంగా రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. ముంబైతోపాటు ఇతర నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించి ఆరా తీస్తున్నారు. బంజారాహిల్స్: అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే అతిథుల గదులను లక్ష్యంగా చేసుకొని వారు లేని సమయంలో దర్జాగా సూటు, బూటు వేసుకొని హోటల్లోకి ప్రవేశిస్తూ ఆభరణాలతో ఉడాయిస్తున్న జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్(43) ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో హిమాయత్‌నగర్‌కు చెందిన వెంకట్ కోనారావు, రిషిక దంపతులు బస చేసిన రూమ్ నంబర్ 312లో వారు డిన్నర్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు హోటల్ సిబ్బందిని మాటల్లోకి దింపి, లిఫ్ట్‌బాయ్ దృష్టిమరల్చి దర్జాగా గదిలోకి వెళ్లి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో అంతే దర్జాగా ఉడాయించి పోలీసులకు సవాల్ విసిరాడు. బంజారాíßల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. నవదంపతులే టార్గెట్ ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసించే జయేష్ ఎంత దర్జాగా వస్తాడో అంతే దర్జాగా నగలతో ఉడాయిస్తూ కేవలం సీసీ కెమెరాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. పార్క్‌హయత్ హోటల్లో దొంగతనం చేసిన అనంతరం ఆకుపచ్చ రంగు ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడి నుంచి నేరుగా మాసబ్‌ట్యాంక్ వద్ద గోల్కొండ హోటల్‌వైపు ఆటో వెళ్లే విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒక చిన్నహోటల్లో బస చేస్తూ బోగస్ ధృవపత్రాలు సమర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాను దొంగతనం చేసే హోటల్‌కు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో వచ్చి కస్టమర్ల కదలికలను గుర్తిస్తుంటాడని కొత్తగా పెళ్లైన వారిని లక్ష్యంగా చేసుకుంటాడని విచారణలో తేలింది. రోజంతా వారి కదలికలపై నిఘా వేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని ఆ తర్వాతే హోటల్లోకి ప్రవేశిస్తారని కూడా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎస్ఆర్నగర్ డిఐ కిషోర్, జూబ్లీహిల్స్ డీఎస్ఐ శ్రీను రెండు రోజులుగా ముంబయిని జల్లెడపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇక మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలు న్యూఢిల్లీ, చండీఘడ్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో గాలింపు చేపట్టాయి. నిందితుడి ఆచూకీ కోసం మొత్తం 42 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ♦ 2016 డిసెంబర్ 6వ తేదీన అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్లోకి కూడా ఇదే తరహాలో ప్రవేశించి రూ. 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పూన్‌తో ఇక్కడ గదిని తెరిచినట్లు వెల్లడైంది. ♦ 2014లో ఆబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్లో ప్రముఖ వ్యాపారి నారాయణదాస్ మారు నిర్మలాదేవి బస చేసిన గదిలోకి ప్రవేశించి రూ. 7 లక్షల విలువచేసే ఆభరణాలు తస్కరించగా ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో రెండుసార్లు ప్రవేశించి ఆభరణాలతో ఉడాయించగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ♦ 2003లో ముంబయిలోని తాజ్హోటల్లో కూడా ఇదే తరహా దొంగతనానికి పాల్పడ్డాడు. ♦ 2017 అక్టోబర్‌లో విశాఖపట్నం వరుణ్ బీచ్ హోటల్లో ఆభరణాలు తస్కరించాడు. ♦ 2003లో కోలాబ తాజ్హోటల్లో జరిగిన చోరీ ఘటనలో జయేష్‌ను అక్కడి ´లలీసులు పోలీసులు అరెస్ట్ చేయగా అయిదు రోజుల జైలు శిక్ష కూడా పడింది. ♦ 2013లో ఛండీగడ్‌లోని హోటల్లో కూడా దొంగతనం చేశాడు. -
ఆహార వృథా ఎక్కడ..?
ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంత ఆహారం వడ్డించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట! అక్కడ బోలెడంత ఆహారం వృథా అవుతోందని.. చెత్తబుట్టల్లోకి చేరుతోందని కేంద్రమంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేయడమే కాక.. ఈ వృథాకు చెక్ పెట్టేయాల్సిందేనని తీర్మానిం చేశారు. అనుకున్నదే తడవుగా జాతీయస్థాయిలో హోటల్ ఓనర్లతో సమావేశానికీ రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారమంతా చూస్తూంటే.. గాయమైన చోటు ఒకటైతే మందు మరోచోట వేస్తున్నట్టుగా అనిపించడం లేదూ..? ఎందుకో చూద్దాం..! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ స్టార్ హోటళ్లలోనా..? వ్యవస్థలోనా..? దేశంలో అసమర్థంగా వ్యవసాయ రంగ నిర్వహణ లోపభూయిష్టంగా పంట ఉత్పత్తుల నిర్వహణ, సరఫరా వృథా అవుతున్న తిండిగింజల విలువ ఏటా లక్ష కోట్లు ఇది కేంద్ర వ్యవసాయ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ శీతల గిడ్డంగులను నిర్మిస్తున్నా అది పాక్షిక పరిష్కారమే ప్యాక్‌హౌస్‌లు, పండ్లను మగ్గబెట్టే వ్యవస్థలు తక్కువే సరఫరాకు అవసరమైన శీతల వాహనాల సంఖ్యా అంతంతే అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ దేశంలో కులమతాలకతీతంగా అందరూ విశ్వసించే మాట ఇదీ. ఈ విశ్వాసం కారణంగానే రాత్రి మిగిలిపోయిన అన్నం కాస్తా.. ఉదయానికి పులిహోర గానో.. చద్దన్నంగానో మారిపోయి ఉపయోగపడుతోంది. అంచనాలు తారుమారైతే మినహా పెళ్లిళ్లు.. పెద్దఎత్తున జరిగే ఉత్సవాల్లోనూ పారబోసే ఆహారం తక్కువే. అయితే సాధారణ హోటళ్ల సంగతి పక్కనబెడితే స్టార్ హోటళ్లు, హైక్లాస్ రెస్టారెంట్లలో ఎక్కువ మోతాదులో ఆహారం, పండ్లూ, కాయగూరలు వృథా అవుతాయనడంలో కొంత వాస్తవం లేకపోలేదు. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా స్తోమత కలిగిన వారే అక్కడకు వెళతారన్నది కూడా గమనించాల్సిన అంశం. దీన్ని పరిహరించాల్సిన అవసరమున్నప్పటికీ ఇది కేంద్రం జోక్యం చేసుకోదగ్గ స్థాయి అంశమా? అన్నదే ప్రశ్న. అసలు సమస్య ఎక్కడుంది? స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్న ప్పటికీ వ్యవసాయ ప్రధానమైన భారతదే శంలో ఆ రంగం నిర్వహణ మొత్తం అసమర్థం గానే ఉందన్నది నిష్టూర సత్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరించకపోవడం వల్ల చాలా పంటల దిగుబడి అంతర్జాతీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంటోంది. పంట ఉత్పత్తుల నిర్వహణ, సరఫరాలు కూడా అత్యంత లోపభూయిష్టంగానే ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా దేశంలో వృథా అవుతున్న ఆహారం, తిండిగింజల విలువ ఏటా దాదాపు లక్ష కోట్ల వరకూ ఉం టోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ గత ఏడాది విడుదల చేసిన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ బడ్జెట్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. పంట ఉత్పత్తులు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు తద్వారా వృథాను అరికట్టేందుకు ఇప్పుడు ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అయినప్పటికీ దేశం లో ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు తీసుకుం టున్న చొరవ చాలా తక్కువ. పోస్ట్ హార్వెస్ట్ నష్టాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున శీతల గిడ్డంగులను నిర్మిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇది పాక్షిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు అంటున్నారు. 2007 – 14 మధ్యకాలంలో వేర్వేరు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద దేశం మొత్తమ్మీద దాదాపు 7,000 శీతల గిడ్డంగుల ఏర్పాటు జరిగింది. ఇందుకోసం సబ్సిడీల రూపంలో దాదాపు రూ. 