
ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఎంట్రెన్స్ నుంచే హుందాతనం ఉట్టిపడే ద్వారం. ఇన్ఫినిటీ పూల్, అత్యాధునిక జిమ్, అతిథి గదులు వంటి వసతులే కాకుండా మనసును ఆహ్లాదపరిచే మ్యూజిక్, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యకరమైన ఏర్పాట్లూ ఉంటాయ్. ఈ వసతులన్నీ సొంతింట్లోనూ ఉంటే? మీ ఇంటి అడ్రస్సే ల్యాండ్‌మార్క్‌లా నిలిచేలా ఉంటే? ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె నగరాలకే పరిమితమైన థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు హైదరాబాద్‌కూ వచ్చేశాయి. ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐలు, ఎగువ ఆదాయ వర్గాలను రా..రమ్మంటున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: గత దశాబ్ధ కాలంగా గృహ కొనుగోలుదారుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. విదేశాల్లోని గృహాలు, హోటళ్లు, రిసార్ట్‌లోని వసతులను చూసి అలాంటి వసతులు స్థానికంగా తాముండే ఇళ్లలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి.
చాలా మంది కిడ్స్, ఫిట్‌నెస్, స్పోర్ట్స్, డిస్నీ థీమ్ వంటి ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఆర్కిటెక్చర్ డిజైన్స్‌తో నిర్మాణాలను చేపడుతున్నారు. థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ప్రాజెక్ట్‌లున్న ప్రాంతం అభివృద్ధికి నిదర్శనంగా.. నగరానికే తలమానికంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహమక్కర్లేదు.
ప్రాజెక్ట్‌తో సెల్ఫీ..
సాధారణ నిర్మాణాలతో పోలిస్తే థీమ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి పెట్టుబడి కూడా కొంత ఎక్కువే అవసరం. అందుకే ఇళ్ల ధరలు కూడా కొంత ఎక్కువే ఉంటాయి. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లు అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి. కొత్త తరహా ప్రాజెక్ట్‌లు, వసతులున్న ప్రాజెక్ట్‌లను చూసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
రోడ్డు మీద నుంచి అటువైపుగా వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ప్రాజెక్ట్ వైపు చూస్తున్నారని.. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా కిస్మత్‌పూర్ మీదుగా వెళ్లిన సినీ నటి జయసుధ అవిఘ్న ప్రాజెక్ట్ ఎలివేషన్ చూసి ఆశ్చర్యపోయి.. లోపలికి వచ్చి ప్రాజెక్ట్ మొత్తం కలియతిరిగారని’’ స్థానికులు తెలిపారు.
కొనుగోలుదారులేమంటున్నారంటే?
మరి, థీమ్ ప్రాజెక్ట్‌లలో ఫ్లాట్లను కొనుగోలు చేసే కస్టమర్ల స్పందన ఎలా ఉందంటే.. ‘‘రెండేళ్ల క్రితం ఓ హోటల్‌లో జరిగిన సాక్షి ప్రాపర్టీ షోలో గిరిధారి స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అవిఘ్న ప్రాజెక్ట్‌ను ప్రదర్శనలో చూసి నా భార్యకు ఎలివేషన్ బాగా నచ్చింది. అంతే రెండేళ్ల క్రితం ఫ్లాట్‌ను బుక్ చేశాం. ఇప్పుడు సొంతింట్లో ఆనందంగా ఉంటున్నాం.
హైదరాబాద్‌లో ఎవరి ఇంటికీ లేని ఎలివేషన్ మా ప్రాజెక్ట్‌కుందని గర్వంగా చెప్పుకుంటున్నామని’’ రవితేజ చెప్పారు. ఇన్ఫిటిపూల్ చిన్నపిల్లల్నే కాదు మా లాంటి వాళ్లను కూడా అమితంగా ఆకర్షిస్తోంది. అవిఘ్నలోని పూల్ చూశాక నా మనవళ్లతో పాటూ నేనూ 45 ఏళ్ల తర్వాత స్విమ్మింగ్ చేశా. గిరిధారి ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలుదారులు మూడోతరం వాళ్లూ ఉన్నారని చెప్పడానికి నేనే సాక్షినని’’ ప్రసాద్ తెలిపారు.
విదేశీ ఆర్కిటెక్చర్లు, నిపుణులు..
