మొదలైన కౌటింగ్.. ఎవరిదో గెలుపు?
లక్నో: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాల్లోని 78 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. లక్నోలో కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
పంజాబ్ లోని 24 ప్రాంతాల్లోని 54 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లుధియానా కౌంటింగ్ కేంద్రంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మణిపూర్ లోని 11 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. విజయంపై ఆయా పార్టీల అభ్యర్థులు దీమాగా వ్యక్తం చేస్తున్నారు.