2,395 కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయితే ప్యాక్‌హౌస్‌లు, పండ్లను మగ్గబెట్టే వ్యవస్థలు, సరఫరాకు అవసరమైన శీతల వాహనాల విషయాన్ని మాత్రం పూర్తిగా నిర్ల క్ష్యం చేశారు. ఫలితంగా పండించిన కాయ గూరలు, పండ్లలో దాదాపు 16 శాతం వృథా అవుతున్నట్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ స్పష్టం చేస్తోంది. మాంస ఉత్పత్తుల్లో 60 శాతానికిపైగా పనికిరాకుండా పోతున్నాయని, అంచనా. గిడ్డంగుల్లో పందికొక్కులు.. వడ్లు, గోధుమల వంటి తిండిగింజలను నిర్ణీత ఉష్ణోగ్రత, తేమ ఉన్న పరిస్థితుల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఇలాంటి సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న జాతీయ ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఏటా కొన్ని వేల టన్నుల తిండిగింజలు పందికొక్కులకు ఆహారంగా మారిపోతున్నాయి. తమ స్వార్థం కోసం గిడ్డంగి సిబ్బంది కొందరు ఈ నష్టాలను ఎక్కువ చేసి చూపుతున్నట్లు అంచనాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా తిండిగింజలతోపాటు ఇతర ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగుల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ద నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ ఛెయిన్ డెవలప్మెంట్’ గత ఏడాది తన నివేదికలో స్పష్టం చేసింది. కొన్నేళ్ల క్రితం పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించినప్పుడు ఈ వృథా గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. దేశం మొత్తమ్మీద ఇలాంటి ఆధునిక గ్రెయిన్సైలోస్ ఏర్పాటు చేయడం, అవసరాలకు తగ్గట్టుగా, తగినన్ని గిడ్డంగులు, ఉద్యాన పంటలను వర్గీకరించి ప్యాక్ చేయగల ప్యాక్‌హౌస్‌లు, శీతల వాహనాలను ఏర్పాటు చేస్తే మిగిలే ఆహార ఉత్పత్తుల విలువ స్టార్ హోటళ్లలో జరుగుతున్న వృథా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని నిపుణుల అంచనా. -
నీటి చుక్కే గగనమైనా పట్టదా?
విశ్లేషణ డెబ్భై కోట్ల మంది ప్రజలు వరుసగా రెండో ఏడాది దుర్భిక్షానికి గురయ్యారు. బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం వంటి నిత్యకృత్యాలకు అవసరమయ్యే నీరు దాదాపుగా లభించక, తాగునీటి కోసం వారు మైళ్ల తరబడి అన్వేషించాల్సి వస్తుండగా... కుళాయి తిప్పితే నీరు లభించే నగరవాసులకు ఈ సంక్షోభం ఎంత తీవ్రమైనదో, రోజుల తరబడి నీరు లేకుండా మనగలగడం ఎలాగో ఊహకైనా అందదు. ఈ కష్ట కాలంలో నీటి బొట్టు కోసం ఆక్రందిస్తున్న పెద్ద సంఖ్యలోని ప్రజలకు దేశం సంఘీభావంగా నిలిచి తీరాలి. ఇది ఎన్నడో మరుపున పడిపోయిన కథనం. అది 1965. ఆ ఏడాది దేశంలో కరువు నెలకొంది, ఆహార దిగుమతు లపైనే చాలా ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో చాలా భాగం ఆహార కొరతను ఎదుర్కొంటున్న ఆ సమయంలో, నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలంతా ప్రతి సోమవారం ఉపవాసం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి నాడు దేశంలోని ప్రతి ఒక్కరూ ఆకలితో పడుకోవాల్సిన పరిస్థితి నెలకొనలేదు. సోమ వారం ఉపవాసం పాటించాలన్న శాస్త్రి పిలుపు ప్రాథమి కంగా ఆకలితో అల్లాడుతున్న లక్షలాదిమంది పట్ల సౌహార్ద్రతా ప్రకటన మాత్రమే. అలా ఆదా చేసిన ఆహా రం, ఆకలితో ఉన్న జనాభాలో ఒక చిన్న భాగం ఆకలిని తీర్చడానికైనా సరిపోయిందనుకోను. కాకపోతే ఆకలితో అల్లాడుతున్న ప్రజల పట్ల దేశం పట్టింపును ప్రదర్శి స్తోంది, వారితో పంచుకోవడం కోసం ఒక రోజు ఆహా రాన్ని త్యాగం చేయడానికి అది సిద్ధంగా ఉన్నది అనే అంతర్నిహిత సందేశాన్ని ఆ పిలుపు స్పష్టంగానూ, గట్టిగానూ వినిపించింది. సహానుభూతికి కోర్టు అదేశాలు అవసరం యాభై ఏళ్ల