గిరిధారి హోమ్స్, సుచిరిండియా, ప్రెస్టీజ్ వంటి నిర్మాణ సంస్థలు నగరంలో పలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో తొలి థీమ్ ఆధారిత ప్రాజెక్ట్ అవిఘ్నను పూర్తి చేసిన ఘనతను సొంతం చేసుకుంది గిరిధారి.
థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చెందే ప్రాంతంలో, విశాలమైన విస్తీర్ణంలో, వినూత్నమైన ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఉంటాయి. వీటి ఎలివేషన్స్, వసతుల ఏర్పాట్ల కోసం విదేశీ ఆర్కిటెక్చర్లు, నిపుణుల అవసరముంటుంది. కిస్మత్‌పూర్‌లో గిరిధారి నిర్మించిన అవిఘ్న ప్రాజెక్ట్ పడవ ఆకారంలో నిర్మించిన క్లబ్ హౌజ్ ఎలివేషన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన ట్రిపోలీ స్టూడియో అభివృద్ధి చేసింది. ఇక, ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన లైట్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంది.
ప్యాలెస్ లాంటి ప్రాజెక్ట్‌లు..
ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్ గృహ నిర్మాణాల్లోనూ మొదలయ్యాయి. మానసిక చైతన్యం, ప్రేరణను కలిగించడమే సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఇందుకోసం ప్రాజెక్ట్‌లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మలు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటే మన మెదడు పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది.
దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కిస్మిత్‌పూర్‌లో గిరిధారి 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర, హకీంపేట్ రోడ్‌లోని తూమ్‌కుంటలో సుచిరిండియా 86 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఆర్యవర్తనగరి ఇలాంటి ప్రాజెక్ట్‌లనే ప్రారంభించాయి. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్‌లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్ ఆర్ట్) చిత్రీకరిస్తారు. దీంతో నివాసితులకు ప్యాలెస్ తరహా వాతావరణం కలుగుతుంది.
45 అడుగుల ఎత్తులో స్విమ్మింగ్ పూల్..
వినూత్న కాన్సెప్ట్‌లతో ప్రాజెక్ట్‌లను నిర్మించే గిరిధారి హోమ్స్.. హైదరాబాద్‌లో తొలి థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. అప్పా జంక్షన్‌లోని కిస్మత్‌పూర్‌లో ఎకరం ముప్పయి గుంటల్లో అవిఘ్న ప్రాజెక్ట్‌ను నిర్మించింది. మొత్తం 132 ఫ్లాట్లు.. 1,100 నుంచి 1,650 చ.అ.ల్లో విస్తీర్ణాలున్నాయి.
సింగపూర్‌లో 50 అంతస్తు ఎత్తులో నిర్మించిన మెరీన్ బే సాండ్ ప్రాజెక్ట్‌ను ఆదర్శంగా తీసుకొని అవిఘ్న ప్రాజెక్ట్‌ను నిర్మించామని తెలిపారు. 55 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తులో ఇన్ఫినిటీ పూల్‌ను ఏర్పాటు చేశామని.. సింగపూర్ లాంటి అనుభూతి నగరవాసులకు కల్పించాలనేది లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేశామన్నారు.
♦ 10 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్‌తో పాటూ జిమ్, ఇండోర్ గేమ్స్, బాంక్విట్ హాల్, కాఫీ షాప్, లైబ్రరీ, ప్లే స్కూల్, సూపర్ మార్కెట్, సెలూన్, గెస్ట్ రూమ్స్, పార్టీ ఏరియా వంటి వసతి ఏర్పాట్లున్నాయి. ప్రాజెక్ట్ మధ్యలో నుంచి చిన్నపాటి సరస్సు పారుతున్నట్లు
వాటర్ క్రీక్‌ను ఏర్పాటు చేశారు. 300 అడుగుల పొడవుండే ఈ క్రీక్ నిత్యం నీటి ప్రవాహంతో శబ్ధం చేస్తుంటే మనస్సు ఆహ్లాదకరంగా మారుతుందని స్థానిక కొనుగోలుదారులు చెబుతున్నారు. – ఇంద్రసేనా రెడ్డి. సీఎండీ, గిరిధారి హోమ్స్
Comments
Please login to add a commentAdd a comment