flying snake
-
హైదరాబాద్‌లో ఎగిరే పాము
హైదరాబాద్: నగరంలో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని ఎగిరే పాము బుధవారం ఘోషామహల్ ప్రాంతంలో కనిపించింది. ఈ పామును ఒర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ లేదా క్రైసోపెలి ఒర్నట అని పిలుస్తారు. విషపూరితమైన ఈ పాము ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించలేదు. షట్టర్ కింద దాక్కున్న ఈ పామును ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ వాళ్లు పట్టుకుని సైనిక్‌పూరిలోని సంరక్షిత కేంద్రానికి తరలించారు. పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్యరాష్ట్రాలు, కొన్ని ఆసియా దేశాల్లో ఈ పాములు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఎగిరేపామును పట్టుకున్న ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఘోషామహల్‌లోని ఓ దుకాణ యజమాని తమ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసినట్లు చెప్పారు. తన ప్లైవుడ్ షాపు ఎంట్రన్స్‌లో ఓ చిన్నపామును చూశానని సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దీంతో కొందరు టీం మెంబర్స్ వెంటనే అక్కడకు చేరుకున్నారని వివరించారు. తాము మొదట అది రాట్ స్నేక్ లేదా కోబ్రా అవ్వొచ్చని భావించామని చెప్పారు. కానీ, తమ అంచనాలను పటాపంచలు చేస్తూ ఫ్లయింగ్ స్నేక్ కనిపించిందని వెల్లడించారు. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని సైనిక్‌పురిలోని తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత పామును సంరక్షిత కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. -
వణుకు పుట్టిస్తున్న ఫ్లయింగ్ స్నేక్..!
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా కుంహారియా పంచాయతీ ప్రజలను ఓ మిస్టరీ పాము భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఎగిరే పాము (ఫ్లయింగ్ స్నేక్) చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పాము కాటువల్ల ఓ వ్యక్తి మరణించాడని, దాదాపు 25 మంది అనారోగ్యంపాలయ్యారని కుంహారియా ప్రజలు తెలిపారు. ఈ పాము తొలుత అన్నదమ్ములను కాటేసిందని, తర్వాత చాలామంది దీనిబారిన పడ్డారని చెప్పారు. కాగా ఈ పుకార్ల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తాంత్రికులు వైద్యం పేరుతో స్థానికుల నుంచి డబ్బు గుంజుతున్నారు. డాక్టర్ల వల్ల ప్రయోజనం ఉండదని, తాము నయం చేస్తామని చెబుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎగిరే పాము చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నా.. ఒక్కరూ కూడా ఆ పామును చూడలేదు. శరీరంపై కాట్లు పడటంతో తమను పాము కరిచిందని నమ్ముతున్నారు. తాంత్రికులతో మంత్రచికిత్స చేయించుకున్న తర్వాత తమకు ఉపశమనం కలిగిందని బాధితులు భావిస్తున్నారు. ఓ తాంత్రికుడు మాట్లాడుతూ.. పాము లేదా వేరే విషకీటకం కాటేసి ఉండొవచ్చని, దీన్ని నయం చేస్తానని అన్నాడు. బాధితుల వీపుభాగంలో ఓ పళ్లెం ఉంచి, మంత్రాలు వేస్తారు. శరీరంలోంచి విషాన్ని లాగేసిన తర్వాత ఈ పళ్లెం పడిపోతుందట. ఇంతకీ ఎగిరే పాము ఉందా లేదా, మంత్రాలతో చికిత్స సాధ్యమేనా అన్నది మిస్టరీగా మారింది. -
గాల్లో ఎగిరే పాము!
కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో ఓ అరుదైన పామును గుర్తించారు. కాలంపలయం గ్రామానికి చెందిన వెంకటేశన్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుండగా.. ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టుమీదకు అహారం కోసం గాల్లో ఎగురుతున్న పామును గుర్తించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అతను.. స్థానికంగా ఉన్న పాములు పట్టే వారికి సమాచారం ఇవ్వడంతో దానిని పట్టుకున్నారు. ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించగా వారు దానిని పరిశీలించి.. అరుదైన క్రిసోపీలియా రకానికి చెందిన సర్పంగా గుర్తించారు. ఆగ్నేయ దేశాలైన వియత్నాం, కంబోడియాలలో ఈ రకమైన సర్పాలు కనిపిస్తాయని వారు తెలిపారు. బూడిద వర్ణంలో ఉండి, నల్లటి మచ్చలతో కూడిన ఈ సర్పం.. గాల్లో ఒకేసారి 20 ఫీట్ల దూరం వరకు ఎగురుతుందని వారు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు దానిని పుతుపతి అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
శ్రీలంక పాము.. శేషాచలం అడవుల్లో..!