తర్వాత, ‘‘విశాల ప్రజానీకం ప్రయోజనాల కోసం’’ 13 ఐపీఎల్ మ్యాచ్‌లను తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నుంచి బయటకు తరలించడం కోసం బొంబాయి హైకోర్టు ఆదేశం అవసరమైంది! క్రికెట్ పిచ్ కోసం ఖర్చయ్యే నీటిని ఆదా చేయడం వల్ల లాతూరు నగరం ఒక్క రోజు నీటి అవసరాన్ని కూడా తీర్చలేదని హైకోర్టుకు నిస్సంశయంగా తెలుసు. ‘‘ప్రభుత్వం ప్రజల దుస్థితిని పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదు’’ అనే సందే శాన్ని పంపాలనేదే కోర్టు ఆదేశాల ప్రాథమిక లక్ష్యం. ఆ సందేశానికి స్పందించిన ముంబై హోటల్స్, రెస్టారెంట్ల అసోసి యేషన్... ఇక నుంచి కస్టమర్లు, తాము వచ్చి కూర్చున్న వెంటనే గ్లాసుల నిండా నీరు ఉంచుతారని ఆశించవద్దని ప్రకటించింది. టేబుల్ మీద ఉంచిన జగ్గును తీసుకుని వారు తమంతట తాము కావల్సినంత నీటిని గ్లాసులో పోసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వారు వదిలి వెళ్లే సగం గ్లాసు నీళ్లు వృథా కాకుండా ఉంటాయి. ఈ చర్య వల్ల దుర్భిక్ష మహారాష్ట్ర ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్య తీరేదేమీ కాదు. కాకపోతే, తోటి పౌరుల పట్ల పట్టింపును చూపే స్పందనాతత్వాన్ని అది ప్రతిఫలిస్తుంది. దుర్భిక్ష పీడిత ప్రాంతాల ప్రజల దుస్థితి గురించి, వారు అనుభవిస్తున్న బాధల గురించి సుప్రీం కోర్టు, ప్రభుత్వాన్ని మేల్కొల్పడం అవసరమైంది. పాలనా యంత్రాంగం ఎంతగా పట్టింపుతనం లేకుండా బండబారిపోయిందో దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇంచుమించు 70 కోట్ల మంది ప్రజలు వరుసగా రెండో ఏడాది సంభవించిన ఈ దుర్భిక్ష పీడితులుగా ఉన్నారని అంచనా. దేశ ప్రధాన భాగంలో నెలకొన్న ఈ తీవ్ర సంక్షోభం గురించిన స్పృహ అటు ప్రభుత్వానికి, ఇటు మీడియాకు కూడా లేకుండా పోయింది. 10 రాష్ట్రాలలోని గణనీయమైన భాగాలు వరుసగా రెండో ఏడాది క్షామంతో అల్లాడుతున్నాయి. వేడి వాతావరణం కొనసాగడం వల్ల పంటలు ఎండిపోయాయి. రైతులు మొదట తమ పశువులను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే వారే ఇల్లూ వాకిళ్లు, ఊళ్లు వదిలి వలస పోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇళ్లూవాకిళ్లూ పదిలి వలస బాట మహారాష్ట్రలోని మరఠ్వాడా సహా పలు ప్రాంతాలు వరుసగా మూడో ఏడాది దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లోనే రాష్ట్రంలోని 43,000 గ్రామాల్లో 14,708 క్షామ పీడిత గ్రామాలని ప్రకటించింది. కర్ణాటకలోని 30 జిల్లాల్లో 27 జిల్లాల్లోని 127 తాలూకాలను క్షామపీడితమైనవని సెప్టెంబర్ 2015లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, 196 మండలాలను క్షామ పీడితమైనవిగా ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో క్షామ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జార్ఖండ్‌లోని పాలమూ జిల్లా గత ఆరేళ్లలో ఐదేళ్లుగా క్షామాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. బుందేల్ఖండ్దీ అదే కథ. క్షామానికి ఆల్లాడుతున్న ప్రజల మొహాల్లోనే ఆ దైన్యమంతా తాండవిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు రెంటిలోనూ విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ క్షామం గురించి కనీసం గత నాలుగేళ్లుగా వార్తా నివేదికలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దుర్భిక్షం నెలకొన్నప్పుడు మొదట దాని బారినపడేది పశువులు. మహిళలు వాటి నుదుట తిలకం దిద్ది, వాటి పాదాలకు నమస్కరించి స్వేచ్ఛగా వాటిని వదిలిపెట్టేయడం నేను చూసిన సాధారణ రివాజు. పశువులు పోయాక కూడా దుర్భిక్ష పరిస్థితులు మరింత అధ్వానంగా మారడంతో తాగునీటి వనరులు సైతం ఎండిపోతాయి. ఆడా, మగా అంతా రోజులో అత్యధిక భాగం ఒక బకెట్టు నీళ్లు సంపాదించడం కోసం