సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మృతి
అమృత్సర్ః ఇండో-పాక్ సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు చొరబాటుదార్లు సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ ఎఫ్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో జరగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది.
అక్రమంగా భారత్ లో చొరబడేందుకు ప్రయత్నించిన వారిని అమృత్ సర్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎదుర్కొంది. దర్యా ముసా గ్రామ సమీపంలో చొరబాట్లకు యత్నించిన ముగ్గురిని సైన్యం ఎన్ కౌంటర్ చేసింది. బీఎస్ఎఫ్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడమే కాక, అగ్నిమాపక సైనికులపై ప్రతీకారంగా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన చొరబాటుదార్లు ఎదురు కాల్పుల్లో మరణించినట్లు బీఎస్ ఎఫ్ వెల్లడించింది. అయితే కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించగా, వారివద్దనుంచీ 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఒకరు తప్పించుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. తప్పించుకున్న వ్యక్తికోసం గాలింపులు జరుపుతున్నామని, చొరబాటుదార్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని బీఎస్ ఎఫ్ తెలిపింది.