flying kites
-
HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కైట్ ఎగరవేస్తూ విద్యుత్ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వయ్యారి గాలిపటం.. పైపైకి ఎగిరే.. (ఫొటోలు)
-
ప్రాణం తీసిన గాలిపటం
జడ్చర్ల టౌన్: పండుగ రోజు తండ్రితో కలసి గాలిపటం ఎగరేస్తున్న ఓ బాలుడు మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. నల్లగొండ జిల్లాకు చెందిన గణేష్, నిరోష దంపతులు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి కుమారుడు కార్తీక్ (6)తో పాటు కూతురు ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం తండ్రీ కొడుకులు తమ ఇంటి పైకెక్కి గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఇదే క్రమంలో గాలిపటం పక్కింటి మేడపై ఉన్న వాటర్‌ట్యాంక్‌కు తగిలింది. దీంతో తండ్రి అక్కడికి వెళ్లి దానిని తీసుకోగా.. దారంతో లాగుతున్న కుమారుడు ప్రమాదవశాత్తు మేడపై నుంచి కింద పడ్డాడు. బాలుడిని హుటాహుటిన బాదేపల్లి ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. పండుగ పూట బాలుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇద్దరూ టీచర్లే
‘ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చు’... ఎన్టీఆర్‌కి సలహా ఇస్తున్నారు లాయిడ్ స్టీవెన్స్, ‘ఇలా చేస్తే ఈజీగా గాలిపటం ఎగరేయొచ్చు’... స్టీవెన్స్‌కి సలహా ఇచ్చారు ఎన్టీఆర్. బాగుంది.. తగ్గే విషయంలో ఎన్టీఆర్‌కి స్టీవెన్స్ గురువు అయితే.. గాలిపటాలు ఎగరేసే విషయంలో స్టీవెన్స్‌కి గురువు అయ్యారు ఎన్టీఆర్. ఇంతకీ ఏంటి కహానీ అంటే... ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారు. అందుకే హాలీవుడ్ నుంచి లాయిడ్ స్టీవెన్స్ ఇండియా వచ్చారు. దగ్గరుండి ఎన్టీఆర్‌కి ఫిజికల్ ట్రైనింగ్ చేయిస్తున్నారు. సంక్రాంతి పండగకి మాత్రం ఎన్టీఆర్ దగ్గరుండి స్టీవెన్స్ చేత గాలిపటాలు ఎగరేయించారు. ‘‘గాలి పటాలు ఎలా ఎగరేయాలో ఎన్టీఆర్ నేర్పించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని విదేశీ ట్రైనర్ లాయిడ్ పేర్కొన్నారు. -
'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్'
ముంబై: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను గాలిపటం ఎగరవేస్తున్న ఫొటోను ఆయన గురువారం ట్విట్టర్లో షేర్ చేశారు. చిన్నప్పుడు గాలిపటాలు ఎగరవేయడం తనకెంతో ఇష్టమని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సాధారణంగా గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. 'పీకే' సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ఆమిర్‌ఖాన్ ఇటీవల మతఅసహనంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ను తొలగించారు. Wishing everyone a very happy Makar Sankranti!!! Flying kites is one of my childhood passions! Love. a. pic.twitter.com/VaWNc0Gudw — Aamir Khan (@aamir_khan) January 14, 2016 -
గాలిపటాలు ఎగురవేస్తూ.. ముగ్గురు విద్యార్థుల మృతి
-
గాలిపటాలు ఎగురవేస్తూ.. ముగ్గురు విద్యార్థుల మృతి
హైదరాబాద్: గాలిపటాలు ఎగురువేయాలన్న సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా పామర్రులోని నాగులేరు కాలువ వద్ద విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ చనిపోయారు. మృతులను నల్లబోతులు ఏసురాజు, నల్లబోతుల జాన్‌బాబు, సురేష్‌గా గుర్తించారు.