దూరాభారాలకు నడుస్తూనే ఉంటారు. పంటలు పూర్తిగా ఎండిపోయాక ఇక వలస పోవడం మాత్రమే రైతులకు మిగిలి ఉండే దారి. నగరవాసి ఊహకందని విపత్తు మహారాష్ట్రలోని లాతూరులో ట్యాంకర్లతో నీటిని అందించే ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించినట్టు వస్తున్న వార్తలు... తాగునీటి కరువు వల్ల ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయో తెలుపుతోంది. బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం వంటి నిత్యకృత్యాలకు అవసరమయ్యే నీరు దాదాపుగా లభించని పరిస్థితిలో ప్రజలు చెప్పనలవిగాని కష్టాలకు గురికావాల్సి వస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కుళాయి తిప్పితే చాలు నీరు లభించే లేదా రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు అందుబాటులో ఉండే నగర ప్రజలకు... ఈ సంక్షోభం ఎంత తీవ్రమైనదో, రోజుల తరబడి నీరు అసలుకే లభించకుండా మనగలగడం ఎలాగో ఊహకైనా అందదు. ఇటీవల నేను బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జరిపిన పర్యటనల్లో ఒక రైతు కుటుంబాన్ని స్నానం చేయాలని అడిగాను. ‘మరో లడ్డూ తినండి, అంతేగానీ స్నానం మాట ఎత్తకండి!’ అని ఆ ఇంటి ఆడమనిషి నాకు చెప్పేసింది. గత కొన్ని నెలలుగా క్షామ పీడిత రాష్ట్రాలు చాలా వాటిలో పర్యటిస్తున్న నేను ఈ విషయంలో నెలకొన్న తీవ్ర అసమానతను చూసి నివ్వెరపోయాను. కర్ణాటక లోని 80 శాతం ప్రాంతం దుర్భిక్షానికి గురై ఉండగా... ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో దాని దాఖలాలే లేవు. అలాగే ముంబైలో పయనిస్తుంటే, గత రెండేళ్లుగా ఆ రాష్ట్రం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సూచ నలు ఏ మాత్రం కనిపించలేదు. నగరాలలో నివసిస్తున్న ప్రజలకు తమ పెరట్లోనే ఉన్న గ్రామాల్లో నెలకొన్న దయనీయమైన పరిస్థితుల గురించి ఊహామాత్రం గానైనా తెలియదు. వార్తా పత్రికల్లో చదివే దుర్భిక్షం గురించిన వార్తా కథనాలను వారు ఏ ఇథియోపియా ప్రజల ఇక్కట్ల గాథలో అన్నట్టుగా వారు చూస్తారు. దేశం అండగా నిలవాలి ఈ తీవ్ర కష్ట కాలంలో దేశం, ఒక్క నీటి బొట్టు కోసం ఆక్రందిస్తున్న పెద్ద సంఖ్యలోని ప్రజలకు సంఘీభావంగా నిలిచి తీరాలి. ముంబై రెస్టారెంట్లలాగే, ఫైవ్ స్టార్ హోటళ్లు సహా దేశంలోని హోటళ్లన్నీ నీటి వినియోగాన్ని తగ్గించే తక్షణ చర్యలను చేపట్టాలి. కనీసం, అవి కస్టమర్లను టబ్బు స్నానాలకు బదులు షవర్ స్నానాలకు పరిమితం కావాలని కోరాలి. గోల్ఫ్ క్లబ్బులు సైతం వారానికి మూడు రోజులు మూసేసుకోవచ్చు. వాటి నిర్వాహకులు గోల్ఫ్ కోర్సులన్నీ తమకు కావాల్సిన నీటి కోసం వాటర్ హార్వెస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రకటించాలి. ఈ సంక్షోభ సమయంలో స్విమ్మింగ్ పూల్స్‌ను మూసి ఉంచాలి. కార్లను కడగడం, తోటలకు నీటిని పెట్టడంలో నియంత్రణను పాటించాలి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు మొదలైనవి సాధ్యమైనంతగా నీటిని పొదుపు చేయడం కోసం పలు ఇతర చర్యలను చేపట్టడం కూడా అవసరం. దుర్భిక్షం ఒక ప్రకృతి విపత్తు. ఆ విపత్తుకు గురైనవారికి మద్దతుగా దేశం నిలవాలి. విచ్చలవిడి నీటి వినియోగాన్ని ఏదిఏమైనా అరికట్టాల్సిందే. లాల్ బహదూర్ శాస్త్రి జీవించి ఉండి ఉంటే... దేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుండగా దాని పట్ల పట్టింపును చూపలేని జాతిని చూసి, సాటివారిపట్ల సహానుభూతిని రేకెత్తించడానికి ఏమి చేసి ఉండేవారా? అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. దేవిందర్‌శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com -
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లా యూనివర్సిటీలు
-
హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ...
