Foodpanda .IN
-
ఓలా నుంచి ఫుడ్‌పాండా ఔట్: ఉద్యోగాలు ఫట్
సాక్షి, ముంబై : క్యాబ్ అగ్రిగ్రేటర్ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించి షాక్ ఇచ్చింది. ఓలా ఇటీవల ఫుడ్ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్ పాండా పుడ్ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. ప్రధానంగా స్విగ్గీ, జొమాటో లాంటి వాటికోసం తమ డబ్బును వృధా చేసుకోవాలని భావించడం లేదని మింట్ నివేదించింది. ఇన్‌హౌస్ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అనేకమంది ఉద్యోగులను కూడా తొలగించనుంది. సుమారు 40మంది ఎంట్రీ-మిడ్ స్థాయి సిబ్బందిని తొలగించనుంది. 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ కాంట్రాక్టులను రద్దు చేసింది. అయితే ఫుడ్ పాండా ప్రైవేటు లేబుల్స్ క్రింద తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. గత ఏడాది స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్ పోటీపడేందుకు ఫుడ్‌పాండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోలకు రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా, ఫుడ్ పాండా రోజు 5వేల ఆర్డర్లను సాధిస్తోందట. కాగా 2017లో సుమారు 200 కోట్ల రూపాయలతో (30-40 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆహార పంపిణీ సంస్థలో ఓలా కూడా 200 మిలియన్ల డార్లు (సుమారు రూ.1300 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. -
ఆ రాత్రి 20,000 ప్లేట్ల బిర్యానీ లాగించారు..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నూతన సంవత్సర వేడుకలంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. 2018కి వీడ్కోలు పలుకుతూ 2019కు స్వాగతం చెబుతూ డిసెంబర్ 31 రాత్రి భారత్‌లో వేడుకలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలు 20,000కు పైగా ప్లేట్ల బిర్యానీని లాగించేశారని వెల్లడైంది. డిసెంబర్ 31 రాత్రి దేశమంతటా వేలాది బిర్యానీ ప్లేట్లు సరఫరా చేశారని, కొత్త ఏడాదికి అరగంట చేరువలోనే వందలాది ఆర్డర్లను అందచేశారని ఆహార ఆర్డర్, సరఫరా సంస్థ ఫుడ్‌పండా పేర్కొంది. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ జనం బిర్యానీతో పాటు బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్, చికెన్ రోల్స్, బర్గర్లు, ఫ్రైడ్ రైస్‌ను ఆస్వాదించారని తెలిపింది. 2018 చివరి రోజున హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూర్, ముంబై, వైజాగ్ల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. హైదరాబాదీలు ఎక్కువగా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయగా, ముంబై వాసులు మిల్క్‌షేక్‌లు, బర్గర్ల వైపు మొగ్గుచూపారని,ఇక దేశ రాజధాని ఢిల్లీ పౌరులు టిక్కా, బటర్ చికెన్లను ఇష్టంగా తిన్నారని తేలింది. ఇక ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎక్కువగా చక్కెర లేని జ్యూస్‌లు, సలాడ్లను ఆర్డర్ చేశారని ఫుడ్‌పండా పేర్కొంది. -
ఓలా చేతికి ఫుడ్‌పాండా: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఫుడ్‌పాండా భారత వ్యాపార్యాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఓలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్‌కు చెందిన డెలివరీ హీరో గ్రూప్ నుంచి ఫుడ్‌పాండా భారత వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఓలా ప్రకటించింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆహారపదార్ధాల వ్యాపారం ఓలాకు బదిలీ అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్ల బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు. 2014 లో, ఓలా కేఫేతో ఓలా ఆహార పంపిణీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తన సేవలను విస్తరించింది. తరువాత మూసివేసింది. అయితే ఉబెర్ ఈట్స్‌కు పోటీగా ఫుడ్ పంపిణీ వ్యాపారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో ఫుడ్‌పాండాను కొనుగోలు చేయడం కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్‌లైన ఫుడ్ సర్వీసుల సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి. ఇండియాలో ఫుడ్ సర్వీసులను మరింత అభివృద్ధి చేసే కృషిలో ఈ భాగస్వామ్యంపై సంతోషిస్తున్నామని, ఫుడ్ పాండా ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. తమ తాజా భాగస్వామ్యం మార్కెట్ల ఏకీకరణకు అనుమతిస్తుందని డెలివరీ హీరో గ్రూపు సహ-వ్యవస్థాపకుడు, సీఈవో నిక్లాస్ ఓస్టర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓలాలో తమ వాటా చాలా విలువైన ఆస్తిగా పరిగణిస్తామన్నారు. -
సీఫుడ్డే సో బెటరు..
* చేప వంటకాలపై హైదరాబాదీల మక్కువ.. * ఫుడ్‌పాండా.ఐఎన్ సర్వేలో వెల్లడి * తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగర వాసులు సీఫుడ్స్ అంటే లొట్టలు వేస్తున్నారట.. ఆన్లైన్లో చేపలు,రొయ్యలు వంటి వంటకాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నట్టు ఆన్లైన్లో ఆహార పదార్థాలను విక్రయించే ప్రముఖ వెబ్సైట్ ఫుడ్‌పాండా.ఐఎన్ దేశంలోని పలు నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. ఇందులో బెంగళూరు నగరం తొలిస్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండోస్థానంలో నిలవడం విశేషం. మూడో స్థానాన్ని ముంబ యి దక్కించుకుంది. ఇక సముద్ర ఉత్పత్తులతో చేసిన వంటకాల ధర కాస్త ఎక్కువైనా ఆర్డరిచ్చే విషయంలో వెనుకాడక పోవడం గమనార్హం. గృహ వినియోగదారులు సైతం సముద్ర ఉత్పత్తులను కడుపారా ఆరగించేందుకు రూ.1500 నుంచి రూ.2400 వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని ఈ సర్వేలో తెలింది. చేపముల్లు ఆనవాళ్లు లేని అపోలో ఫిష్ వంటకమంటే గ్రేటర్ వాసులు లొట్టలేస్తున్నారని తెలిపింది. బెంగళూరు వాసులు ఫిష్ బిర్యానీ అంటే మనసు పారేసుకుంటున్నారని తెలిపింది. ఇక ముంబయి, చెన్నై ప్రజలు రొయ్యలంటే మక్కువగా లాగించేస్తున్నారట. సీఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేయడంలో ముంబయి వాసులు మూడోస్థానంలో నిలిచారని ఈ సర్వే తెలిపింది. ఈ సిటీ వాసులు రొయ్యలు, ఫిష్ తావా కబాబ్‌లను మనసారా ఆరగిస్తున్నారంది. హైదరాబాద్ నగరంలో అపోలో ఫిష్‌తోపాటు, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వంటకాలంటే ఇష్టపడుతున్నట్టు తెలిపింది. సంప్రదాయ వంటకాలకే మొగ్గు.. ప్రయోగాలకంటే సంప్రదాయ వంటకాలకే దేశంలోని పలు సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది. ఫిష్ టిక్కా, చేపల కూర, పులుసు, బిర్యానీకి గిరాకీ బాగుందని తెలిపింది. సముద్ర తీరం ఉన్న నగరాల కంటే తీరం అందుబాటులో లేని హైదరాబాద్ నగరంలో సీఫుడ్‌కు ఆన్లైన్ గిరాకీ అధికమని తేల్చింది. గోవా, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ఆన్లైన్లో సీఫుడ్ ఆర్డర్ చేసే వారు కనిష్ట సంఖ్యలో ఉన్నారని తెలిపింది.