చెన్నై : నగరంలో ఆస్తి పన్ను బకాయి వసూళ్లలో కార్పొరేషన్ అధికారులు రోజుకో వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించని స్టార్ హోటళ్ల యజమానుల్ని బెంబెలెత్తిస్తున్నారు. దండోరాతో పాటుగా హిజ్రాలతో నృత్యాలు చేయించే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్ పరిధిలోని స్టార్ హోటళ్లు, మాల్స్, అనేక ప్రైవేటు సంస్థలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ బకాయిలు పెరుగుతుండడం అధికారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. నగరంలోని పదిహేను మండలాల పరిధుల్లో ఏ మేరకు ఏయే సంస్థలు బకాయిలు ఉన్నాయో వివరాల్ని సేకరించారు. ఆయా సంస్థలు, హోటళ్లు, మాల్స్‌ల పరువు బజారుకీడ్చే రీతిలో నోటీసులు జారీ చేశారు. అయినా, ఫలితం శూన్యం. ఆయా భవనాల ముందు దండోరా వేయిస్తూ, వారు ఉన్న బకాయిల వివరాల్ని వెల్లడిస్తూ వినూత్న పంథాలో పయనించారు. అధికారుల దండోరాకు మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. బకాయిలు ఉన్న వాళ్లందరూ ఉరకలు పరుగులతో ఆస్తి పన్ను చెల్లింపు మీద దృష్టిపెట్టారు. అయితే, కొన్ని బడా బాబులకు చెందిన హోటళ్లు, సంస్థలు నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించలేదు. స్టెప్పులతో.. నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించిన యజమానుల పరువును మరింతగా బజారుకు లాగే రీతిలో కొత్త మార్గంలో పయనించేపనిలో అధికారులు పడ్డారు. శుక్రవారం నుంచి ఈ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. దండోరా వేయిస్తూనే, కొందరు హిజ్రాలను నియమించుకుని, వారి ద్వారా ఆయా భవనాల ముందు స్టెప్పులు వేయించే పనిలో పడ్డారు. ఉదయం ఈక్కాడు తాంగల్‌లోని ఓ హోటల్ ముందు హిజ్రాలతో నృత్యం చేయిస్తూ, దండోరా వేయించారు. దీంతో ఆ యజమానుల్లో కలవారాన్ని రేపింది. ఆగమేఘాలపై అక్కడిక్కడే తాము పన్ను చెల్లించాలని రూ.30 లక్షలకు గాను చెక్కును అధికారులకు అందజేశారు. ఇదే బాటలో ఇతర యాజమాన్యాల భరతం పట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు ముందుకు కదిలారు. శుక్రవారం ఒక్క రోజు కేవలం 13వ డివిజన్లో మాత్రం రూ.కోటి 63 లక్షలు ఆస్తి పన్ను వసూలైంది. కోయంబేడు, మదురవాయిల్ పరిసరాల్లో నీటిపన్ను వసూళ్లు రూ.33 లక్షలు రావడం విశేషం. -
భద్రత కట్టుదిట్టం - ఢిల్లీ సురక్షితం
న్యూఢిల్లీ: పెషావర్, సిడ్నీ నగరాలలో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రాజధాని నగర భద్రతకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. నగరం సురక్షితంగా ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎదురుకోవడానికి తమ సిబ్బంది సదా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు నిత్యం తమ పరిసర వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సదా అప్రమత్తంగా ఉంటారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుం టున్నాం’’అని బస్సీ పేర్కొన్నారు. స్కూల అధికారులకు ఏవైనా నిర్దిష్టమైన సూచనలు చేశారా అన్న ప్రశ్నకు సంబంధిత వర్గాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఢిల్లీ పోలీసు అధికారులు బుధవారం మధ్యాహ్నం హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి హాజరైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరంలోని పాఠశాలలతో పాటు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మాల్స్, రెస్టారెం ట్లు, ఇతర కీలకమైన ప్రాంతాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను వీరు వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు ఇదివరకే నగరంలోని పాఠశాలలు, కాలేజీలకు కొన్ని మార్గదర్శకాలను సూచించారు. పలువురు ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని విద్యా సంస్థలను బుధవారం సందర్వించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థులు లోపల ఉన్నప్పుడు స్కూలు గేట్లను మూసివేయాలని, గార్డులను నియమించుకోవాలని, తనిఖీ చేసి, ఆధారాలను పరిశీలించిన తరువాతనే బయటి వారిని లోపలికి అనుమతించాలని పోలీసు లు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సమీపంలో పీసీఆర్ వ్యాన్లను మోహరిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో బీట్ కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు. సిడ్నీలో హోటల్‌ను, పెషావర్‌లో స్కూల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని బస్సీ చెప్పారు. అందువల్ల స్కూళ్లు, కాలేజీలు, విదేశీ దౌత్య కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, విమానాశ్రయాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని అన్నారు. కీలకమైన ప్రాంతాల వద్ద బుధవారం స్వాట్ బృందాలు మాటు వేసి కనిపించాయి. క్విక్ రియాక్షన్ బృందాలు (క్యూఆర్టీ), క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ (క్యూఆర్వీ)లను సిద్ధంగా ఉండాలని ఆదేశించా రు. పెషావర్‌లో సైనిక పాఠశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ఢిల్లీ, కం టోన్మెంట్, చాణక్యపురిలోని ఆర్మీ స్కూళ్లకు ప్రత్యేక భద్రతను కల్పిం చామని కమిషనర్ వివరించారు. ఈ నెల 5వ తేదీనే ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందే భద్రతను ముమ్మరం చేశామని చెప్పారు. వాహనాల వేగానికి కళ్లెం! రోడ్లపై వేగంగా దూసుకుపోతూ పౌరుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న వాహనాలను అదుపు చేసేందుకు నగర పోలీసులు ‘ఇంటర్‌సెప్టర్ వ్యాన్’లను బుధవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో అమర్చిన లేజర్ ఆధారిత కెమెరాలు పగటిపూటే కాకుండా రాత్రి వేళల్లో కూడా వాహనాల వేగాన్ని పసిగడతాయి. ఈ యంత్రాల సహాయంతో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చలాన్లను జారీ చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంటర్‌సెప్టర్ వ్యాన్లను ఇండియాగేట్ వద్ద పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిండా కార్లు వెళుతున్నప్పటికీ వాటిలో అత్యంత వేగంగా వేళ్లే వాహనాన్ని ఈ కెమెరా గుర్తించగలదని, రెండు క్షణాలకో చలానాను అది జారీ చేయగలదని బస్సీ చెప్పారు. వేగంగా వెళ్లే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో సహా ఫోటో తీయగలదని అన్నారు. -
అధికారులకు ఫస్ట్‌క్లాస్ విమానయానం కట్
దేశ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందువల్ల దుబారాను వెంటనే తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ప్రభుత్వాధికారులు ఇకమీదట పొదుపు చర్యలు పాటించి తీరాల్సిందేనని కుండ బద్దలుకొట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించడం ఇక మానుకోవాలని స్పష్టం చేసింది. ప్రణాళికేతర వ్యయాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక శాఖ విధించింది. జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 12.19 లక్షల కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, అనవసర వ్యయాలను కచ్చితంగా తగ్గించాలని ఓ మెమోలో తెలిపింది. విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వాధికారులు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించకూడదని, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని.. వీటిపై నిషేధం ఉందని తెలిపారు. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు, సదస్సులు కూడా నిర్వహించకూడదన్నారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం వివిధ తరగతుల్లో ప్రయాణించేందుకు అధికారులకు అర్హత ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిని బట్టి వాటిని మానుకోవాలన్నారు.